గూగుల్‌కు షాక్, విడుదలకు ముందే బ్లాక్ మార్కెట్లో Pixel 3 XL

గూగుల్ అప్ కమ్మింగ్ స్మార్ట్‌ఫోన్ ‘పిక్సల్ 3 ఎక్స్ఎల్’ (Pixel 3 XL) అఫీషియల్ లాంచ్ కంటే ముందే బ్లాక్ మార్కెట్లో లబ్యమవుతోంది.

By GizBot Bureau
|

గూగుల్ అప్ కమ్మింగ్ స్మార్ట్‌ఫోన్ 'పిక్సల్ 3 ఎక్స్ఎల్’ (Pixel 3 XL) అఫీషియల్ లాంచ్ కంటే ముందే బ్లాక్ మార్కెట్లో లబ్యమవుతోంది. ఈ షాకింగ్ న్యూస్‌ను 9to5Google రివీల్ చేసింది. ఉక్రేనియన్ ఆరిజన్‌కు చెందిన ఓ వ్యక్తి వద్ద నుంచి ఈ వివరాలను సదరు న్యూస్ వెబ్‌సైట్ రాబట్టగలిగింది.

బ్లాక్ మార్కెట్ ధర 2000 డాలర్లు..

బ్లాక్ మార్కెట్ ధర 2000 డాలర్లు..

ఇతని వద్ద పిక్సల్ 2 ఎక్స్ఎల్ స్మార్ట్‌ఫోన్‌లతో పాటు పిక్సల్ 3 ఎక్స్ఎల్‌ ఫోన్‌లు కూడా అమ్మకానికి సిద్ధంగా ఉన్నట్లు వెల్లడైంది. పిక్సల్ 3 ఎక్స్ఎల్ డివైస్‌ను ఏకంగా 2000 డాలర్లకు అతను విక్రయిస్తున్నట్లు తెలుస్తోంది. అక్టోబర్ లో లాంచ్ కావల్సి ఉన్న ఈ డివైస్ మార్కెట్ ధర 900 నుంచి 1000 డాలర్లలోపు ఉండొచ్చని మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.

ఫోటోలు వైరల్..

ఫోటోలు వైరల్..

ఈ ఎక్స్‌క్లూజివ్ డివైస్‌ను సెల్లర్ వద్ద నుంచి లండన్‌కు చెందని ఓ వ్యక్తి కొనుగోలు చేసినట్లు తాజా రిపోర్ట్స్ చెబుతున్నాయి. ఈ ఫోన్ కెమెరా ద్వారా క్యాప్చుర్ చేయబడిన ఫోటోలు ఇంటర్నెట్‌లో సర్క్యులేట్ అవుతున్నాయి. డీహెచ్ఎల్ లేదా ఫీడెక్స్ కొరియర్ ద్వారా ఈ డివైస్‌ను కొనుగోలుదారుడికి సదరు సెల్లర్ పంపి ఉండొచ్చని భావిస్తున్నారు. ఈ ఫోన్ కొనుగోలుకు సంబంధించిన పేమెంట్‌ను పేపాల్ లేదా బిట్ కాయిన్స్ ద్వారా చేసి ఉండొచ్చని 9టు5గూగుల్ భావిస్తోంది.

 

 

ఫాక్స్‌కాన్ అసెంబుల్ చేస్తోంది..

ఫాక్స్‌కాన్ అసెంబుల్ చేస్తోంది..

గూగుల్‌కు సంబంధించిన పిక్సల్ 3 ఎక్స్ఎల్ స్మార్ట్‌ఫోన్‌లను ఫాక్స్‌కాన్ సంస్థ అసెంబుల్ చేస్తోంది. తాజా సంఘటనను సీరియస్‌గా తీసుకున్న గూగుల్, ఫాక్స్‌కాన్‌ను వివరణ కోరినట్లు తెలుస్తోంది. పిక్సల్ 3తో పాటు పిక్సల్ 3 ఎక్స్ఎల్ స్మార్ట్‌ఫోన్‌లను అక్టోబర్ 4వ తేదీన నిర్వహించే స్పెషల్ లాంచ్ ఈవెంట్‌లో భాగంగా గూగుల్ విడుదల చేయబోతున్నట్లు వార్తలు వొస్తున్నాయి.

 

 

గూగుల్ పిక్సల్ 3 ఎక్స్ఎల్ స్పెసిఫికేషన్స్ (అన్‌అఫీషియల్)

గూగుల్ పిక్సల్ 3 ఎక్స్ఎల్ స్పెసిఫికేషన్స్ (అన్‌అఫీషియల్)

6.7 అంగుళాల డిస్‌ప్లే (రిసల్యూషన్ కెపాసిటీ వచ్చేసరికి 2,960 x 1,440పిక్సల్స్), ఆండ్రాయిడ్ 9 Pie ఆపరేటింగ్ సిస్టం, క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 845 ప్రాసెసర్, 4జీబి ర్యామ్, 64జీబి ఇంటర్నల్ స్టోరేజ్, 12.2 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా, డ్యుయల్ ఫ్రంట్ కెమెరా, 3,430mAh బ్యాటరీ విత్ వైర్‌లెస్ ఛార్జింగ్.

Best Mobiles in India

English summary
Google Pixel 3 XL Already Available On Black Market For $2,000.To Know More About Visit telugu.gizbot.com

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X