గూగుల్ కొత్త ఫోన్ ఇదేనా..?
లేటెస్ట్ వర్షన్ ఆండ్రాయిడ్ 8.0 ఆపరేటింగ్ సిస్టం
గూగుల్ పిక్సల్ స్మార్ట్‌ఫోన్‌కు స్వీకెల్‌గా ఈ ఏడాది మార్కెట్లోకి రాబోతోన్న గూగుల్ పిక్సల్ 2 స్మార్ట్‌ఫోన్ పై ఇప్పటికే భారీ అంచనాలు నెలకున్నాయి.ఇప్పటికే ఈ ఫోన్‌కు సంబంధించి పలు కాన్సెప్ట్స్ ఇంటర్నెట్‌లో హల్‌చల్ చేస్తున్నాయి. తాజాగా, కాన్సెప్ట్ క్రియేటర్ అనే యూట్యూబ్ ఛానల్ గూగుల్ పిక్సల్ 2కు సంబంధించిన సరికొత్త కాన్సెప్ట్‌ను మార్కెట్లో రివీల్ చేసింది.
బీఎస్ఎన్ఎల్ 100జీబి ఆఫర్

రెండు స్ర్కీన్ వేరియంట్‌లలో
గూగుల్ పిక్సల్ 2 ఫోన్ రెండు స్ర్కీన్ వేరియంట్‌లలో లభ్యమయ్యే అవకాశముంది. మొదటి వేరియంట్ 5.5 అంగుళాలతో, రెండవ వేరియంట్ 5.1 అంగుళాల స్ర్కీన్‌లతో వచ్చే అవకాశం

శక్తివంతమైన ప్రాసెసర్..
క్వాల్కమ్ రూపొందించిన శక్తివంతమైన Snapdragon 835 octa-core processorను ఈ ఫోన్ లో వినియేగించే అవకాశంది.

6జీబి ర్యామ్ కెపాసిటీ
6జీబి ర్యామ్ కెపాసిటీని అలవోకగా ఈ ప్రాసెసర్ హ్యాండిల్ చేయగలదు. 32జీబి, 64జీబి ఇంకా 128జీబి స్టోరేజ్ వేరియంట్‌లలో ఈ ఫోన్‌లు లభ్యమవయ్యే అవకాశం ఉంది.

ఆండ్రాయిడ్ 8.0 ఆపరేటింగ్ సిస్టం
ఆండ్రాయిడ్ ఓరియో పేరుతో త్వరలో లాంచ్ కాబోతున్న లేటెస్ట్ వర్షన్ ఆండ్రాయిడ్ 8.0 ఆపరేటింగ్ సిస్టం పై గూగుల్ పిక్సల్ 2 రన్ అయ్యే అవకాశం ఉంది.

16 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా
శక్తివంతమైన 16 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరాతో సహా యూఎస్బీ టైప్ సీ, వైర్‌లెస్ ఛార్జింగ్ వంటి విప్లవాత్మక ఫీచర్లను ఈ ఫోన్‌లో పొందుపరచనున్నట్లు రూమర్ మిల్స్ చెబుతున్నాయి.
గూగుల్ పిక్సల్ 2 స్మార్ట్‌ఫోన్ కాన్సెప్ట్ వీడియో..
గూగుల్ పిక్సల్ 2 స్మార్ట్‌ఫోన్ కాన్సెప్ట్ వీడియో..


Click it and Unblock the Notifications








