గూగుల్ Pixel 2 XL స్మార్ట్‌ఫోన్‌పై రూ. 27 వేలు తగ్గింపు !
టెక్నాలజీ దిగ్గజం గూగుల్ గత ఏడాది లాంచ్ చేసిన గూగుల్ పిక్సెల్ 2ఎక్స్‌ఎల్ పై భారీ తగ్గింపు ధరతో అందుబాటులోకి రానుంది.
టెక్నాలజీ దిగ్గజం గూగుల్ గత ఏడాది లాంచ్ చేసిన గూగుల్ పిక్సెల్ 2ఎక్స్‌ఎల్ పై భారీ తగ్గింపు ధరతో అందుబాటులోకి రానుంది. దాదాపు 40శాతం డిస్కౌంట్‌తో ఈ స్మార్ట్‌ఫోన్ కస‍్టమర్లను ఊరించనుంది. భారతీయ మొబైల్ మార్కెట్లో స్మార్ట్‌ఫోన్ల ధరల కోతపై ఖచ్చితమైన అంచనాలను వెలువరించే ముంబైకి చెందిన ఎలెక్ట్రానిక్స్ రిటైలర్ మహేష్ టెలికాం పిక్సెల్ 2 ఎక్స్ఎల్ ధర తగ్గింపును ప్రకటించింది. అయితే త్వరలోనే ఈ ధరల తగ్గింపును సంస్థ అధికారికంగా ప్రకటించనుందని మార్కెట్ వర్గాలు భావిస్తున్నాయి. ముఖ్యంగా అక్టోబర్ 9న నిర్వహించనున్న పిక్సెల్ 3 లాంచింగ్ ముందే ఈ ప్రకటన రావచ్చని తెలుస్తోంది.
64జీబీ స్టోరేజి వేరియంట్..
64జీబీ స్టోరేజి వేరియంట్ ధర రూ. 45,499లకే ఇపుడు అధికారికంగా త్వరలోనే అందుబాటులోకి రానుంది. దీని వాస్తవ ధర రూ. 73000గా ఉంది.

128జీబీ స్టోరేజ్ మోడల్..
అయితే హై-ఎండ్ వేరియంట్ 128జీబీ స్టోరేజ్ మోడల్ ధరలో ఎలాంటి మార్పులేదు. రూ. 82,000గానే ఉండనుంది.

పిక్సెల్ 3
మరోవైపు పిక్సెల్ 2ఎక్స్‌ఎల్‌కు కొనసాగింపుగా త్వరలో పిక్సెల్ 3 అక్టోబర్ 9న లాంచ్ కానుందని సమాచారం.

గూగుల్ పిక్సెల్ 2, 2 ఎక్స్‌ఎల్ ఫీచర్లను ఓ సారి చూస్తే..
డిజైన్, డిస్‌ప్లే
పిక్సల్ 2, పిక్సల్ 2 ఎక్స్‌ఎల్ రెండు ఫోన్లను అల్యూమినియం యూనిబాడీతో తయారు చేశారు. దీని వల్ల ఫోన్లకు ప్రీమియం లుక్ వచ్చింది. ఫోన్లలో యాక్టివ్ ఎడ్జ్ అనే ఫీచర్‌ను ఏర్పాటు చేశారు. దీంతో గూగుల్ అసిస్టెంట్‌ను త్వరగా ఓపెన్ చేసుకోవచ్చు. పిక్సల్ 2 ఫోన్ 5 ఇంచ్ ఫుల్ హెచ్‌డీ అమోలెడ్ డిస్‌ప్లే, 1920 x 1080 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్, 2.5డి కర్వ్‌డ్ గ్లాస్ డిస్‌ప్లే, గొరిల్లా గ్లాస్ 5 ప్రొటెక్షన్ ఫీచర్లను కలిగి ఉంది. అదే పిక్సల్ 2 ఎక్స్‌ఎల్ లో 6 ఇంచ్ క్వాడ్ హెచ్‌డీ ప్లస్ పోలెడ్ డిస్‌ప్లే, 2880 x 1440 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్, 3డి గొరిల్లా గ్లాస్ ఫీచర్లు ఉన్నాయి. పిక్సల్ 2 సాధారణ డిస్‌ప్లేను కలిగి ఉండగా, పిక్సల్ 2 ఎక్స్ఎల్‌ను బెజెల్ లెస్ డిస్‌ప్లే తరహాలో తీర్చిదిద్దారు. కిండా బ్లూ, జస్ట్ బ్లాక్, క్లియర్లీ వైట్ రంగుల్లో ఈ ఫోన్లు లభిస్తున్నాయి.

ప్రాసెసర్, ర్యామ్, స్టోరేజ్
పిక్సల్ 2, పిక్సల్ 2 ఎక్స్‌ఎల్ రెండు ఫోన్లలోనూ ఆక్టాకోర్ స్నాప్‌డ్రాగన్ 835 ప్రాసెసర్, 4 జీబీ ర్యామ్, 64/128 జీబీ స్టోరేజ్, 256 జీబీ ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్ ఫీచర్లు ఉన్నాయి.

కెమెరా, ఆపరేటింగ్ సిస్టమ్
పిక్సల్ 2, పిక్సల్ 2 ఎక్స్‌ఎల్ ఫోన్లలో 12.2 మెగాపిక్సల్ సామర్థ్యం ఉన్న కెమెరాను వెనుక భాగంలో ఏర్పాటు చేశారు. దీనికి ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ (ఓఐఎస్) అనే ఫీచర్ ఉంది. దీంతో కెమెరా షేక్ అవుతున్నా ఫొటోలు, వీడియోలు మాత్రం ఎలాంటి షేకింగ్ లేకుండా వస్తాయి. ఇక ఈ కెమెరాకు f/1.8 అపర్చర్ ఉండడంతో ఫొటోలు, వీడియోలు నాణ్యమైన క్వాలిటీతో వస్తాయి. 4కె వీడియో రికార్డింగ్‌ను ఈ కెమెరా సపోర్ట్ చేస్తుంది. ఇక రెండు ఫోన్లలోనూ ముందు భాగంలో 8 మెగాపిక్సల్ సామర్థ్యం ఉన్న సెల్ఫీ కెమెరాను ఏర్పాటు చేశారు. ఈ కెమెరా అపర్చర్ సైజ్ f/2.4 గా ఉంది. దీంతో సెల్ఫీలు నాణ్యమైన క్వాలిటీతో వస్తాయి. ఆండ్రాయిడ్ 8 ఓరియో ఆపరేటింగ్ సిస్టమ్‌ను ఈ ఫోన్లలో అందిస్తున్నారు.

ఇతర ఫీచర్లు
రెండు ఫోన్లలలోనూ ఫింగర్‌ప్రింట్ సెన్సార్, ఐపీ67 వాటర్, డస్ట్ రెసిస్టెంట్, 4జీ వీవోఎల్‌టీఈ, డ్యుయల్ బ్యాండ్ వైఫై, బ్లూటూత్ 5.0 ఎల్‌ఈ, యూఎస్‌బీ టైప్ సి, ఎన్‌ఎఫ్‌సీ వంటి ఫీచర్లు ఉన్నాయి. ఫింగర్ ప్రింట్ సెన్సార్‌ను వెనుక భాగంలో ఏర్పాటు చేశారు. ఇక పిక్సల్ 2లో 2700 ఎంఏహెచ్ కెపాసిటీ ఉన్న బ్యాటరీని ఏర్పాటు చేయగా, పిక్సల్ 2 ఎక్స్‌ఎల్‌లో 3520 ఎంఏహెచ్ సామర్థ్యం ఉన్న బ్యాటరీని అమర్చారు. రెండు ఫోన్లలోనూ ఫాస్ట్ చార్జింగ్ ఫీచర్ ఉంది.

pixel 3
కాగా న్యూయార్క్ సిటీలో అక్టోబర్ 9వ తేదీన ఓ ఈవెంట్‌ను నిర్వహించనున్నట్లు గూగుల్ ఇప్పటికే వెల్లడించింది. అయితే ఆ ఈవెంట్‌లో ఏయే ప్రొడక్ట్స్‌ను లాంచ్ చేసేది గూగుల్ తెలియజేయలేదు.

6.2 ఇంచ్ డిస్‌ప్లే..
కానీ అందులో పిక్సల్ 3 సిరీస్ ఫోన్లను విడుదల చేయవచ్చని తెలిసింది. పిక్సల్ 3, పిక్సల్ 3 ఎక్స్‌ఎల్ ఫోన్లను గూగుల్ తన ఈవెంట్‌లో విడుదల చేస్తుందని సమాచారం. పిక్సల్ 3 సిరీస్ ఫోన్లలో 6.2 ఇంచ్ డిస్‌ప్లే, 3430 ఎంఏహెచ్ బ్యాటరీ, వైర్‌లెస్ చార్జింగ్, స్నాప్‌డ్రాగన్ 850 ప్రాసెసర్ తదితర ఫీచర్లను ఏర్పాటు చేసినట్లు తెలుస్తున్నది.


Click it and Unblock the Notifications








