గూగుల్ పిక్సల్ 10a స్మార్ట్‌ఫోన్ విడుదల.. టెన్సార్ G4 చిప్, ఆండ్రాయిడ్ 16 OS, 7 సంవత్సరాల అప్‌డేట్స్!
Google Pixel 10a Smartphone launch : గూగుల్ పిక్సల్ 10a స్మార్ట్‌ఫోన్ భారత్ సహా గ్లోబల్ మార్కెట్ లో విడుదల అయింది. ఇవాళ్టి నుంచే ముందస్తు బుకింగ్ చేసుకొనేందుకు అవకాశం ఉంది. ఈ ఫోన్ 7 సంవత్సరాల వరకు అప్‌డేట్స్ ను పొందుతుంది. ఈ ఫోన్ టెన్సార్ G4 చిప్‌సెట్, ఆండ్రాయిడ్ 16 పైన పనిచేస్తుంది. ఈ ఫోన్ వైర్‌లెస్ ఛార్జింగ్ ను సపోర్టు చేస్తుంది. ఈ గూగుల్ స్మార్ట్‌ఫోన్ పూర్తి స్పెసిఫికేషన్లు, ఫీచర్ల వివరాలు.
గూగుల్ పిక్సల్ 10a స్పెసిఫికేషన్‌లు, ఫీచర్లు :
ఈ స్మార్ట్‌ఫోన్ 6.3 అంగుళాల Actua డిస్‌ప్లేను కలిగి ఉంది. ఈ డిస్‌ప్లే 120Hz రీఫ్రెష్ రేట్, 3000 నిట్స్ బ్రైట్‌నెస్ ను కలిగి ఉంది. ఈ డిస్‌ప్లే కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 7i ప్రొటెక్షన్ ను పొందుతుందని తెలిపింది.

టెన్సార్ చిప్, 7 సంవత్సరాల వరకు అప్‌డేట్స్ :
ఈ హ్యాండ్‌సెట్ టెన్సార్ G4 చిప్‌సెట్ పైన పనిచేస్తుంది. ఈ చిప్ 8GB ర్యామ్, 256GB స్టోరేజీని సపోర్టు చేస్తుంది. దీంతోపాటు టైటాన్ M2 సెక్యూరిటీ చిప్ ను కలిగి ఉంది. ఆండ్రాయిడ్ 16 ఆధారిత OS పైన పనిచేస్తుంది. 7 ఆండ్రాయిడ్ OS అప్‌డేట్స్, 7 సంవత్సరాల వరకు సెక్యూరిటీ అప్‌డేట్స్ ను పొందుతుంది.
48MP కెమెరా :
కెమెరా విభాగం పరంగా వెనుక వైపు రెండు కెమెరాలున్నాయి. ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ (OIS), f/1.7 అపేచర్ తో 48MP ప్రైమరీ కెమెరా ఉంది. 120 డిగ్రీల ఫీల్డ్‌వ్యూతో 13MP కెమెరా ఉంది. దీంతోపాటు సెల్ఫీ, వీడియో కాల్స్ కోసం 13MP కెమెరా ఉంది.
వైర్‌లెస్ ఛార్జింగ్ సపోర్టు :
గూగుల్ పిక్సల్ 10a స్మార్ట్‌ఫోన్ 30W వైర్ ఛార్జింగ్, వైర్‌లెస్ ఛార్జింగ్ సపోర్టుతో 5100mAh బ్యాటరీతో పనిచేస్తోంది. భద్రత కోసం ఫింగర్ ప్రింట్ సెన్సర్‌ను కలిగి ఉంది. IP68 రేటింగ్‌తో డస్ట్, వాటర్ రెసిస్టెంట్‌గా ఉంది.
కనెక్టివిటీ పరంగా 5G, 4G LTE, బ్లూటూత్ 6, వైఫై 6e, GPS, NFC, QZSS, GLONASS, USB-C ఛార్జింగ్ పోర్టును కలిగి ఉంది. దీంతోపాటు ఇ-కంపాస్, గైరోస్కోప్, బారోమీటర్, జియోమాగ్నటిక్, యాక్సెలిరోమీటర్, ప్రాక్సిమిటీ సెన్సర్ ఉంది.
పిక్సల్ 10a ధర, సేల్ వివరాలు :
ఈ స్మార్ట్‌ఫోన్ 8GB ర్యామ్ + 256GB స్టోరేజీ వేరియంట్ ధర రూ.49999 గా ఉంది. లాంచ్ ఆఫర్‌లో భాగంగా HDFC బ్యాంకు కార్డులపై గరిష్ఠంగా రూ.3000 డిస్కౌంట్‌ను పొందవచ్చు. దీంతోపాటు గరిష్ఠంగా 24 నెలల వరకు నో కాస్ట్ EMI సదుపాయాన్ని కూడా వినియోగించుకోవచ్చు. రూ.3000 ఎక్స్ఛేంజీ బోనస్‌ను పొందవచ్చు.
ఇవాళ్టి నుంచే గూగుల్ ఇండియా ఆన్‌లైన్ స్టోర్, ఫ్లిప్‌కార్ట్ ద్వారా ఈ హ్యాండ్‌సెట్ ముందస్తు బుకింగ్ చేసుకోవచ్చు. మార్చి 6 వ తేదీ నుంచి సేల్ ప్రారంభం కానుంది. బెర్రీ, ఫాగ్, లావెండర్, ఒబ్సిడియన్ కలర్ వేరియంట్స్‌లో లభిస్తుంది.


Click it and Unblock the Notifications








