త్వ‌ర‌లోనే భార‌త మార్కెట్లోకి Google Pixel 6A.. ధ‌ర స్పెసిఫికేష‌న్లు లీక్‌!

|

Google కంపెనీ త్వ‌ర‌లో 5G Pixel స్మార్ట్‌ఫోన్‌ను భార‌త మార్కెట్‌కు ప‌రిచ‌యం చేయ‌బోతోంది. Google Pixel 6A పేరుతో కొత్త మోడ‌ల్ మొబైల్‌ను త్వ‌ర‌లో అధికారికంగా భార‌త మార్కెట్లో విడుద‌ల చేయ‌నుంది. Pixel 6, Pixel 6 Pro మాదిరిగానే టైటాన్ ఎం2 చిప్ సెక్యురిటీ క‌లిగిన‌ టెన్సార్ (Tensor) ప్రాసెసర్‌తో తీసుకు వ‌స్తోంది. ఈ క్ర‌మంలో ఆ స్మార్ట్‌ఫోన్‌కు సంబంధించిన స్పెసిఫికేష‌న్లు, ధ‌ర‌ల వివ‌రాలు లీక్ అయ్యాయి. 6GB RAM |128GB ఇంట‌ర్న‌ల్ స్టోరేజీ గ‌ల వేరియంట్ రిటైల్ ధ‌ర దాదాపు రూ.43,999 వ‌ర‌కు ఉండ‌నున్న‌ట్లు లీకు వ‌ర్గాల ద్వారా స‌మాచారం. రాబోయే కొద్ది రోజుల్లో ఈ మొబైల్ భార‌త మార్కెట్లో విడుద‌ల అవుతుంద‌ని అంతా భావిస్తున్నారు.

 
త్వ‌ర‌లోనే భార‌త మార్కెట్లోకి Google Pixel 6A.. ధ‌ర స్పెసిఫికేష‌న్లు ల

Google Pixel 6A లీక్‌డ్‌ ఫీచ‌ర్లు, స్పెసిఫికేష‌న్లు:
ప‌ర్ఫార్మెన్స్ విష‌యానికి వ‌స్తే Google Pixel 6, Pixel 6 Pro ల‌తో పోలిస్తే ఈ కొత్త Pixel 6A మొబైల్ అద్భుత‌మైన ప‌ని తీరు క‌న‌బ‌రుస్తుంది. లేటెస్ట్ LPDDR5 class RAM, UFS 3.1 స్టోరేజీని ఉప‌యోగించే గూగుల్ టెన్సార్ ప్రాసెస‌ర్‌ను ఈ మొబైల్‌కు అందిస్తున్నారు. ఈ మోడ‌ల్ బేస్ మొబైల్ 6GB RAM |128GB ఇంట‌ర్న‌ల్ స్టోరేజీ తో వ‌స్తోంది.

ఈ మొబైల్ కు 6.1 అంగుళాల full-HD + AMOLED డిస్‌ప్లే పానెల్‌ను అందిస్తున్నారు. ఇది 60Hz రిఫ్రెష్ రేటుతో ప‌ని చేస్తుంది. ఇది 2.5D క‌ర్వ్‌డ్ కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 3 డిస్‌ప్లే ప్రొటెక్ష‌న్ ఫీచ‌ర్ క‌లిగి ఉంది. అంతేకాకుండా ఈ మొబైల్ IP67 వాట‌ర్ లేదా డ‌స్ట్ రెసిస్టాన్స్ రేటింగ్‌ ఫీచ‌ర్తో వ‌స్తోంది. ఇది ఆండ్రాయిడ్ 12 ఓఎస్ స‌హ‌కారంతో లేటెస్ట్ సెక్యూరిటీ ప్యాచ్ తో ప‌నిచేస్తుంది.

