Home
Mobile

ఇవాళే గూగుల్‌ పిక్సల్‌ 10a స్మార్ట్‌ఫోన్‌ విడుదల.. స్పెసిఫికేషన్‌లు, ఫీచర్ల వివరాలు!

Google Pixel 10a Smartphone Launch : గూగుల్‌ పిక్సల్‌ 10a స్మార్ట్‌ఫోన్‌ గ్లోబల్‌, భారత్‌ మార్కెట్‌ ఇవాళ విడుదల కానుంది. గత సంవత్సరం విడుదల అయిన పిక్సల్‌ 9a స్మార్ట్‌ఫోన్‌ కు తర్వాత తరం వెర్షన్‌ గా లాంచ్ కానుంది. భారత్‌ లో ఈ ఫోన్ ఇవాళ రాత్రి 08:00 గంటలకు విడుదల కానుంది. ఇప్పటికే ఈ హ్యాండ్‌సెట్ గురించి అనేక వివరాలు లీక్‌ అయ్యాయి.

డిస్‌ప్లే అంచనా వివరాలు :
గూగుల్‌ పిక్సల్‌ 10a స్మార్ట్‌ఫోన్ 120Hz రీఫ్రెష్‌ రేట్‌ తో 6.3 అంగుళాల (2424 x 1080 పిక్సల్స్‌) pOLED డిస్‌ప్లేను కలిగి ఉండే అవకాశం ఉంది. ఈ డిస్‌ప్లే గొరిల్లా గ్లాస్‌ 7i ప్రొటెక్షన్‌ ను పొందుతుందని అంచనా వేస్తున్నారు. సెక్యూరిటీ కోసం ఇన్‌-డిస్‌ప్లే ఫింగర్‌ సెన్సర్‌ ను కలిగి ఉంది.

Google Pixel 10a Smartphone

ఈ హ్యాండ్‌సెట్ టెన్సార్‌ G4 చిప్‌ ను కలిగి ఉండే అవకాశం ఉంది. ఈ ప్రాసెసర్‌ 8GB LPDDR5x ర్యామ్, 128GB లేదా. 256GB UFS 3.1 స్టోరేజీని సపోర్టు చేస్తుందని తెలుస్తోంది. ఆండ్రాయిడ్ 16 ఆధారిత OS పైన పనిచేస్తుందని సమాచారం. 7 ఆండ్రాయిడ్ OS అప్‌డేట్స్, 7 సంవత్సరాల వరకు సెక్యూరిటీ అప్‌డేట్స్‌ ను పొందుతుందని తెలుస్తోంది.

వైర్‌లెస్‌ ఛార్జింగ్ సపోర్టు ఉంటుందా? :
ఈ గూగుల్‌ ఫోన్‌ 45W వైర్‌ ఛార్జింగ్‌ సపోర్టుతో 5100mAh బ్యాటరీతో పనిచేస్తుందని అంచనా వేస్తున్నారు. గత సంవత్సరం విడుదల అయిన పిక్సల్‌ 9a ఫోన్ 23W ఛార్జింగ్ సపోర్టును కలిగి ఉంది. అయితే వైర్‌లెస్ ఛార్జింగ్‌ సపోర్టు వివరాలు తెలియాల్సి ఉంది.

రెండు కెమెరాలు :
కెమెరా విభాగం పరంగా పిక్సల్ 10a స్మార్ట్‌ఫోన్ వెనుక వైపు రెండు కెమెరాలు ఉంటాయని తెలుస్తోంది. ఇందులో 48MP ప్రైమరీ కెమెరా, 13MP అల్ట్రావైడ్‌ లెన్స్‌ ఉండే అవకాశం ఉంది. ముందు వైపు 13MP సెల్ఫీ కెమెరాతో లాంచ్ అయ్యే అవకాశం ఉంది.

ఎంత ధరలో అందుబాటులోకి రానుంది ? :
రిపోర్టుల ఆధారంగా పిక్సల్‌ 10a స్మార్ట్‌ఫోన్ యూరప్‌ మార్కెట్‌ ధర EUR 499 (భారత కరెన్సీలో సుమారుగా రూ.53,600) గా ఉంటుందని భావిస్తున్నారు. అయితే భారత్‌ మార్కెట్‌ లో ఈ ఫోన్ సుమారుగా రూ.44000 నుంచి రూ.50000 ధర రేంజ్‌ లో అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది.

గూగుల్ పిక్సల్‌ 10a స్మార్ట్‌ఫోన్ విడుదల అనంతరం ముందస్తు బుకింగ్‌ ఇవాళ్టి నుంచే ప్రారంభం కానుందని తెలుస్తోంది. ఈ ‌హ్యాండ్‌సెట్‌ ను గూగుల్‌ స్టోర్‌, ఫ్లిప్‌కార్ట్‌ (Flipkart) సహా ఇతర రిటైల్‌ స్టోర్‌ల ద్వారా కొనుగోలు చేయవచ్చు.

ఈ హ్యాండ్‌సెట్ IP68 రేటింగ్‌ తో డస్ట్‌, వాటర్ రెసిస్టెంట్‌ గా ఉంటుందని తెలుస్తోంది. అయితే ఈ హ్యండ్‌సెట్‌ ఒబ్సిడియన్‌, ఫాగ్‌, లావెండర్‌, బెర్రీ కలర్‌ వేరియంట్స్‌ లో లభించే అవకాశం ఉంది. మరిన్ని వివరాలు విడుదల సమయంలో వెల్లడి కానున్నాయి.

More from GizBot

Best Mobiles in India

English summary
Google Pixel 10a Smartphone Launching today 8PM in india here are the expected specifications
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X