గూగుల్ పిక్సల్ 10 ప్రో స్మార్ట్‌ఫోన్ డిజైన్ విడుదల.. స్పెసిఫికేషన్లు, ఫీచర్లు, విడుదల తేదీ వివరాలు..!
గూగుల్ పిక్సల్ 10 సిరీస్ ఆగస్టు 20 న నిర్వహించనున్న మేడ్ బై గూగుల్ ఈవెంట్‌లో విడుదల కానున్నాయి. ఈ సిరీస్‌లో భాగంగా పిక్సల్ 10, పిక్సల్ 10 ప్రో, పిక్సల్ 10 ప్రో XL తోపాటు పిక్సల్ 10 ప్రో ఫోల్డ్ మోడల్ కూడా లాంచ్ కానుందని తెలుస్తోంది. ఈ సిరీస్ గురించి ఇప్పటికే అనేక వివరాలు వెల్లడయ్యాయి. అయితే తాజాగా గూగుల్ పిక్సల్ 10 ప్రో డిజైన్ వివరాలు వెల్లడయ్యాయి.
గూగుల్ స్టోర్ సబ్‌స్క్రైబర్‌లకు పిక్సల్ 10 సిరీస్ అప్‌డేట్స్ అందిస్తోంది. గూగుల్ స్టోర్‌లోని వీడియో క్లిప్ ఆధారంగా గూగుల్ పిక్సల్ 10 ప్రో డిజైన్ వివరాలు వెల్లడయ్యాయి. ఈ హ్యాండ్‌సెట్ చాలా వరకు పిక్సల్ 9 ప్రో మోడల్‌ను పోలి ఉంది. దీని ద్వారా కెమెరా మాడ్యూల్ డిజైన్‌ను కూడా కలిగి ఉంది.

ఈ హ్యాంసెట్ మ్యాటీ బ్యాక్ ప్యానల్‌ను కలిగి ఉంది. ఈ ప్యానల్ గూగుల్ లోగో, గ్లోసీ ఫ్రేమ్‌తో అందుబాటులోకి రానుంది. ఈ ఫోన్ పవర్ మరియు వాల్యూమ్ బటన్లు కుడి వైపున ఉంటాయి. ఈ ఫోన్ మూన్‌స్టోన్ కలర్ వేరియంట్‌లో లభిస్తుంది. కెమెరా మాడ్యూల్ పరంగా పిల్ షేప్‌ను కలిగి ఉంటుంది.
వీరికి ప్రత్యేక ఆఫర్ :
ఆగస్టు 19 వ తేదీ మధ్యాహ్నం 12:30 IST గంటల వరకు రిజిస్టర్ చేసుకున్న గూగుల్ స్టోర్ సబ్‌స్క్రైబర్‌లకు పిక్సల్ 10 సిరీస్ ఫోన్‌లకు వర్తించే ప్రత్యేక ఆఫర్ లభిస్తుందని వెల్లడించింది. గూగుల్ తన ఫోన్‌ల అనేక వివరాలను ముందుగానే వెల్లడిస్తోంది.
గూగుల్ పిక్సల్ 10 సిరీస్ స్పెసిఫికేషన్‌లు :
గూగుల్ పిక్సల్ 10 (Google Pixel 10) స్టాండర్డ్ వేరియంట్ 120Hz రీఫ్రెష్ రేట్‌తో 6.3 అంగుళాల FHD+ ఫ్లాట్ OLED డిస్‌ప్లేను కలిగి ఉంటుంది. 29E వైర్ ఛార్జింగ్, 15W వైర్‌లెస్ ఛార్జింగ్ సపోర్టుతో 4970mAh బ్యాటరీతో పనిచేస్తుంది.
ఈ ఫోన్ కెమెరా విభాగం పరంగా వెనుక వైపు ట్రిపుల్ కెమెరాలను కలిగి ఉంటుంది. ఇందులో 50MP ప్రైమరీ కెమెరా, 12MP మరియు 5x ఆప్టికల్ జూమ్‌తో 10.8MP టెలిఫోటో కెమెరాను కలిగి ఉంది. సెల్ఫీ, వీడియో కాల్స్ కోసం 10.5MP కెమెరాను కలిగి ఉంది.
గూగుల్ పిక్సల్ 10 ప్రో మోడల్స్ స్పెసిఫికేషన్‌లు :
పిక్సల్ 10 ప్రో మరియు పిక్సల్ 10 ప్రో XL మోడల్స్ 6.3 అంగుళాలు, 6.8 అంగుళాల LTPO OLED డిస్‌ప్లేను కలిగి ఉన్నాయి. ఈ రెండు మోడల్స్ 1.5K రిజల్యూషన్, 120Hz రీఫ్రెష్ రేట్‌ను కలిగి ఉంటాయి. గూగుల్ Tensor G5 చిప్‌సెట్‌తో పనిచేస్తుంది.
ఈ ప్రో మోడల్స్ కెమెరా విభాగం పరంగా 50MP ప్రైమరీ కెమెరా, 48MP అల్ట్రావైడ్ కెమెరా మరియు 5x ఆప్టికల్ జూమ్‌తో 48MP పెరిస్కోప్‌ను కలిగి ఉంటుంది. మరియు 42MP సెల్ఫీ కెమెరాను కలిగి ఉంటుందని తెలుస్తోంది. ఇది భారీ మార్పుగానే పరిగణించాల్సి ఉంటుంది.
పిక్సల్ 10 ప్రో మోడల్ 29W వైర్ ఛార్జింగ్ సపోర్టుతో 4870mAh బ్యాటరీని కలిగి ఉంటుంది. అదే పిక్సల్ 10 ప్రో XL మోడల్ 39W ఛార్జింగ్, 15W వైర్‌లెస్ ఛార్జింగ్ సపోర్టుతో 5200mAh బ్యాటరీతో అందుబాటులోకి వస్తుంది.


Click it and Unblock the Notifications