త్వ‌ర‌లోనే భార‌త మార్కెట్లోకి Google Pixel 6A.. ధ‌ర స్పెసిఫికేష‌న్లు ల

ఈ మొబైల్ డ్యుయ‌ల్‌ కెమెరా సెట‌ప్‌ను క‌లిగి ఉంది. ప్ర‌ధానంగా 12.2 మెగాపిక్స‌ల్ క్వాలిటీలో ప్రైమ‌రీ వైడ్ యాంగిల్ లెన్స్‌, మ‌రొక‌టి 12 మెగా పిక్సెల్ క్వాలిటీతో అల్ట్రా వైడ్ యాంగిల్ లెన్స్ తో పాటు ఎల్ఈడీ ఫ్లాష్‌ను అందిస్తున్నారు. ఈ మొబైల్‌కు ఫ్రంట్ సైడ్ వీడియో కాలింగ్ కోసం 8 మెగా పిక్సెల్ క్వాలిటీతో సెల్ఫీ కెమెరా అందిస్తున్నారు. ఇక ఛార్జ్‌ విష‌యానికొస్తే 4,410 mAh సామ‌ర్థ్యం గ‌ల బ్యాట‌రీని అందిస్తున్నారు. ఈ హ్యాండ్ సెట్ డ్యుయ‌ల్ సిమ్ స్లాట్స్‌, రెండిటికీ 5జీ నెట్‌వ‌ర్క్ స‌పోర్ట్ సిస్ట‌మ్ కలిగి ఉంది. భార‌త మార్కెట్లో 6GB RAM |128GB ఇంట‌ర్న‌ల్ స్టోరేజీ గ‌ల వేరియంట్ రిటైల్ ధ‌ర దాదాపు రూ.43,999 వ‌ర‌కు ఉండ‌నున్న‌ట్లు లీకుల ద్వారా స‌మాచారం.

ఇప్ప‌టికే అందుబాటులో ఉన్న Google Pixel 6 స్పెసిఫికేష‌న్లు, ఫీచ‌ర్లు:
ఈ మొబైల్ కు 6.4 అంగుళాల full-HD + AMOLED డిస్‌ప్లే పానెల్‌ను అందిస్తున్నారు. ఇది 90Hz రిఫ్రెష్ రేటుతో ప‌ని చేస్తుంది. గూగుల్ టెన్సార్ ప్రాసెస‌ర్‌ను ఈ మొబైల్‌కు అందిస్తున్నారు. అంతేకాకుండా ఈ మొబైల్ IP68 వాట‌ర్ లేదా డ‌స్ట్ రెసిస్టాన్స్ రేటింగ్‌ ఫీచ‌ర్తో వ‌స్తోంది. ఇది ఆండ్రాయిడ్ 12 ఓఎస్ స‌హ‌కారంతో లేటెస్ట్ సెక్యూరిటీ ప్యాచ్ తో ప‌నిచేస్తుంది.

త్వ‌ర‌లోనే భార‌త మార్కెట్లోకి Google Pixel 6A.. ధ‌ర స్పెసిఫికేష‌న్లు ల

ఈ మొబైల్ డ్యుయ‌ల్‌ కెమెరా సెట‌ప్‌ను క‌లిగి ఉంది. ప్ర‌ధానంగా 50 మెగాపిక్స‌ల్ క్వాలిటీలో ప్రైమ‌రీ వైడ్ యాంగిల్ లెన్స్‌, మ‌రొక‌టి 12 మెగా పిక్సెల్ క్వాలిటీతో అల్ట్రా వైడ్ యాంగిల్ లెన్స్ తో పాటు ఎల్ఈడీ ఫ్లాష్‌ను అందిస్తున్నారు. ఈ మొబైల్‌కు ఫ్రంట్ సైడ్ వీడియో కాలింగ్ కోసం 8 మెగా పిక్సెల్ క్వాలిటీతో సెల్ఫీ కెమెరా అందిస్తున్నారు. ఇక ఛార్జ్‌ విష‌యానికొస్తే 4,614 mAh సామ‌ర్థ్యం గ‌ల బ్యాట‌రీని అందిస్తున్నారు. ఈ హ్యాండ్ సెట్ డ్యుయ‌ల్ సిమ్ స్లాట్స్ కలిగి ఉంది. ప్ర‌స్తుతం అమెజాన్‌లో ఇది రూ.54,000 ధ‌ర‌కు కొనుగోలు దారుల‌కు అందుబాటులో ఉంది.

Best Mobiles in India

English summary
Google Pixel 6A With Tensor Chip Coming Soon To India

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X