గూగుల్ పిక్సల్ 7 స్మార్ట్‌ఫోన్‌పై డిస్కౌంట్.. ఫ్లిప్‌కార్ట్ సేల్.. ఈ కార్డులపై రూ.3000 తగ్గింపు..!
గూగుల్ నుంచి ఇటీవల పిక్సల్ 7 స్మార్ట్ ఫోన్ (Google Pixel 7 Smartphone) అక్టోబర్ 2022 భారత్ మార్కెట్‌లోకి విడుదల అయింది. అయితే ఇటీవలే పిక్సల్ 8 హ్యాండ్‌సెట్ విడుదల అయింది. దీంతో పిక్సల్ 7 స్మార్ట్‌ఫోన్ ధర తగ్గింది. ప్రస్తుతం ప్రముఖ ఈ- కామర్స్ సంస్థ ఫ్లిప్‌కార్ట్ ద్వారా తగ్గింపు ధరకు కొనుగోలు చేయవచ్చు.
ధర తగ్గింపుతోపాటు బ్యాంకు ఆఫర్లు, ఎక్స్చేంజీ ద్వారా మరింత తక్కువకే ఈ గూగుల్ పిక్సల్ 7 స్మార్ట్‌ఫోన్ ను కొనుగోలు చేయవచ్చు. ప్రస్తుతం ఫ్లిప్‌కార్ట్‌లో గూగుల్ పిక్సల్ 7 స్మార్ట్‌ఫోన్ 8GB ర్యామ్, 128GB అంతర్గత స్టోరేజీ వేరియంట్ ను రూ.43,999 గా ఉంది.

ఫ్లిప్‌కార్ట్‌లో ICICI క్రెడిట్ కార్డు మరియు డెబిట్ కార్డు EMI లావాదేవీల ద్వారా రూ.3000 తగ్గింపును పొందవచ్చు. దీంతోపాటు ఎక్స్చేంజీ ద్వారా మరింత తగ్గింపును పొందవచ్చు. ఎక్స్చేంజీ ద్వారా రూ.3000 తగ్గింపు సహా గరిష్ఠంగా రూ.39,000 వరకు ఎక్స్చేంజీ ప్రయోజనాలను పొందవచ్చు.
గూగుల్ పిక్సల్ 7 స్మార్ట్‌ఫోన్ స్పెసిఫికేషన్‌లు :
గూగుల్ పిక్సల్ 7 స్మార్ట్‌ఫోన్ 6.3 అంగుళాల పుల్ HD+ OLED డిస్‌ప్లేను కలిగి ఉంది. 90Hz రీఫ్రెష్ రేట్, 1400 నిట్స్ గరిష్ఠ బ్రైట్‌నెస్ ను కలిగి ఉంది. ఈ హ్యాండ్‌సెట్ గొరెల్లా గ్లాస్ విక్టస్ రక్షణను కలిగి ఉంటుంది. ఈ హ్యాండ్‌సెట్ IP68 రేటింగ్ తో వాటర్, డస్ట్ రెసిస్టెంట్‌గా అందుబాటులో ఉంది.
ఈ హ్యాండ్‌సెట్ ఆండ్రాయిడ్ 13 ఆధారిత OS పైన పనిచేస్తుంది. మరియు Tensor G2 CPU చిప్‌సెట్ మరియు టైటాన్ M2 సెక్యూరిటీ ప్రాసెసర్‌లను కలిగి ఉంది. ఈ స్మార్ట్‌ఫోన్ 20W వైర్ మరియు 20W వైర్ లెస్ ఛార్జింగ్ సపోర్టుతో 4270mAh బ్యాటరీ సామర్థ్యాన్ని కలిగి ఉంది.
కెమెరా విభాగం పరంగా ఈ గూగుల్ స్మార్ట్ ఫోన్ 50MP ప్రైమరీ కెమెరా, 12MP అల్ట్రావైడ్ యాంగిల్ కెమెరాను కలిగి ఉంది. మరియు సెల్ఫీ, వీడియో కాల్స్ కోసం 10.8MP కెమెరాను కలిగి ఉంటుంది. కనెక్టివిటీ పరంగా వైఫై 6, బ్లూటూత్ 5.2, NFC మరియు USB-C ఛార్జింగ్ పోర్టును కలిగి ఉంది.
ఈ గూగుల్ పిక్సల్ 7 స్మార్ట్‌ఫోన్ ను అబ్సిడియన్, స్నో మరియు లెమన్ గ్రాస్ రంగుల్లో కొనుగోలు చేసేందుకు అందుబాటులో ఉంది. ఈ ఫ్లిప్‌కార్ట్ ఆఫర్ ఎన్ని రోజుల పాటు అందుబాటులో ఉంటుందో వెల్లడించలేదు. విడుదలతో పోలిస్తే ఈ హ్యాండ్ సెట్ ధర రూ.16,000 తగ్గింపును పొందింది.
గిజ్‌బాట్ తెలుగు వెబ్ సైట్ గ్యాడ్జెట్లు సహా ఇతర టెక్ న్యూస్‌కు సంబంధించిన ఆసక్తికరమైన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా వార్తల కోసం సోషల్ మీడియా ఖాతాలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు.


Click it and Unblock the Notifications








