ఐఫోన్ Xకి గూగుల్ ఫిక్సల్ 2 షాక్, నిరాశలో ఫిక్సల్ 2 అభిమానులు..

Written By:

అభిమానులకు గూగుల్ పిక్సెల్‌ 2 ఎక్స్‌ఎల్‌ నిరాశనే మిగిల్చింది. అదే సమయంలో ఐఫోన్ Xకి షాక్ ఇచ్చింది. ఎలా అనుకుంటున్నారా... ఫ్లిప్‌కార్ట్‌లో సేల్‌కి వచ్చిన ఒక్క రోజులోనే ఈ ఫోన్లన్నీ అమ్ముడుపోయాయి. ఫ్లిప్‌కార్ట్‌లో ఈ స్మార్ట్‌ఫోన్‌ బ్లాక్‌ అండ్‌ వైట్‌(పాండ) వెర్షన్‌ అవుటాఫ్‌ స్టాక్‌ అయింది. దీంతో అభిమానులు నిరాశను వ్యక్తం చేస్తున్నారు. దీంతో పాటు ఎప్పటి నుంచో ఈ స్మార్ట్‌ఫోన్‌ కోసం వేచిచూస్తున్న వినియోగదారులు, డెలివరీ ఆలస్యమవుతుండటంతో అసంతృప్తి వ్యక్తంచేస్తున్నారు.

Google Pixel 2,Pixel 2 XL ఫోన్లు లాంచ్, ఈ ఫోన్లకు చిక్కులేనా..?

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

గూగుల్‌ పిక్సెల్‌ 2 ఎక్స్‌ఎల్‌ ఫీచర్లు

6 అంగుళాల క్యూహెచ్‌డీ ప్లస్‌ పీ-ఓలెడ్‌ డిస్‌ప్లే
3డీ కార్నింగ్‌ గొర్రిల్లా గ్లాస్‌ 5
క్వాల్‌కామ్‌ స్నాప్‌డ్రాగన్‌ 835 ఎస్‌ఓసీ
4జీబీ ర్యామ్‌
64జీబీ, 128జీబీ స్టోరేజ్‌ వేరియంట్లు
3520 ఎంఏహెచ్‌ బ్యాటరీ
12.2 మెగాపిక్సెల్‌ రియర్‌ కెమెరా
8 మెగాపిక్సెల్‌ ఫ్రంట్‌ కెమెరా

ధరలు

పిక్సెల్‌ 2 ఫోన్‌ ధరలు రూ. 61,000(64జీబీ వేరియంట్‌), రూ. 70,000(128 జీబీ వేరియంట్‌)గా ఉండనున్నాయి. ఇక పిక్సెల్‌ 2 ఎక్స్‌ఎల్‌ ధరలు రూ.73,000(64జీబీ వేరియంట్‌), రూ. 82,000(128జీబీ వేరియంట్‌)గా ఉండనున్నట్లు గూగుల్‌ ప్రకటించింది.

డెలివరీ లేట్ కావడంపై..

కాగా డెలివరీ లేట్ కావడంపై కొంతమంది కస్టమర్లు ఆన్‌లైన్‌ ఫిర్యాదులు కూడా వేస్తున్నారు. దీంతో ఫ్లిప్‌కార్ట్‌ వారందరికీ ‘‘ గూగుల్‌ పిక్సెల్‌ 2 ఎక్స్‌ఎల్‌ బ్లాక్‌ అండ్‌ వెర్షన్‌(పాండ) స్టాక్స్‌ పొందడంలో అనూహ్య జాప్యాన్ని ఎదుర్కొంటున్నామని తెలియజేయడం బాధాకరంగా ఉంది'' అని కంపెనీ ఓ ఈమెయిల్‌ను పంపింది.

ఈ స్మార్ట్‌ఫోన్‌ ఆలస్యాన్ని..

అధికారికంగా ఈ స్మార్ట్‌ఫోన్‌ ఆలస్యాన్ని ధృవీకరించిన ఫ్లిప్‌కార్ట్‌, డిసెంబర్‌1 వరకు డెలివరీని ప్రారంభిస్తామని పేర్కొంది. డెలివరీని ఆలస్యం చేస్తున్న కారణంగా నష్టపరిహారం కింద 300 రూపాయలను చెల్లించనున్నట్టు తెలిపింది.

గిఫ్ట్‌ కార్డు సెక్షన్‌ రూపంలో ఈ పరిహారం..

డెలివరీ చేసిన అనంతరం ఫ్లిప్‌కార్ట్‌ వాలెట్‌ నుంచి గిఫ్ట్‌ కార్డు సెక్షన్‌ రూపంలో ఈ పరిహారం అందుబాటులో ఉంటుందని వివరించింది. పిక్సెల్‌ 2 స్మార్ట్‌ఫోన్‌ షిప్‌మెంట్‌ను జాప్యం చేసినందుకు గాను గూగుల్‌ కూడా నష్టపరిహారం చెల్లించినట్టు ఆండ్రాయిడ్‌ పోలీసు రిపోర్టు చేసింది.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Google Pixel 2 XL Black & White Pre-Order Shipments Delayed in India, Flipkart Offers Compensation Read more News at Gizbot Telugu
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot