Home
Mobile

గూగుల్‌ పిక్సల్‌ 10a స్మార్ట్‌ఫోన్‌ కీలక వివరాలు లీక్‌.. ఈ నెల 18వ తేదీనే విడుదల..!

Google Pixel 10a Smartphone : గూగుల్ పిక్సల్‌ 10a స్మార్ట్‌ఫోన్ ఇండియా సహా గ్లోబల్‌ మార్కెట్‌ లో ఫిబ్రవరి 18 వ తేదీన విడుదల కానుంది. అదే రోజు నుంచి ముందస్తు బుకింగ్‌ ప్రారంభం కానుంది. ఈ స్మార్ట్‌ఫోన్‌ ఫ్లిప్‌కార్ట్‌తోపాటు ఇతర ప్రముఖ రిటైల్‌ స్టోర్‌లలోనూ అందుబాటులోకి వస్తుంది. గత వేరియంట్‌తో పోలిస్తే కొన్ని మార్పులు మాత్రమే ఉంటాయని తెలుస్తోంది.

డిస్‌ప్లే అంచనా వివరాలు :
గూగుల్ పిక్సల్ 10a స్మార్ట్‌ఫోన్‌ గురించి ఇటీవలే కొన్ని లీక్స్‌ వచ్చాయి. దీని ఆధారంగా 120Hz రీఫ్రెష్‌ రేట్‌ తో 6.3 అంగుళాల (2424 x 1080 పిక్సల్స్‌) pOLED డిస్‌ప్లేను కలిగి ఉండే అవకాశం ఉంది. ఈ డిస్‌ప్లే కార్నింగ్ గొరిల్లా గ్లాస్‌ 7i ప్రొటెక్షన్‌ను పొందుతుందని భావిస్తున్నారు.

Google Pixel 10a leaks

ఆండ్రాయిడ్ 16 OS! :
ఈ గూగుల్‌ ఫోన్‌ టెన్సార్‌ G4 చిప్‌సెట్‌ తో పనిచేస్తుందని అంచనా వేస్తున్నారు. ఈ చిప్‌ 8GB LPDDR5x ర్యామ్‌, 128GB లేదా 256GB UFS 3.1 స్టోరేజీని సపోర్టు చేస్తుందని తెలుస్తోంది. ఆండ్రాయిడ్ 16 ఆధారిత OS పైన పనిచేసే అవకాశం ఉంది.

7 సంవత్సరాల వరకు అప్‌డేట్స్ :
ఈ ఫోన్‌ 7 ఆండ్రాయిడ్‌ OS అప్‌డేట్స్‌, 7 సంవత్సరాల వరకు సెక్యూరిటీ అప్‌డేట్స్‌ ను పొందుతాయని తెలుస్తోంది. బ్యాటరీ, ఛార్జింగ్ పరంగా 45W ఛార్జింగ్‌ సపోర్టుతో 5100mAh బ్యాటరీతో పనిచేసే అవకాశం ఉంది. అయితే వైర్‌లెస్‌ ఛార్జింగ్‌ గురించి ఈ లీక్స్‌ ద్వారా ఎటువంటి వివరాలు వెల్లడి కాలేదు.

48MP ప్రైమరీ కెమెరా! :
కెమెరా విభాగం పరంగా గూగుల్‌ పిక్సల్‌ 10a స్మార్ట్‌ఫోన్‌ వెనుక వైపు రెండు కెమెరాలతో లాంచ్‌ అయ్యే అవకాశం ఉంది. ఇందులో 48MP ప్రైమరీ, 13MP అల్ట్రావైడ్‌ లెన్స్‌ ఉంటుందని భావిస్తున్నారు. సెల్ఫీ, వీడియో కాల్స్‌ కోసం 13MP కెమెరాతో అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది.

ధర అంచనా వివరాలు :
కొన్ని రిపోర్టుల ఆధారంగా ఈ పిక్సల్‌ ఫోన్‌ 8GB ర్యామ్ + 128GB స్టోరేజీ యూరప్ మార్కెట్‌ ధర EUR 499 (భారత్ కరెన్సీలో సుమారుగా రూ.53600) గా ఉంటుందని తెలుస్తోంది. అదే 8GB ర్యామ్ + 256GB స్టోరేజీ ధర రూ. EUR 599 (భారత కరెన్సీ ప్రకారం రూ.64,300) గా ఉంటుందని అంచనా వేస్తున్నారు.

అయితే భారత్‌ మార్కెట్‌ లో ఈ హ్యాండ్‌సెట్ ప్రారంభ ధర రూ.45000 గా ఉంటుందని అంచనా వేస్తున్నారు. దీంతోపాటు ఎంపిక చేసిన బ్యాంకు కార్డులపై అదనపు డిస్కౌంట్‌లను పొందవచ్చు. ఈ ఫోన్‌ ఒబ్సిడియన్‌, ఫాగ్‌, లావెండర్‌, బెర్రీ కలర్‌ వేరియంట్స్‌ లో అందుబాటులో ఉంటుందని భావిస్తున్నారు.

ఈ హ్యాండ్‌సెట్‌ IP68 రేటింగ్‌ తో డస్ట్, వాటర్ రెసిస్టెంట్‌ గా ఉంది. సెక్యూరిటీ కోసం ఇన్‌-డిస్‌ప్లే ఫింగర్‌ ప్రింట్ సెన్సార్‌ ఉంటుందని తెలుస్తోంది. అయితే ఈ స్పెసిఫికేషన్లు, ఫీచర్లపై గూగుల్‌ ఎటువంటి అధికారిక ప్రకటన చేయలేదు.

More from GizBot

Best Mobiles in India

English summary
Google Pixel 10a Smartphone specifications tipped ahead of launch on February 18 2026
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X