Google Pixel 2,Pixel 2 XL ఫోన్లు లాంచ్, ఈ ఫోన్లకు చిక్కులేనా..?

గూగుల్ కొత్త ఫోన్లు వచ్చేశాయ్, ఇండియాలో అక్టోబర్‌ 26 నుంచి ఫోన్ల ప్రీ ఆర్డర్లు ప్రారంభం

By Hazarath
|

సెర్చ్ ఇంజిన్‌లో దూసుకుపోతున్న గూగుల్ స్మార్ట్‌ఫోన్‌ మార్కెట్లో సత్తా చాటేందుకు అడుగుపెట్టిన విషయం తెలిసిందే. పిక్సెల్‌, పిక్సెల్‌ ఎక్స్‌ఎల్‌ ఫోన్లను విపణిలోకి తీసుకొచ్చి ఆపిల్ , శాంసంగ్‌లకు సవాలు విసిరింది. అయితే మళ్లీ అదే ఊపులో రెండు కొత్త ఫోన్లను లాంచ్ చేసింది.

తెలియని లింకులు క్లిక్ చేసే ముందు ఈ జాగ్రత్తలు పాటించండితెలియని లింకులు క్లిక్ చేసే ముందు ఈ జాగ్రత్తలు పాటించండి

Google Pixel 2

ప్రపంచ వ్యాప్తంగా ఈ ఫోన్లను అందుబాటులోకి తీసుకొస్తున్నట్లు ప్రకటించింది. ఆండ్రాయిడ్‌ ఓరియో లేటెస్ట్‌ వెర్షన్‌ ఆపరేటింగ్‌ సిస్టమ్‌తో రూపొందించిన ఈ ఫోన్లు త్వరలోనే భారత మార్కెట్లోకి అడుగుపెట్టనున్నాయి. అక్టోబర్‌ 26 నుంచి ఈ ఫోన్ల ప్రీ ఆర్డర్లు ప్రారంభం కానున్నాయి.

రిలయన్స్ భారీ డిస్కౌంట్లు: సగానికి పైగా తగ్గిన Lyf ఫోన్ల ధరలురిలయన్స్ భారీ డిస్కౌంట్లు: సగానికి పైగా తగ్గిన Lyf ఫోన్ల ధరలు

నవంబర్‌ 1 నుంచి పిక్సెల్‌ 2, నవంబర్‌ 15 నుంచి పిక్సెల్‌ 2 ఎక్స్‌ఎల్‌ విక్రయాలు చేపట్టనున్నారు. ఆన్‌లైన్‌ స్టోర్లతో పాటు ఆఫ్‌లైన్‌ స్టోర్లలోనూ ఈ ఫోన్లు వినియోగదారులకు అందుబాటులో ఉండనున్నాయి.

డౌన్‌లోడ్ స్పీడ్‌ని డిసైడ్ చేసేది ఈ ఒక్క అక్షరమే, సమగ్ర విశ్లేషణ కథనండౌన్‌లోడ్ స్పీడ్‌ని డిసైడ్ చేసేది ఈ ఒక్క అక్షరమే, సమగ్ర విశ్లేషణ కథనం

పిక్సెల్‌ 2 ఫోన్‌ ధరలు రూ. 61,000(64జీబీ వేరియంట్‌), రూ. 70,000(128 జీబీ వేరియంట్‌)గా ఉండనున్నాయి. ఇక పిక్సెల్‌ 2 ఎక్స్‌ఎల్‌ ధరలు రూ.73,000(64జీబీ వేరియంట్‌), రూ. 82,000(128జీబీ వేరియంట్‌)గా ఉండనున్నట్లు గూగుల్‌ ప్రకటించింది.

గూగుల్‌ పిక్సెల్‌ 2 ఫీచర్లు

గూగుల్‌ పిక్సెల్‌ 2 ఫీచర్లు

5 అంగుళాల డిస్‌ప్లే
4జీబీ ర్యామ్‌
64జీబీ/128 జీబీ ఇంటర్నల్‌ మెమొరీ
ఆండ్రాయిడ్‌ ఓరియో ఆపరేటింగ్‌ సిస్టమ్‌
8 మెగాపిక్సెల్‌ ముందు కెమెరా
12.2 మెగాపిక్సెల్‌ వెనుక కెమెరా
2700 ఎంఏహెచ్‌ బ్యాటరీ సామర్థ్యం

