Just In
- 2 min ago
తక్కువ ధరలో, ఎక్కువ ఫీచర్లతో, బెస్ట్ స్మార్ట్ టీవీలు ! లిస్ట్ ,ధరలు చూడండి!
- 3 hrs ago
మీ కంప్యూటర్ లలో ఈ బ్రౌజర్ వాడుతున్నారా? జాగ్రత్త ...గవర్నమెంట్ వార్నింగ్ ఇచ్చింది!
- 5 hrs ago
OnePlus నుంచి కొత్త టాబ్లెట్, లాంచ్ తేదీ, స్పెసిఫికేషన్ల వివరాలు!
- 1 day ago
Poco X5 Pro 5G ఇండియా లాంచ్ తేదీ మరియు ధర లీక్ అయింది! వివరాలు
Don't Miss
- News
lovers: మీరు ఏమనుకున్నా సరే, ఇదే మా నిర్ణయం, నేరుగా రైలు ఎక్కిన ప్రేమికులు ఏం చేశారంటే ?
- Finance
Market Crash: మార్కెట్లలో రక్తపాతం.. తీవ్ర అమ్మకాల ఒత్తిడి.. రూ.12 లక్షల కోట్లు మిస్..
- Sports
Australia Open 2023: ఫైనల్లో ఓటమి.. ఏడ్చిన సానియా మీర్జా వీడియో
- Movies
తారకరత్న చేసిన మిస్టేక్ అదే.. ఐసియూలో స్టంట్ వేసిన వైద్యులు.. పరిస్థితి ఎలా ఉందంటే..
- Automobiles
రూ. 50000 తో ప్రారంభమైన '2023 టయోటా ఇన్నోవా క్రిస్టా' బుకింగ్స్.. మరిన్ని వివరాలు
- Lifestyle
Trans fat foods: ఈ విషాహారాలు తినడం వల్ల 5 బిలియన్ల మందికి గుండె జబ్బులు వస్తున్నాయి..జాగ్రత్త!
- Travel
భాగ్యనగరపు పర్యాటక ఆకర్షణ.. గోల్కొండ కోట!
Nothing Phone 1 vs Google Pixel 6a: ఏది బెస్టో తెలుసుకోండిలా!
ఇటీవల మొబైల్ తయారీ కంపెనీలు వినియోగదారుల ఆసక్తికి అనుగుణంగా మిడ్ రేంజ్ ధరల్లో ఫ్లాగ్‌షిప్ అనుభవాన్ని కలిగిన ఫీచర్లను అందిస్తున్నాయి. అందులోభాగంగా Nothing కంపెనీ నుంచి ఇటీవల Nothing Phone 1 విడుదల కాగా.. Google కంపెనీ నుంచి Google Pixel 6a విడుదలైంది. ఈ రెండు 5G స్మార్ట్‌ఫోన్లు కూడా మిడ్ రేంజ్ కేటగిరీలోనే ఉన్నాయి. కాగా, ఇప్పుడు మనం ఈ రెండు మొబైల్స్‌లో ఏ ఫోన్ ఫీచర్లు బాగున్నాయ్.. ఏది మెరుగైన పని తీరు కనబరుస్తుంది అనే విషయాల్ని తెలుసుకుందాం. ప్రస్తుతం మొబైల్ కొనాలనుకునే వారికి ఈ రెండింటిలో దేనిపై ఆసక్తి ఉందో తెలియజేసేలా వాటి స్పెసిఫికేషన్ల, ధరలను గురించి చర్చించుకుందాం.

Nothing Phone 1 vs Google Pixel 6a:
డిస్‌ప్లే, ప్రాసెసర్, ర్యామ్ కెపాసిటీ:
* Nothing Phone 1 స్మార్ట్‌ఫోన్ 6.55 అంగుళాల ఫ్లాష్ పానెల్ OLED డిస్‌ప్లే కలిగి ఉంది. ఇది 120Hz రిఫ్రెష్ రేటుతో పనిచేస్తుంది. ఈ హ్యండ్ సెట్ Qualcomm SM7325-AE Snapdragon 778G+ ప్రాసెసర్ ని కలిగి ఉంది. అంతే కాకుండా ఈ మొబైల్ 12జీబీ ర్యామ్, మరియు 256 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ కలిగి ఉంది
* Google Pixel 6a మొబైల్ కు 6.1 అంగుళాల full-HD + AMOLED డిస్‌ప్లే పానెల్‌ను అందిస్తున్నారు. ఇది 60Hz రిఫ్రెష్ రేటుతో పని చేస్తుంది. ఇది 2.5D కర్వ్‌డ్ కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 3 డిస్‌ప్లే ప్రొటెక్షన్ ఫీచర్ కలిగి ఉంది. లేటెస్ట్ LPDDR5 class RAM, UFS 3.1 స్టోరేజీని ఆధారంగా పనిచేసే గూగుల్ టెన్సార్ ప్రాసెసర్‌ను ఈ మొబైల్‌కు అందిస్తున్నారు. అంతే కాకుండా ఈ మోడల్ బేస్ మొబైల్ 6GB RAM |128GB ఇంటర్నల్ స్టోరేజీ తో వస్తోంది.
* ఈ రెండు మొబైల్స్ కూడా కార్నింగ్ గొరిల్లా గ్లాస్ ప్రొటెక్షన్ కలిగి ఉన్నాయి.

