₹75 వేల బడ్జెట్‌లో పిక్సెల్ 10 vs శామ్‌సంగ్ S26 FE: మీ డబ్బుకు సరైన విలువ ఇచ్చే ఫోన్ ఏది?
అక్టోబర్ 24 నుంచి పండగ ఆఫర్లు సందడి చేస్తుండటంతో, ₹50,000 నుంచి ₹75,000 బడ్జెట్‌లో మంచి స్మార్ట్‌ఫోన్ కొనాలనుకునే వారికి కాస్త గందరగోళంగానే ఉంది. గూగుల్ స్టోర్‌లో పిక్సెల్ 10 అసలు ధర ₹79,999 కాగా, ప్రస్తుతం ₹74,999కే లభిస్తోంది. దీనికి తోడు HDFC లేదా ICICI బ్యాంక్ కార్డ్ EMI పై ₹5,000 ఇన్‌స్టంట్ క్యాష్‌బ్యాక్, అలాగే ₹1,000 ఎక్స్ఛేంజ్ బోనస్ కూడా ఇస్తున్నారు. ఇక శామ్‌సంగ్ గెలాక్సీ S26 FE విషయానికొస్తే, దీని ధర ₹79,999. అయితే దీనిపై ₹7,000 బ్యాంక్ క్యాష్‌బ్యాక్ లేదా ₹8,000 అప్‌గ్రేడ్ బోనస్ పొందే అవకాశం ఉంది.
అయితే ఈ ఆఫర్లు, లభ్యత అనేవి మీరు కొనే ప్లాట్‌ఫామ్ లేదా దుకాణాన్ని బట్టి మారుతుంటాయి. శామ్‌సంగ్ ఈ ఫోన్‌ను సెప్టెంబర్ 18 నుంచే భారత్‌లో విక్రయిస్తుండటంతో గెలాక్సీ S26 FE సులభంగానే అందుబాటులో ఉంది. గూగుల్ పిక్సెల్ 10 మాత్రం కొన్ని పరిమిత రిటైల్ దుకాణాల్లోనే కనిపిస్తోంది. ఇటీవల విజయ్ సేల్స్‌లో పండగ ఆఫర్ కింద ఇది దాదాపు ₹65,000 ధరకే లభించినట్లు వార్తలొచ్చాయి. కాకపోతే ఈ ఆఫర్లు, బ్యాంక్ డిస్కౌంట్లు నగరాలను బట్టి మారవచ్చు. కాబట్టి ఫోన్ కొనేముందు ఎక్స్ఛేంజ్ నిబంధనలను ఒకసారి సరిచూసుకోవడం మంచిది.

పిక్సెల్ 10 vs గెలాక్సీ S26 FE కెమెరాలు
పిక్సెల్ 10లోని ట్రిపుల్ కెమెరా సెటప్‌లో 5x టెలిఫోటో లెన్స్ ఉంది. ఇది 10-బిట్ HDR వీడియోలను రికార్డ్ చేస్తుంది. పగటిపూట అద్భుతమైన ఫోటోలతో పాటు చీకటిలోనూ క్రిస్ప్ క్వాలిటీ పిక్చర్లను అందిస్తుంది. దీనికి పోటీగా శామ్‌సంగ్ గెలాక్సీ S26 FEలో నైటోగ్రఫీ (Nightography), సూపర్ స్టెడీ విత్ హారిజాంటల్ లాక్ ఫీచర్లు ఇచ్చారు. ఇది కెమెరాను ఎంత తిప్పినా 4K వీడియోను స్థిరంగా ఉండేలా చూస్తుంది. చేత్తో పట్టుకుని వీడియోలు తీసే వారికి శామ్‌సంగ్‌లోని ఈ లాక్ మోడ్ చాలా బాగా ఉపయోగపడుతుంది.
పిక్సెల్ 10 vs గెలాక్సీ S26 FE పర్ఫార్మెన్స్, బ్యాటరీ
రోజువారీ పనులకు పిక్సెల్ 10లోని టెన్సర్ G5 చిప్‌సెట్ స్మూత్‌గా పనిచేస్తుంది. కానీ హెవీ గేమింగ్ ఆడేటప్పుడు ఫ్రేమ్ రేట్ పడిపోవడం లేదా కాస్త లేగ్ అవ్వడం గమనించవచ్చు. అదే గెలాక్సీ S26 FEలోని ఎక్సినోస్ 2500 చిప్‌సెట్ గ్రాఫిక్స్ పరంగా మెరుగైన స్కోర్లు సాధించి, ఎక్కువసేపు గేమింగ్ ఆడటానికి తోడ్పడుతుంది. ఇక ఛార్జింగ్ విషయానికి వస్తే రెండింటికీ చాలా తేడా ఉంది. శామ్‌సంగ్ కేవలం 30 నిమిషాల్లో 69 శాతం ఛార్జ్ అవుతుంది, పూర్తిగా నిండటానికి దాదాపు 58 నిమిషాలు పడుతుంది. పిక్సెల్ కాస్త నిమ్మదిగా ఛార్జ్ అయినప్పటికీ, మ్యాగ్నెటిక్ సపోర్ట్ కోసం Qi2 మ్యాగ్నెట్స్ ఫీచర్‌ను కలిగి ఉంది.
