గూగుల్ పిక్సల్ 10a స్మార్ట్‌ఫోన్ లాంచ్ తేదీ, ధర వివరాలు లీక్.. పూర్తి వివరాలు!
Google Pixel 10a Smartphone : గూగుల్ పిక్సల్ 10a స్మార్ట్‌ఫోన్ గురించి ఇటీవల అనేక లీక్స్ వచ్చాయి. గత సంవత్సరం గూగుల్ పిక్సల్ 9a ఫోన్ లాంచ్ కాగా.. త్వరలో పిక్సల్ 10a మోడల్ లాంచ్ కానుందని అంచనా వేస్తున్నారు. అయితే తాజాగా ఈ ఫోన్ లాంచ్ టైమ్‌లైన్ వివరాలు లీక్ అయ్యాయి. భారత్ సహా గ్లోబల్ మార్కెట్ లోనూ ఒకేసారి విడుదల కానుందని తెలుస్తోంది. దీంతోపాటు ధర వివరాలు కూడా లీక్ అయ్యాయి.
గూగుల్ పిక్సల్ 10a స్మార్ట్‌ఫోన్ గురించి కీలక వివరాలను MysteryLupin అనే X యూజర్ షేర్ చేశారు. ఈ వివరాలను ఆండ్రాయిడ్ అథారిటీ తొలుత గుర్తించింది. ఈ సమాచారం ఆధారంగా ఈ హ్యాండ్‌సెట్ భారత్ సహా గ్లోబల్ మార్కెట్ లో ఫిబ్రవరి 17 లో విడుదల కానుందని తెలుస్తోంది.

గూగుల్ పిక్సల్ 10a స్మార్ట్‌ఫోన్ అంచనా వివరాలు! :
లాంచ్ వివరాలతోపాటు ధర సహా ఇతర సమాచారం కూడా లీక్ అయింది. పిక్సల్ 10a స్మార్ట్‌ఫోన్ 6.28 అంగుళాల FHD+ OLED డిస్‌ప్లేను కలిగి ఉంటుంది. ఈ డిస్‌ప్లే 60Hz నుంచి 120Hz రీఫ్రెష్ రేట్ తో లాంచ్ కానుందని అంచనా వేస్తున్నారు.
G4 చిప్‌సెట్! :
ఈ స్మార్ట్‌ఫోన్ Tensor G4 చిప్‌సెట్ తో పనిచేస్తుందని తెలుస్తోంది. ఈ ఫోన్ 8GB ర్యామ్‌తో 128GB, 256GB స్టోరేజీ వేరియంట్స్ లో లభిస్తుందని తెలుస్తోంది. ఈ హ్యాండ్‌సెట్ 23W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్టుతో 5100mAh బ్యాటరీతో పనిచేస్తుందని అంచనా వేస్తున్నారు.
ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ సపోర్టు :
కెమెరా విభాగం పరంగా 48MP ప్రైమరీ కెమెరా, 13MP అల్ట్రావైడ్ లెన్స్ ను కలిగి ఉంటుందని తెలుస్తోంది. ప్రైమరీ కెమెరా OIS (ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్) సపోర్టును కలిగి ఉంటుందని అంచనా వేస్తున్నారు. అయితే సెల్ఫీ, వీడియో కాల్స్ కోసం 13MP కెమెరాతో లాంచ్ కానుందని తెలుస్తోంది.
గూగుల్ పిక్సల్ 10a స్మార్ట్‌ఫోన్ 128GB స్టోరేజీ వేరియంట్ EUR500 (భారత కరెన్సీ ప్రకారం రూ.52,500), 256GB స్టోరేజీ వేరియంట్ ధర EUR 600 (భారత కరెన్సీ ప్రకారం రూ.63050) గా ఉంటుందని అంచనా వేస్తున్నారు.
ఎంత ధరలో అందుబాటులోకి వస్తుంది? :
అయితే భారత్ మార్కెట్ లో మాత్రం ఈ హ్యాండ్‌సెట్ రూ.45 వేల ధర సెగ్మెంట్ లో అందుబాటులోకి వచ్చే అవకాశం ఉందదని అంచనా వేస్తున్నారు. ఈ హ్యాండ్‌సెట్ బెర్రీ, లావెండర్, ఫాగ్, ఒబ్సిడియన్ కలర్ వేరియంట్స్ లో అందుబాటులోకి వస్తుందని భావిస్తున్నారు.
పిక్సల్ 9a కు తర్వాత తరం వెర్షన్‌గా పిక్సల్ 10a అందుబాటులోకి రానుందని తెలుస్తోంది. గత సంవత్సరం మార్చి నెలలో గూగుల్ పిక్సల్ 9a మోడల్ అందుబాటులోకి వచ్చింది. గూగుల్ పిక్సల్ 10a స్మార్ట్‌ఫోన్ లాంచ్ వివరాలతోపాటు స్పెసిఫికేషన్‌లు, ఫీచర్లు, ధర సమాచారం లీక్స్ పై గూగుల్ ఎటువంటి స్పందన తెలియజేయలేదు. అయితే త్వరలో అధికారిక ప్రకటన సహా మరిన్ని వివరాలు అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది.


Click it and Unblock the Notifications








