మరోసారి లీకైన Google Pixel 3

|

గూగుల్ పిక్సల్ 3, పిక్సల్ 3 ఎక్స్ఎల్ స్మార్ట్‌ఫోన్‌లకు సంబంధించి మరికొన్ని ముఖ్యమైన వివరాలు లీక్ అయ్యాయి. యూకే నెట్‌వర్క్ క్యారియర్ ఈఈ రివీల్ చేసిన పలు డాక్యుమెంట్స్ ప్రకారం ఆ రెండు స్మార్ట్‌ఫోన్‌లు బ్లాక్, వైట్ ఇంకా పింక్ కలర్ ఆప్షన్స్‌లో అందుబాటులో ఉంటాయి.

గ్రూప్ సెల్ఫీ కోసం ‘టాప్ షాట్’..
 

గ్రూప్ సెల్ఫీ కోసం ‘టాప్ షాట్’..

ఇక హిడెన్ ఫీచర్స్ విషయానికి వచ్చేసరికి ఈ డివైస్‌లో ‘టాప్ షాట్' పేరుతో ఓ క్రేజీ ఫీచర్‌ను గూగుల్ లోడ్ చేసినట్లు తెలుస్తోంది. ఈ ఫీచర్ ద్వారా సెల్ఫీ స్టిక్స్‌తో పనిలేకుండా హై-క్వాలిటీ సెల్ఫీలను క్యాప్చుర్ చేసుకునే వీలుంటుందట. మరొక ఫీచర్‌లో భాగంగా పిక్సల్ 3, పిక్సల్ 3 ఎక్స్ఎల్ స్మార్ట్‌ఫోన్‌లకు సంబంధించి నోటిఫికేషన్‌లను డిసేబుల్ చేయాలనుకుంటున్నట్లయితే ఫోన్ ఫ్రంట్ కెమెరాకు కనిపించేలా ఫేస్ డౌస్ చేస్తే సరిపోతుందట.

బ్లాక్ మార్కెట్లో దొరుకుతోందా..?

బ్లాక్ మార్కెట్లో దొరుకుతోందా..?

ఇటీవల గూగుల్ 'పిక్సల్ 3 ఎక్స్ఎల్' స్మార్ట్‌ఫోన్‌కు సంబంధించి 9టు5గూగుల్ ఈ షాకింగ్ న్యూస్‌ను రివీల్ చేసింది. ఉక్రేనియన్ ఆరిజన్‌కు చెందిన ఓ వ్యక్తి వద్ద నుంచి ఈ వివరాలను సదరు న్యూస్ వెబ్‌సైట్ రాబట్టగలిగింది. ఇతని వద్ద పిక్సల్ 2 ఎక్స్ఎల్ స్మార్ట్‌ఫోన్‌లతో పాటు పిక్సల్ 3 ఎక్స్ఎల్‌ ఫోన్‌లు కూడా అమ్మకానికి సిద్ధంగా ఉన్నట్లు వెల్లడైంది. పిక్సల్ 3 ఎక్స్ఎల్ డివైస్‌ను ఏకంగా 2000 డాలర్లకు అతను విక్రయిస్తున్నట్లు తెలుస్తోంది. అక్టోబర్‌లో లాంచ్ కావల్సి ఉన్న ఈ డివైస్ మార్కెట్ ధర 900 నుంచి 1000 డాలర్లలోపు ఉండొచ్చని మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.

ఇంటర్నెట్‌లో సర్క్యులేట్ అవుతోన్న ఫోటోలు..

ఇంటర్నెట్‌లో సర్క్యులేట్ అవుతోన్న ఫోటోలు..

ఈ ఎక్స్‌క్లూజివ్ డివైస్‌ను సెల్లర్ వద్ద నుంచి లండన్‌కు చెందని ఓ వ్యక్తి కొనుగోలు చేసినట్లు తాజా రిపోర్ట్స్ చెబుతున్నాయి. ఈ ఫోన్ కెమెరా ద్వారా క్యాప్చుర్ చేయబడిన ఫోటోలు ఇంటర్నెట్‌లో సర్క్యులేట్ అవుతున్నాయి. డీహెచ్ఎల్ లేదా ఫీడెక్స్ కొరియర్ ద్వారా ఈ డివైస్‌ను కొనుగోలుదారుడికి సదరు సెల్లర్ పంపి ఉండొచ్చని భావిస్తున్నారు. ఈ ఫోన్ కొనుగోలుకు సంబంధించిన పేమెంట్‌ను పేపాల్ లేదా బిట్ కాయిన్స్ ద్వారా చేసి ఉండొచ్చని 9టు5గూగుల్ భావిస్తోంది.

గూగుల్ పిక్సల్ 3 ఎక్స్ఎల్ స్పెసిఫికేషన్స్ (అన్‌అఫీషియల్)
 

గూగుల్ పిక్సల్ 3 ఎక్స్ఎల్ స్పెసిఫికేషన్స్ (అన్‌అఫీషియల్)

6.7 అంగుళాల డిస్‌ప్లే (రిసల్యూషన్ కెపాసిటీ వచ్చేసరికి 2,960 x 1,440పిక్సల్స్), ఆండ్రాయిడ్ 9 Pie ఆపరేటింగ్ సిస్టం, క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 845 ప్రాసెసర్, 4జీబి ర్యామ్, 64జీబి ఇంటర్నల్ స్టోరేజ్, 12.2 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా, డ్యుయల్ ఫ్రంట్ కెమెరా, 3,430mAh బ్యాటరీ విత్ వైర్‌లెస్ ఛార్జింగ్.

Most Read Articles
Best Mobiles in India

English summary
Google Pixel 3 may have a ‘Top Shot’ feature to take better selfies.To Know More About Visit telugu.gizbot.com

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X