గూగుల్‌కు షాక్, విడుదలకు ముందే హాంకాంగ్ మార్కెట్లో Pixel 3 XL విక్రయాలు!

|

గూగుల్‌కు మరో షాక్ తగిలినట్లయ్యింది. ఈ సంస్థ నుంచి మరోకొద్ది గంట్లలో అఫీషియల్‌గా లాంచ్ కావల్సి ఉన్న పిక్సల్ 3, పిక్సల్ 3 ఎక్స్ఎల్ స్మార్ట్‌ఫోన్‌లను హాంకాంగ్ మార్కెట్లో అక్కడి రిటైలర్ అయిన వాహ్‌ఫోన్ డిజిటల్ పబ్లిక్‌గా విక్రయిస్తున్నట్లు సమాచారం. ఈ ఎక్స్‌క్లూజివ్ స్టోరీని Engadget రివీల్ చేసింది.

మార్కెట్ ధర రూ.1,50,000
 

మార్కెట్ ధర రూ.1,50,000

సదురు పోస్ట్‌లో పేర్కొన్న వివరాల ప్రకారం ఈ న్యూస్ పబ్లికేషన్‌కు చెందిన ఎడిటర్ ఒకరు సదరు రిటైలర్ వద్ద నుంచి పిక్సల్ 3 ఎక్స్ఎల్ స్మార్ట్‌ఫోన్‌‌ను తీసుకుని హ్యాండ్స్ ఆన్ రివ్యూ చేసారు. అక్కిడి మార్కెట్లో ఈ ఫోన్‌ ధరను HK$15880గా సదురు రిటైలర్ ఫిక్స్ చేసింది. ఇండియన్ కరెన్సీలో ఈ ఖరీుదు రూ.1,50,000గా ఉంది.

స్పెసిఫికేషన్స్ ఇవే..

స్పెసిఫికేషన్స్ ఇవే..

ధృడమైనా ఇంకా మన్నికైన డివైస్‌గా అభివర్ణించబడుతోన్న ఈ స్మార్ట్‌ఫోన్ 6.3 అంగుళాల భారీ డిస్‌ప్లేను కలిగి ఉన్నట్లు ఎన్‌గాడ్జెట్ తెలిపింది. Android Pie ఆపరేటింగ్ సిస్టం పై రన్ అవుతోన్న ఈ స్మార్ట్‌ఫోన్‌లో క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 845 చిప్‌సెట్, 4జీబి ర్యామ్, 128జీబి ఇంటర్నల్ స్టోరేజ్, 12.2 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా, 8 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా, 3,732 బ్యాటరీ వంటి శక్తివంతమైన ఫీచర్స్ ఈ డివైస్‌లో ఉన్నట్లు తెలుస్తోంది.

కలర్ వేరియంట్స్ పై క్లారిటీ..

కలర్ వేరియంట్స్ పై క్లారిటీ..

గూగుల్ పిక్సల్ 3, పిక్సల్ 3 ఎక్స్ఎల్ స్మార్ట్‌ఫోన్‌లకు సంబంధించి మరికొన్ని ముఖ్యమైన వివరాలు లీక్ అయ్యాయి. యూకే నెట్‌వర్క్ క్యారియర్ ఈఈ రివీల్ చేసిన పలు డాక్యుమెంట్స్ ప్రకారం ఆ రెండు స్మార్ట్‌ఫోన్‌లు బ్లాక్, వైట్ ఇంకా పింక్ కలర్ ఆప్షన్స్‌లో అందుబాటులో ఉంటాయి.

‘టాప్ షాట్' పేరుతో క్రేజీ ఫీచర్‌
 

‘టాప్ షాట్' పేరుతో క్రేజీ ఫీచర్‌

ఇక హిడెన్ ఫీచర్స్ విషయానికి వచ్చేసరికి ఈ డివైస్‌లో ‘టాప్ షాట్' పేరుతో ఓ క్రేజీ ఫీచర్‌ను గూగుల్ లోడ్ చేసినట్లు తెలుస్తోంది. ఈ ఫీచర్ ద్వారా సెల్ఫీ స్టిక్స్‌తో పనిలేకుండా హై-క్వాలిటీ సెల్ఫీలను క్యాప్చుర్ చేసుకునే వీలుంటుందట. మరొక ఫీచర్‌లో భాగంగా పిక్సల్ 3, పిక్సల్ 3 ఎక్స్ఎల్ స్మార్ట్‌ఫోన్‌లకు సంబంధించి నోటిఫికేషన్‌లను డిసేబుల్ చేయాలనుకుంటున్నట్లయితే ఫోన్ ఫ్రంట్ కెమెరాకు కనిపించేలా ఫేస్ డౌస్ చేస్తే సరిపోతుందట.

Most Read Articles
Best Mobiles in India

English summary
GOOGLE PIXEL 3 XL GETS LISTED FOR SALE IN HONG KONG DAYS BEFORE EXPECTED LAUNCH.To Know More About Visit telugu.gizbot.com

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X