పిక్సల్ 2 ఫోన్‌పై రూ. 21 వేలు తగ్గింపు, డీల్ వివరాలు ఇవే..

Written By:

గూగుల్ తన ప్రతిష్టాత్మక స్మార్ట్ ఫోన్ పిక్సల్ 2ని అక్టోబర్ నెలలో లాంచ్ చేసిన సంగతి అందరికీ తెలిసిందే. లాంచింగ్ సమయంలో 64 జిబి వేరియంట్ ధరను రూ. 62 వేలుగా , 128 జిబి ధరను రూ. 71 వేలుగా నిర్ణయించిన సంగతి తెలిసిందే. దీంతో పాటు పిక్సల్ 2 64 జిబి వేరియంట్ ధరను రూ.73 వేలుగా, 128 జిబి వేరియంట్ ధరను రూ. 82వేలుగా నిర్ణయించిన సంగతి తెలిసిందే. అయితే పిక్సల్ 2 ఫోన్ ను ఇప్పుడు రూ. 61 వేల గూగుల్ పిక్సల్ 2 స్మార్ట్‌ఫోన్ రూ. 40 వేలకే సొంతం చేసుకోమని ఫ్లిప్‌కార్ట్ ఆఫర్ ఇస్తోంది.

శాంసంగ్ ఇండియా కంపెనీలో 2500 ఉద్యోగాలు..

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

డిసెంబర్ 7 నుంచి డిసెంబర్ 9 వరకు

గూగుల్ పిక్సల్ 2 పై ఫ్లిప్‌కార్ట్ డిసెంబర్ 7 నుంచి డిసెంబర్ 9 వరకు ఆఫర్ సేల్ నిర్వహిస్తోంది. ఈ ఆఫర్లో మీకు ఈ ఫోన్ పై ఫ్లాట్ డిస్కౌంట్ గా రూ. 11 వేలును అందిస్తోంది.దీంతో పాటు డెబిట్, క్రెడిట్ కార్డు ద్వారా కొనుగోలు చేసేవారు రూ. 10 వేల డిస్కౌంటును పొందవచ్చు.

బై బ్యాక్ గ్యారంటీ ఆఫర్

ఫోన్ పై ఫ్లిప్‌కార్ట్ బై బ్యాక్ గ్యారంటీ ఆఫర్ కూడా అందిస్తోంది. మీరు ఈ ఫోన్ కొన్న తరువాత కొన్ని రోజులు వాడి నచ్చకుంటే తిరిగి ఇచ్చేయవచ్చు. ఇలా ఇచ్చినందుకు ఫ్లిప్‌కార్ట్ మీకు రూ. 35 వేలు తిరిగి ఇస్తుంది.

వన్‌ప్లస్ 5టీకి పోటీ..

వన్‌ప్లస్ 5టీ అమెజాన్లో అమ్మకానికి వస్తున్న నేపథ్యంలో ఫ్లిప్‌కార్ట్ పిక్సల్ 2 ఫోన్ పై ఈ ఆఫర్ ని ప్రకటించింది. కాగా వన్‌ప్లస్ 5టీ 6జిబి ర్యామ్ ధర రూ. 32,999గా ఉంది. 8 జిబి వేరియంట్ ధర రూ. 37,999గా ఉంది. ఈ ఫోన్ డిసెంబర్ 7 నుంచి అమెజాన్లో అమ్మకానికి వస్తోంది.

గూగుల్ పిక్సల్ 2 ఫీచర్లు

5 అంగుళాల డిస్‌ప్లే 4జీబీ ర్యామ్‌ 64జీబీ/128 జీబీ ఇంటర్నల్‌ మెమొరీ ఆండ్రాయిడ్‌ ఓరియో ఆపరేటింగ్‌ సిస్టమ్‌ 8 మెగాపిక్సెల్‌ ముందు కెమెరా 12.2 మెగాపిక్సెల్‌ వెనుక కెమెరా 2700 ఎంఏహెచ్‌ బ్యాటరీ సామర్థ్యం

వన్‌ప్లస్‌ 5టీ ఫీచర్లు

6 అంగుళాల అప్టిక్‌ అమోలెడ్‌ డిస్‌ప్లే ప్రొటెక్షన్‌ కోసం గొర్రిల్లా గ్లాస్‌ 5 ఆక్టాకోర్‌ స్నాప్‌డ్రాగన్‌ 835 ప్రాసెసర్‌ 6జీబీ ర్యామ్‌, 64జీబీ ఇంటర్నల్‌ స్టోరేజ్‌ 8జీబీ ర్యామ్‌, 128జీబీ ఇంటర్నల్‌ స్టోరేజ్‌ ఆక్సీజెన్‌ఓఎస్‌ ఆధారిత ఆండ్రాయిడ్‌ 7.1.1 నోగట్‌తో రన్నింగ్‌ రెండు ప్రైమరీ కెమెరాలు, ఒకటి 20మెగాపిక్సెల్‌ సెన్సార్‌, రెండోది 16 మెగాపిక్సెల్‌ మోడ్యూల్‌ ముందు వైపు 16 మెగాపిక్సెల్‌ కెమెరా తక్కువ వెలుతురులో కూడా మెరుగైన ఇమేజ్‌లు తీయడం దీని ప్రత్యేకత 3,300 ఎమ్ఏహెచ్ బ్యాటరీ‌ ఫింగర్‌ప్రింట్‌ స్కానర్‌

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Google Pixel 2 at Rs 39,999 on Flipkart: Here’s how to get More news at Gizbot Telugu
Please Wait while comments are loading...
Opinion Poll

Social Counting