Home
Mobile

ఇవాళ్టి నుంచే గూగుల్‌ ఫోన్‌ సేల్‌.. రూ.3000 డిస్కౌంట్, 24 నెలల వరకు నోకాస్ట్‌ EMI..!

Google Pixel 10a Smartphone Sale : ప్రముఖ స్మార్ట్‌ఫోన్‌ల తయారీ సంస్థ గూగుల్‌ నుంచి ఇటీవల పిక్సల్‌ 10a స్మార్ట్‌ఫోన్‌ విడుదల అయింది. ఈ ఫోన్ ఆండ్రాయిడ్‌ 16 OS, టెన్సార్‌ G4 చిప్‌సెట్‌ ను కలిగి ఉంది. ఈ ఫోన్ 3000 నిట్స్‌ బ్రైట్‌నెస్‌ తో డిస్‌ప్లేను కలిగి ఉంది. ఈ హ్యాండ్‌సెట్‌ ఏకంగా 7 సంవత్సరాల వరకు అప్‌డేట్స్‌ ను పొందుతుంది. భారత్‌ మార్కెట్లో ఇవాళ్టి నుంచే ఈ ఫోన్‌ సేల్‌ ప్రారంభం కానుంది. ఈ ఫోన్ పూర్తి స్పెసిఫికేషన్లు, ఫీచర్లు, సేల్‌ వివరాలు.

గూగుల్‌ పిక్సల్‌ 10a స్మార్ట్‌ఫోన్ ను ఇవాళ్టి నుంచి గూగుల్‌ ఇండియా ఆన్‌లైన్‌ స్టోర్‌, ఫ్లిప్‌కార్ట్‌ (Flipkart) ద్వారా కొనుగోలు చేయవచ్చు. ఈ ఫోన్ 8GB ర్యామ్ + 256GB స్టోరేజీ ధర రూ.49999 గా ఉంది. ప్రారంభ ఆఫర్‌ లో భాగంగా HDFC కార్డులపై రూ.3000 డిస్కౌంట్‌ ను పొందవచ్చు.

Google pixel 10a smartphone

24 నెలల వరకు నోకాస్ట్‌ EMI ఆఫర్లు :
దీంతోపాటు రూ.3000 వరకు ఎక్స్ఛేంజీ బోనస్‌ ను కూడా పొందవచ్చు. గరిష్ఠంగా 24 నెలల వరకు నో కాస్ట్‌ EMI సదుపాయాన్ని పొందవచ్చు. కొత్త పిక్సల్ ఫోన్‌ ఒబ్సిడియన్‌, బెర్రీ, ఫాగ్, లావెండర్‌ కలర్‌ వేరియంట్స్‌ లో లభిస్తుంది.

స్పెసిఫికేషన్లు, ఫీచర్ల వివరాలు :
గూగుల్‌ పిక్సల్‌ 10a స్మార్ట్‌ఫోన్‌ 120Hz రీఫ్రెష్‌ రేట్‌ తో 6.3 అంగుళాల Actua డిస్‌ప్లేను కలిగి ఉంది. ఈ డిస్‌ప్లే 3000 నిట్స్‌ బ్రైట్‌నెస్‌ ను కలిగి ఉంది. కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 7i ప్రొటెక్షన్‌ ను పొందుతుంది. IP68 రేటింగ్‌ తో డస్ట్‌, వాటర్‌ రెసిస్టెంట్‌ గా ఉంది.

7 సంవత్సరాల వరకు అప్‌డేట్స్‌ :
ఈ గూగుల్‌ స్మార్ట్‌ఫోన్‌ టెన్సార్‌ G4 ప్రాసెసర్‌ ను కలిగి ఉంది. టైటాన్‌ M2 సెక్యూరిటీ చిప్‌ ను కూడా అమర్చారు. ఈ ప్రాసెసర్‌ 8GB ర్యామ్, 256GB స్టోరేజీతో జతచేసి ఉంది. ఆండ్రాయిడ్ 16 ఆధారిత OS పైన పనిచేస్తుంది. ఈ ఫోన్‌ 7 ఆండ్రాయిడ్ OS అప్‌డేట్స్‌, 7 సంవత్సరాల వరకు సెక్యూరిటీ అప్‌డేట్స్‌ ను పొందుతుందని గూగుల్‌ హామీ ఇచ్చింది.

50MP కెమెరా :
కెమెరా విభాగం పరంగా OIS (ఆప్టికల్‌ ఇమేజ్ స్టెబిలైజేషన్) సపోర్టుతో 48MP ప్రైమరీ కెమెరా, 120 డిగ్రీల ఫీల్డ్‌వ్యూతో 13MP సెకండరీ కెమెరా ఉన్నాయి. దీంతోపాటు 13MP సెల్ఫీ కెమెరాను అమర్చి ఉంది. 30W వైర్‌ ఛార్జింగ్ సపోర్టుతో 5100mAh బ్యాటరీతో పనిచేస్తుంది. వైర్‌లెస్‌ ఛార్జింగ్‌ ను కూడా సపోర్టు చేస్తుంది.

ఫింగర్‌ ప్రింట్‌ సెన్సర్‌ :
ఈ ఫోన్‌ సెక్యూరిటీ కోసం ఫింగర్‌ ప్రింట్‌ సెన్సర్‌ ఉంది. 5G, 4G LTE, Wi-Fi 6E, బ్లూటూత్ 6, GPS, NFC, QZSS, USB-C ఛార్జింగ్‌ పోర్టు ఉన్నాయి. జియోమాగ్నటిక్‌ సెన్సర్‌, ఇ-కంపాస్, గైరోస్కోప్, బారోమీటర్‌, యాక్సెలిరోమీటర్‌, ప్రాక్సిమిటీ సెన్సర్లు ఉన్నాయి.

More from GizBot

Best Mobiles in India

English summary
Google pixel 10a smartphone sale to start from today, gets rs3000 discount on HDFC bank cards in india
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X