Home
Mobile

గూగుల్‌ పిక్సల్‌ 10 స్మార్ట్‌ఫోన్‌ విడుదల.. టెన్సార్‌ G5 ప్రాసెసర్, 7 సంవత్సరాల వరకు అప్‌డేట్స్!

Google Pixel 10 Smartphone : గూగుల్‌ నుంచి ఎప్పటి నుంచో ఎదురుచూస్తున్న గూగుల్‌ పిక్సల్ 10 సిరీస్‌ విడుదల అయింది. మేడ్‌ బై గూగుల్‌ ఈవెంట్‌ లో ఈ ఫోన్లను లాంచ్‌ చేసింది. ఇందులో పిక్సల్ 10, పిక్సల్‌ 10 ప్రో, పిక్సల్‌ 10 ప్రో, పిక్సల్‌ 10 ప్రో XL మోడల్స్‌ అందుబాటులోకి వచ్చాయి. ఈ ఫోన్‌లు గూగుల్‌ టెన్సార్‌ G5 చిప్‌, టైటాన్‌ M2 సెక్యూరిటీ చిప్‌ ను కలిగి ఉన్నాయి. గూగుల్‌ పిక్సల్‌ 10 స్మార్ట్‌ఫోన్ పూర్తి స్పెసిఫికేషన్లు, ఫీచర్ల వివరాలు.

గూగుల్‌ పిక్సల్‌ 10 స్మార్ట్‌ఫోన్‌ :
ఈ స్మార్ట్‌ఫోన్ 6.3 అంగుళాల ఫుల్‌ HD+ OLED సూపర్ అక్వా డిస్‌ప్లేను కలిగి ఉంది. 120Hz రీఫ్రెష్‌ రేట్‌, 3000 నిట్స్ పీక్‌ బ్రైట్‌నెస్‌ ను కలిగి ఉంది. ఈ ఫోన్ డిస్‌ప్లే, వెనుక వైపు ప్యానల్‌ కూడా గొరిల్లా గ్లాస్ విక్టస్‌ 2 ప్రొటెక్షన్‌ ను పొందుతాయి.

Google pixel 10 Smartphone

చిప్‌సెట్ వివరాలు :
పిక్సల్‌ 10 స్మార్ట్‌ఫోన్‌ 3nm టెన్సార్‌ G5 SoC చిప్‌సెట్‌తో పనిచేస్తుంది. మరియు టైటాన్‌ M2 చిప్‌ను కూడా అమర్చి ఉంది. ఈ చిప్‌సెట్ 12GB ర్యామ్, 256GB స్టోరేజీని సపోర్టు చేస్తుంది. ఆండ్రాయిడ్ 16 ఆధారిత OS పైన పనిచేస్తుంది.

7 సంవత్సరాల వరకు అప్‌డేట్స్ :
ఈ ఫోన్‌ 7 ఆండ్రాయిడ్ OS అప్‌డేట్స్‌, 7 సంవత్సరాల సెక్యూరిటీ అప్‌డేట్స్‌ను పొందుతుంది. ఈ ఫోన్‌ వేపర్ కూలింగ్‌ ఛాంబర్‌ను కలిగి ఉంది. 30W ఫాస్ట్‌ ఛార్జింగ్ సపోర్టుతో 4970mAh బ్యాటరీని కలిగి ఉంది. ఈ ఫోన్‌ 15W Qi2 వైర్‌లైస్ ఛార్జింగ్‌ సపోర్టు కూడా కలిగి ఉంది.

ఈ ఫోన్‌ వెనుక వైపు ట్రిపుల్‌ కెమెరాలను కలిగి ఉంది. 48MP ప్రైమరీ కెమెరా, 5x జూమ్‌తో 10.8MP టెలిఫోటో లెన్స్, 13MP అల్ట్రావైడ్‌ కెమెరాను కలిగి ఉంది. సెల్ఫీ, వీడియో కాల్స్‌ కోసం 10.5MP కెమెరాను అమర్చారు. ఈ ఫోన్‌ అనేక ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ ఆధారిత టూల్స్‌ను కలిగి ఉంది.

పిక్సల్‌ 10 ఫోన్‌ IP68 రేటింగ్‌తో డస్ట్‌ మరియు వాటర్‌ రెసిస్టెంట్‌గా ఉంది. సెక్యూరిటీ పరంగా ఇన్-డిస్‌ప్లే ఫింగర్‌ ప్రింట్ సెన్సార్‌ను కలిగి ఉంది. e-SIM, 5G, 4G, బ్లూటూత్‌ 6, వైఫై, GPS, NFC, USB-C ఛార్జింగ్ పోర్టును కలిగి ఉంది.

Google pixel 10 Smartphone

గూగుల్ పిక్సల్‌ సిరీస్ ధర సేల్ వివరాలు :
గూగుల్‌ పిక్సల్‌ 10 స్మార్ట్‌ఫోన్ 256GB స్టోరేజీ వేరియంట్‌ ధర రూ.79999 గా ఉంది. ఈ ఫోన్ ఇండిగో, ప్రాస్ట్‌, లెమన్‌ గ్రాస్‌, ఒబ్సిడియన్‌ కలర్ వేరియంట్స్‌లో లభిస్తుంది. ఈ ఫోన్‌ ఫ్లిప్‌కార్ట్‌ ద్వారా సేల్‌ ప్రారంభం కానుంది.

గూగుల్‌ పిక్సల్‌ 10 స్మార్ట్‌ఫోన్‌ :
డిస్‌ప్లే : 6.3 అంగుళాల డిస్‌ప్లే
ప్రాసెసర్‌ : టెన్సార్‌ G5 SoC చిప్‌సెట్‌
OS : ఆండ్రాయిడ్‌ 16, 7 సంవత్సరాల వరకు అప్‌డేట్స్‌
బ్యాటరీ : 4970mAh, 30W ఫాస్ట్‌ ఛార్జింగ్, 15W Qi2 వైర్‌లైస్ ఛార్జింగ్‌
కెమెరాలు : 48MP, 10.8 టెలిఫోటో, 13MP, 10.5MP (సెల్ఫీ)

More from GizBot

Best Mobiles in India

English summary
Google pixel 10 Smartphone launched in india with Tensor G5 Chip here are the specs and features
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X