బ్యాటరీ:
* బ్యాటరీల విషయానికొస్తే.. Nothing Phone 1 మొబైల్ 4500 mAh బ్యాటరీ సామర్థ్యాన్ని కలిగి ఉంది. అంతేకాకుండా 33W ఫాస్ట్ ఛార్జింగ్ మరియు వైర్‌లెస్ ఛార్జింగ్ మద్దతు కలిగి ఉంది. Google Pixel 6a స్మార్ట్‌ఫోన్ 4410 mAh బ్యాటరీ సామర్థ్యాన్ని కలిగి ఉంది.
కెమెరాలు:
* Nothing Phone 1 ఆప్టిక్స్ విషయానికి వస్తే ఫోన్ వెనుక భాగంలో రెండు 50-మెగాపిక్సెల్ సెన్సార్‌లతో డ్యూయల్ కెమెరా సెటప్‌ను కలిగి ఉంటుంది. ఇందులో మొదటిది 50-మెగాపిక్సెల్ Sony IMX766 సెన్సార్ ƒ/1.88 అపెర్చర్ లెన్స్‌తో జత చేయబడి ఉండి OIS అలాగే EIS ఇమేజ్ స్టెబిలైజేషన్‌తో వస్తుంది. రెండవది ƒ/2.2 ఎపర్చరుతో 50-మెగాపిక్సెల్ సెన్సార్ Samsung JN1 మరియు అల్ట్రా-వైడ్ యాంగిల్ లెన్స్‌తో జత చేయబడి ఉంటుంది. ముందు భాగంలో సెల్ఫీలు మరియు వీడియో కాలింగ్ కోసం ƒ/2.45 ఎపర్చరు లెన్స్‌తో 16-మెగాపిక్సెల్ సోనీ IMX471 సెన్సార్ ఉంది.
* Google Pixel 6a డ్యుయల్ కెమెరా సెటప్‌ను కలిగి ఉంది. ప్రధానంగా 12.2 మెగాపిక్సల్ క్వాలిటీలో ప్రైమరీ వైడ్ యాంగిల్ లెన్స్, మరొకటి 12 మెగా పిక్సెల్ క్వాలిటీతో అల్ట్రా వైడ్ యాంగిల్ లెన్స్ తో పాటు ఎల్ఈడీ ఫ్లాష్‌ను అందిస్తున్నారు. ఈ మొబైల్‌కు ఫ్రంట్ సైడ్ వీడియో కాలింగ్ కోసం 8 మెగా పిక్సెల్ క్వాలిటీతో సెల్ఫీ కెమెరా అందిస్తున్నారు.

ధరలు:
* Nothing Phone 1 వేరియంట్ల ఆధారంగా మూడు ధరల్లో లభిస్తోంది. 8GB+128GB వేరియంట్ ధర రూ.32,999, ఇక రెండో వేరియంటల్ 8GB+256GB ధర రూ.35,999, మూడో వేరియంట్ 12GB+256GB ధర రూ.38,999 గా ఉంది.
* Google Pixel 6a మొబైల్ 6GB+128GB వేరియంట్ ధర రూ.43,999 గా నిర్ణయించారు. ఈ మొబైల్ జులై 28 వ తేదీ నుంచి సేల్‌కు రానుంది. ఈ మొబైల్స్ చాక్, చార్‌కోల్, సేజ్ కలర్లలో అందుబాటులోకి రానున్నాయి.
-
54,999
-
36,599
-
39,999
-
38,990
-
1,29,900
-
79,990
-
38,900
-
18,999
-
19,300
-
69,999
-
79,900
-
1,09,999
-
1,19,900
-
21,999
-
1,29,900
-
12,999
-
44,999
-
15,999
-
7,332
-
17,091
-
29,999
-
7,999
-
8,999
-
45,835
-
77,935
-
48,030
-
29,616
-
57,999
-
12,670
-
79,470