భారీగా తగ్గిన గూగుల్ పిక్సల్ 2 సీరిస్ ఫోన్లు

Written By:

గూగుల్ ప్రతిష్టాత్మక ఫోన్లు గూగుల్‌ పిక్సెల్‌ 2, పిక్సెల్‌ 2 ఎక్స్‌ ఎల్‌ ధరలు భారీగా తగ్గిపోయాయి. క్రిస్ మస్ హాలిడే సీజన్ కింద ఈ ఫోన్లపై గూగుల్ పరిమిత కాల ఆఫర్లను ప్రకటించింది. దీంతో పాటు క్రెడిట్ కార్డు చెల్లింపుపై కూడా కంపెనీ భారీ స్టాయిలో క్యాష్‌బ్యాక్ ఆఫర్లను ప్రకటించింది. కాగా డిసెంబర్‌ 31 వరకు క్యాష్‌ బ్యాక్‌ ఆఫర్‌ ఉన్నట్టు తెలిపింది. ఈ ఆఫర్‌ ఫ్లిప్‌కార్ట్‌తో పాటు ఇతర ఆఫ్‌లైన్‌ స్టోర్లలో కూడా అందుబాటులో ఉంటుంది.

యూట్యూబ్ మరచిపోండి, అమెజాన్ ట్యూబ్ వస్తోంది !

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

పిక్సెల్ 2

పిక్సెల్ 2 64జీబీ,128జీబీ వేరియంట్లకు రూ. 11,001పరిమిత కాలం డిస్కౌంట్‌ అందిస్తోంది. పిక్సెల్ 2ఎక్స్‌ఎల్‌ 64జీబీ, 128జీబీ వేరియంట్లపై రూ. 5.001 తగ్గింపును అందిస్తోంది.

క్రెడిట్‌ కార్డ్‌ కొనుగోళ్లపై

దీంతో పాటు హెచ్‌డీఎఫ్‌సీ భాగస్వామ్యంతో క్రెడిట్‌ కార్డ్‌ కొనుగోళ్లపై క్యాష్‌బ్యాక్‌ ఆఫర్‌ ఇస్తోంది. హెచ్‌డీఎఫ్‌సీ క్రెడిట్‌ కార్డు కొనుగోలు ద్వారా రూ. 8వేల డిస్కౌంట్‌తో పిక్సెల్ 2 (64జీబీ) రూ. 41,999కి (ఎంఆర్‌పి రూ.61వేలు) లభించనుంది.

పిక్సెల్ 2 ఎ‍క్స్‌ఎల్‌

పిక్సెల్ 2 128జీబీ రూ. 50,999 (అసలు ధర రూ 70,వేలు), పిక్సెల్ 2 ఎ‍క్స్‌ఎల్‌ 64 జీబీ రూ. 56,999 (అసలు ధర రూ. 73 వేలు), అలాగే 128 జీబీ వెర్షన్‌ రూ.65,999 (అసలు ధర రూ.82వేలు) ధరలో అందుబాటులో ఉంటుంది.

90 రోజుల్లో డిస్కౌంట్‌ క్రెడిట్

కొనుగోలు చేసిన 90 రోజుల్లో డిస్కౌంట్‌ క్రెడిట్ అవుతుంది. హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ క్రెడిట్ కార్డు లావాదేవీకి మాత్రమే వర్తించే క్యాష్‌ బ్యాక్‌ ఆఫర్ డిసెంబరు 31 వరకు అందుబాటులో ఉంటుందని కంపెనీ ప్రకటించింది.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Google Pixel 2, Pixel 2 XL get price-cut in India, now start at Rs 42,000 More News at Gizbot Telugu
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot