గూగుల్ పిక్సల్ 2 ఫోన్లపై భారీ డిస్కౌంట్లు, ఇది రెండో సారి

By Hazarath
|

ప్రముఖ సాఫ్ట్‌వేర్ దిగ్గజ సంస్థ గూగుల్ తన నూతన స్మార్ట్‌ఫోన్లు పిక్సల్ 2, పిక్సల్ 2 ఎక్స్‌ఎల్‌లను గత ఏడాది విడుదల చేసిన విషయం అందరికీ తెలిసిందే. ఆరంభంలో ఈ రెండు ఫోన్ల ప్రారంభ ధరలు రూ.61వేలు, రూ.73వేలుగా ఉండేవి. అయితే గత డిసెంబర్ నెలలో ఈ ఫోన్ల ధరలను గూగుల్ భారీగా తగ్గించింది. దీంతో చాలా తక్కువ ధరకే ఈ ఫోన్లు వినియోగదారులకు అందుబాటులోకి వచ్చాయి. అయితే వీటి ధరలను గూగుల్ ఇంకా తగ్గించింది. తగ్గింపు పొందిన ఫోన్ల ఫీచర్లు, పూర్తి వివరాలపై ఓ లుక్కేయండి.

 

OTGని సపోర్ట్ చేసే స్మార్ట్‌ఫోన్లు, కేవలం రూ. 5 వేలకేOTGని సపోర్ట్ చేసే స్మార్ట్‌ఫోన్లు, కేవలం రూ. 5 వేలకే

ధర

ధర

గూగుల్ పిక్సల్ 2 (64 జీబీ) - రూ.41,999 (రూ.19001 తగ్గింపు)
గూగుల్ పిక్సల్ 2 (128 జీబీ) - రూ.50,999 (రూ.19001 తగ్గింపు)
గూగుల్ పిక్సల్ 2 ఎక్స్‌ఎల్ (64 జీబీ) - రూ.54,999 (రూ.18001 తగ్గింపు)
గూగుల్ పిక్సల్ 2 ఎక్స్‌ఎల్ (128 జీబీ) - రూ.63,999 (రూ.18001 తగ్గింపు)

సిటీ బ్యాంక్ డెబిట్ లేదా క్రెడిట్ కార్డులపై అదనంగా మరో రూ.8వేలు, రూ.10వేల క్యాష్‌బ్యాక్‌

సిటీ బ్యాంక్ డెబిట్ లేదా క్రెడిట్ కార్డులపై అదనంగా మరో రూ.8వేలు, రూ.10వేల క్యాష్‌బ్యాక్‌

ఈ క్రమంలో ప్రస్తుతం ఈ ఫోన్లపై రూ.11001, రూ.8001 ఫ్లాట్ డిస్కౌంట్‌తో పాటు, సిటీ బ్యాంక్ డెబిట్ లేదా క్రెడిట్ కార్డులను ఉపయోగించి ఈ ఫోన్లను కొంటే అదనంగా మరో రూ.8వేలు, రూ.10వేల క్యాష్‌బ్యాక్‌ను కూడా అందిస్తున్నారు. ఈ క్రమంలో డిస్కౌంట్, క్యాష్‌బ్యాక్ కలుపుకుని ఇప్పుడు గూగుల్ పిక్సల్ 2 ఫోన్లు పైన ఇచ్చిన ధరలకు వినియోగదారులకు లభిస్తున్నాయి.

 ఫ్లిప్‌కార్ట్‌తోపాటు..
 

ఫ్లిప్‌కార్ట్‌తోపాటు..

ఈ తగ్గిన ధరలు ఫ్లిప్‌కార్ట్‌తోపాటు పలు ఎంపిక చేసిన ఆఫ్‌లైన్ స్టోర్లలో గూగుల్ పిక్సల్ 2 ఫోన్లను వినియోగదారులు తగ్గింపు ధరలకు కొనవచ్చు. ఇక ఫ్లిప్‌కార్ట్‌లో ఈ ఫోన్లను కొంటే రూ.18వేల వరకు పాత ఫోన్లకు ఎక్స్‌ఛేంజ్ డిస్కౌంట్‌ను ఇస్తున్నారు. ఫోన్లను కొనుగోలు చేసిన 90 రోజులకు క్యాష్ బ్యాక్ వస్తుంది.

ఈ నెల 28వ తేదీ వరకు

ఈ నెల 28వ తేదీ వరకు

ఈ నెల 28వ తేదీ వరకు ధరల తగ్గింపు ఆఫర్ అందుబాటులో ఉంటుంది. తరువాత ధరలు మళ్లీ యధావిధిగా ఉండే అవకాశం ఉండే అవకాశం ఉంది.

గూగుల్‌ పిక్సెల్‌ 2 ఫీచర్లు

గూగుల్‌ పిక్సెల్‌ 2 ఫీచర్లు

 5 అంగుళాల డిస్‌ప్లే 4జీబీ ర్యామ్‌ 64జీబీ/128 జీబీ ఇంటర్నల్‌ మెమొరీ ఆండ్రాయిడ్‌ ఓరియో ఆపరేటింగ్‌ సిస్టమ్‌ 8 మెగాపిక్సెల్‌ ముందు కెమెరా 12.2 మెగాపిక్సెల్‌ వెనుక కెమెరా 2700 ఎంఏహెచ్‌ బ్యాటరీ సామర్థ్యం

గూగుల్‌ పిక్సెల్‌ 2 ఎక్స్‌ఎల్‌ ఫీచర్లు

గూగుల్‌ పిక్సెల్‌ 2 ఎక్స్‌ఎల్‌ ఫీచర్లు

6 అంగుళాల డిస్‌ప్లే 4జీబీ ర్యామ్‌ 64జీబీ/128 జీబీ ఇంటర్నల్‌ మెమొరీ ఆండ్రాయిడ్‌ ఓరియో ఆపరేటింగ్‌ సిస్టమ్‌ 8 మెగాపిక్సెల్‌ ముందు కెమెరా 12.2 మెగాపిక్సెల్‌ వెనుక కెమెరా 3520 ఎంఏహెచ్‌ బ్యాటరీ సామర్థ్యం

డిజైన్, డిస్‌ప్లే

డిజైన్, డిస్‌ప్లే

పిక్సల్ 2, పిక్సల్ 2 ఎక్స్‌ఎల్ రెండు ఫోన్లను అల్యూమినియం యూనిబాడీతో తయారు చేశారు. దీంతో పాటు ఫోన్లలో యాక్టివ్ ఎడ్జ్ అనే ఫీచర్‌ను ఏర్పాటు చేశారు. ఈ ఫీచర్ ద్వారా గూగుల్ అసిస్టెంట్‌ను త్వరగా ఓపెన్ చేసుకోవచ్చు. పిక్స‌ల్ 2 సాధార‌ణ డిస్‌ప్లేను క‌లిగి ఉండ‌గా, పిక్స‌ల్ 2 ఎక్స్ఎల్‌ను బెజెల్ లెస్ డిస్‌ప్లే త‌ర‌హాలో తీర్చిదిద్దారు. కిండా బ్లూ, జస్ట్ బ్లాక్, క్లియర్లీ వైట్ రంగుల్లో ఈ ఫోన్లు లభిస్తున్నాయి.

కెమెరా, ఆపరేటింగ్ సిస్టమ్

కెమెరా, ఆపరేటింగ్ సిస్టమ్

పిక్సల్ 2, పిక్సల్ 2 ఎక్స్‌ఎల్ ఫోన్లలోని కెమెరాలు ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ (ఓఐఎస్) అనే ఫీచర్ తో వచ్చాయి.దీంతో కెమెరా షేక్ అవుతున్నా ఫొటోలు, వీడియోలు మాత్రం ఎలాంటి షేకింగ్ లేకుండా వస్తాయి. ఇక ఈ కెమెరాకు f/1.8 అపర్చర్ ఉండడంతో ఫొటోలు, వీడియోలు నాణ్యమైన క్వాలిటీతో వస్తాయి. 4కె వీడియో రికార్డింగ్‌ను ఈ కెమెరా సపోర్ట్ చేస్తుంది.

Most Read Articles
Best Mobiles in India

English summary
Google Pixel 2 smartphones available at up to Rs 10,000 discount More News at Gizbot Telugu

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X