పిక్సెల్ 10 vs గెలాక్సీ S26 FE AI, కనెక్టివిటీ ఫీచర్లు
పిక్సెల్ 10 ఇన్-బిల్ట్ "జెమిని" AIతో వస్తుంది. ఇందులో కెమెరా కోచ్, మ్యాజిక్ క్యూ వంటి ఫీచర్లతో పాటు ఏడేళ్ల పాటు అప్‌డేట్స్ లభిస్తాయి. ఇక శామ్‌సంగ్ FE మోడల్ గెలాక్సీ AI ఫీచర్లయిన మై ఫ్యాన్‌క్యామ్, ఫోటో అసిస్ట్, నౌ బ్రీఫ్ వంటి వాటిని అందిస్తోంది. అంతేకాదు, ఆరు నెలల గూగుల్ AI ప్రో ట్రయల్‌ను ఉచితంగా ఇస్తోంది. కనెక్టివిటీ పరంగా ఈ రెండు ఫోన్లు భారతదేశంలో లభ్యమయ్యే ప్రధాన 5G బ్యాండ్లు, Wi-Fi 6Eకి సపోర్ట్ చేస్తాయి. నెట్‌వర్క్ ఆపరేటర్ సపోర్ట్ ఉన్న చోట VoNR పనిచేస్తుంది; ప్రస్తుతం జియో దీన్ని విస్తరించే పనిలో ఉంది.
పిక్సెల్ 10 vs గెలాక్సీ S26 FE డీల్ వ్యాల్యూ, రీసేల్ విలువ
ఆఫర్ల పరంగా చూస్తే, గూగుల్ స్టోర్‌లో ఇన్‌స్టంట్ క్యాష్‌బ్యాక్, ఎక్స్ఛేంజ్ ఆఫర్లతో పిక్సెల్ 10 ఫోన్ ₹75,000 కంటే తక్కువ ధరకే లభిస్తోంది. శామ్‌సంగ్ ఫోన్ అసలు ధర ₹79,999 అయినప్పటికీ, బ్యాంక్ క్యాష్‌బ్యాక్ లేదా అప్‌గ్రేడ్ బోనస్‌లతో పిక్సెల్ రేటుకే వస్తుంది. అంతేకాకుండా శామ్‌సంగ్ 'అష్యూర్డ్ బైబ్యాక్' ద్వారా భవిష్యత్తులో 70 శాతం వరకు రీసేల్ వ్యాల్యూ ఇస్తామని హామీ ఇస్తోంది. గూగుల్ ఎక్స్ఛేంజ్ ధరలు మాత్రం క్యాషిఫై (Cashify) అంచనాలపై ఆధారపడి ఉంటాయి. కాబట్టి ఆర్డర్ చేసే ముందు లైవ్ కోట్‌లను చెక్ చేసుకోవడం ఉత్తమం.
మొత్తానికి, నైట్ ఫొటోగ్రఫీ, స్మార్ట్ ఎడిటింగ్ కోరుకునే కంటెంట్ క్రియేటర్లు పిక్సెల్ 10 వైపు మొగ్గు చూపవచ్చు. అదే సమయంలో గేమింగ్ ప్రియులు, బింజ్ వాచర్స్ శామ్‌సంగ్ FE వైపు వెళ్లొచ్చు; ఎందుకంటే ఇందులో పెద్ద స్క్రీన్, ఫాస్ట్ ఛార్జింగ్, స్థిరమైన పర్ఫార్మెన్స్ లభిస్తాయి. తక్కువ బడ్జెట్ ఉన్న విద్యార్థులు ₹70,000 లోపు పిక్సెల్ ఆఫర్ల కోసం రిటైలర్లను సంప్రదించవచ్చు. ఫాస్ట్ ఛార్జింగ్, మంచి రీసేల్ వ్యాల్యూ కోరుకునే ఉద్యోగులకు లేదా నిత్యం ప్రయాణాలు చేసేవారికి శామ్‌సంగ్ ఫోన్ బెస్ట్ ఛాయిస్.


Click it and Unblock the Notifications
