భారీగా తగ్గిన గూగుల్ పిక్సల్ 2 ఎక్స్ఎల్ ధర

గూగుల్ లేటెస్ట్ స్మార్ట్‌ఫోన్‌ పిక్సెల్‌ 2 ఎక్స్‌ఎల్‌ ధరను గూగుల్ తగ్గించింది.

By Hazarath
|

గూగుల్ లేటెస్ట్ స్మార్ట్‌ఫోన్‌ పిక్సెల్‌ 2 ఎక్స్‌ఎల్‌ ధరను గూగుల్ తగ్గించింది. బెస్ట్ బై' ఆఫర్‌ కింద గూగుల్‌ పిక్సెల్‌ 2 ఎక్స్‌ఎల్‌ స్మార్ట్‌ఫోన్‌ 64జీబీ వేరియంట్‌ను రూ.64,999కు, 128జీబీ స్టోరేజ్‌ వేరియంట్‌ను రూ.73,999కు గూగుల్‌ అందుబాటులోకి తెచ్చింది.అన్ని అధికారిక ఆఫ్‌లైన్‌ రిటైలర్ల వద్ద నగదు, కార్డు లావాదేవీలకు ఈ ధర అందుబాటులో ఉంటుందని తెలిసింది.

 

ఫ్లిప్‌కార్ట్ మరో మూడు రోజుల సేల్, సరికొత్త ఆఫర్లతో..ఫ్లిప్‌కార్ట్ మరో మూడు రోజుల సేల్, సరికొత్త ఆఫర్లతో..

 గూగుల్‌ పిక్సెల్‌ 2 ఎక్స్‌ఎల్‌ ఫీచర్లు...

గూగుల్‌ పిక్సెల్‌ 2 ఎక్స్‌ఎల్‌ ఫీచర్లు...

6 అంగుళాల క్యూహెచ్‌డీ ప్లస్‌ పీ-ఓలెడ్‌ డిస్‌ప్లే
3డీ కార్నింగ్‌ గొర్రిల్లా గ్లాస్‌ 5
క్వాల్‌కామ్‌ స్నాప్‌డ్రాగన్‌ 835 ఎస్‌ఓసీ
4జీబీ ర్యామ్‌
64జీబీ, 128జీబీ స్టోరేజ్‌ వేరియంట్లు
3520 ఎంఏహెచ్‌ బ్యాటరీ
12.2 మెగాపిక్సెల్‌ రియర్‌ కెమెరా

డిసెంబర్‌ 31 వరకు

డిసెంబర్‌ 31 వరకు

డిసెంబర్‌ 31 వరకు ఈ బెస్ట్‌ బై ఆఫర్‌ వాలిడ్‌లో ఉంటుంది. హెచ్‌డీఎఫ్‌సీ డెబిట్‌ కార్డు కొనుగోలుదారులకు అదనంగా రూ.8000 క్యాష్‌బ్యాక్‌ను గూగుల్ అందిస్తుంది. అదేవిధంగా హెచ్‌డీఎఫ్‌సీ ఈఎంఐ లావాదేవీలకు రూ.9000 క్యాష్‌బ్యాక్‌ అందిస్తుంది.

రూ.56,999..

రూ.56,999..

క్యాష్‌బ్యాక్‌తో గూగుల్‌ పిక్సెల్‌ 2 ఎక్స్‌ఎల్‌(64జీబీ వేరియంట్‌) రూ.56,999కు, 128జీబీ మోడల్‌ రూ.65,999కు అందుబాటులోకి వచ్చాయి.

ఎయిర్‌టెల్‌ స్పెషల్‌ డేటా ఆఫర్‌
 

ఎయిర్‌టెల్‌ స్పెషల్‌ డేటా ఆఫర్‌

గూగుల్‌ పిక్సెల్‌ 2 ఎక్స్‌ఎల్‌ కొనుగోలు చేసిన వారికి ఎయిర్‌టెల్‌ స్పెషల్‌ డేటా ఆఫర్‌ చేస్తుంది. ప్రీపెయిడ్‌ రీఛార్జ్‌ రూ.549, పోస్టు పెయిడ్‌ ప్లాన్స్‌ రూ.649, ఆపై మొత్తాలకు ఆరు నెలల పాటు అదనంగా 120జీబీ డేటా అందించనున్నట్టు ఎయిర్‌టెల్‌ ప్రకటించింది. ఈ డేటాను మై ఎయిర్‌టెల్‌ యాప్‌ ద్వారా యాక్టివేట్‌ చేయించుకోవాల్సి ఉంటుంది.

గత వారంలో కూడా..

గత వారంలో కూడా..

గత వారంలో కూడా గూగుల్‌ పిక్సెల్‌ 2 ఎక్స్‌ఎల్‌ స్మార్ట్‌ఫోన్‌ ధరను ఫ్లిప్‌కార్ట్‌ తగ్గించింది. గూగుల్‌ పిక్సెల్‌ 2 ఎక్స్‌ఎల్‌ 64జీబీ వేరియంట్‌ను రూ.67,999కు, పిక్సెల్‌ 2ను రూ.49,999కు ఫ్లిప్‌కార్ట్‌ ఆఫర్‌ చేసింది.

Best Mobiles in India

English summary
Google Pixel 2 XL Available at Rs. 64,999 as Part of New 'Best Buy' Offer More News at Gizbot Telugu

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X