గూగుల్‌ పిక్సెల్‌ 2 ఎక్స్‌ఎల్‌ ఫీచర్లు

గూగుల్‌ పిక్సెల్‌ 2 ఎక్స్‌ఎల్‌ ఫీచర్లు

6 అంగుళాల డిస్‌ప్లే
4జీబీ ర్యామ్‌
64జీబీ/128 జీబీ ఇంటర్నల్‌ మెమొరీ
ఆండ్రాయిడ్‌ ఓరియో ఆపరేటింగ్‌ సిస్టమ్‌
8 మెగాపిక్సెల్‌ ముందు కెమెరా
12.2 మెగాపిక్సెల్‌ వెనుక కెమెరా
3520 ఎంఏహెచ్‌ బ్యాటరీ సామర్థ్యం

డిజైన్, డిస్‌ప్లే

డిజైన్, డిస్‌ప్లే

పిక్సల్ 2, పిక్సల్ 2 ఎక్స్‌ఎల్ రెండు ఫోన్లను అల్యూమినియం యూనిబాడీతో తయారు చేశారు. దీంతో పాటు ఫోన్లలో యాక్టివ్ ఎడ్జ్ అనే ఫీచర్‌ను ఏర్పాటు చేశారు. ఈ ఫీచర్ ద్వారా గూగుల్ అసిస్టెంట్‌ను త్వరగా ఓపెన్ చేసుకోవచ్చు. పిక్స‌ల్ 2 సాధార‌ణ డిస్‌ప్లేను క‌లిగి ఉండ‌గా, పిక్స‌ల్ 2 ఎక్స్ఎల్‌ను బెజెల్ లెస్ డిస్‌ప్లే త‌ర‌హాలో తీర్చిదిద్దారు. కిండా బ్లూ, జస్ట్ బ్లాక్, క్లియర్లీ వైట్ రంగుల్లో ఈ ఫోన్లు లభిస్తున్నాయి.

ప్రాసెసర్, ర్యామ్, స్టోరేజ్

ప్రాసెసర్, ర్యామ్, స్టోరేజ్

పిక్సల్ 2, పిక్సల్ 2 ఎక్స్‌ఎల్ రెండు ఫోన్లలోనూ ఆక్టాకోర్ స్నాప్‌డ్రాగన్ 835 ప్రాసెసర్, 4 జీబీ ర్యామ్, 64/128 జీబీ స్టోరేజ్, 256 జీబీ ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్ ఫీచర్లు ఉన్నాయి.

కెమెరా, ఆపరేటింగ్ సిస్టమ్

కెమెరా, ఆపరేటింగ్ సిస్టమ్

పిక్సల్ 2, పిక్సల్ 2 ఎక్స్‌ఎల్ ఫోన్లలోని కెమెరాలు ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ (ఓఐఎస్) అనే ఫీచర్ తో వచ్చాయి.దీంతో కెమెరా షేక్ అవుతున్నా ఫొటోలు, వీడియోలు మాత్రం ఎలాంటి షేకింగ్ లేకుండా వస్తాయి. ఇక ఈ కెమెరాకు f/1.8 అపర్చర్ ఉండడంతో ఫొటోలు, వీడియోలు నాణ్యమైన క్వాలిటీతో వస్తాయి. 4కె వీడియో రికార్డింగ్‌ను ఈ కెమెరా సపోర్ట్ చేస్తుంది.

ఇతర ఫీచర్లు

ఇతర ఫీచర్లు

రెండు ఫోన్లలలోనూ ఫింగర్‌ప్రింట్ సెన్సార్, ఐపీ67 వాటర్, డస్ట్ రెసిస్టెంట్, 4జీ వీవోఎల్‌టీఈ, డ్యుయల్ బ్యాండ్ వైఫై, బ్లూటూత్ 5.0 ఎల్‌ఈ, యూఎస్‌బీ టైప్ సి, ఎన్‌ఎఫ్‌సీ వంటి ఫీచర్లు ఉన్నాయి. ఫింగర్ ప్రింట్ సెన్సార్‌ను వెనుక భాగంలో ఏర్పాటు చేశారు. ఇక పిక్సల్ 2లో 2700 ఎంఏహెచ్ కెపాసిటీ ఉన్న బ్యాటరీని ఏర్పాటు చేయగా, పిక్సల్ 2 ఎక్స్‌ఎల్‌లో 3520 ఎంఏహెచ్ సామర్థ్యం ఉన్న బ్యాటరీని అమర్చారు. రెండు ఫోన్లలోనూ ఫాస్ట్ చార్జింగ్ ఫీచర్ ఉంది.

Best Mobiles in India

English summary
Google Pixel 2 pre-orders in India to begin on Oct 26; price, specifications, features Read more News At Gizbot Telugu

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X