Home
Mobile

Google Pixel 8 ఆకట్టుకొనే కొత్త కలర్‌ వేరియంట్‌తో గూగుల్ పిక్సల్‌ 8 సిరీస్‌ ఫోన్లు..!!

గూగుల్‌ పిక్సల్ 8 సిరీస్‌ (Google Pixel 8 series) స్మార్ట్‌ఫోన్లు మరో కొత్త కలర్ వేరియంట్‌లో త్వరలో అందుబాటులోకి రానున్నాయి. ఈ సిరీస్‌ స్మార్ట్‌పోన్లు లాంచ్‌ అయిన నాలుగు నెలల తర్వాత ఈ కొత్త వేరియంట్‌ లాంచ్ అవుతోంది. ఇప్పటికే పిక్సల్‌ 8 హ్యాండ్‌సెట్‌ హజెల్‌, ఒబ్సిడియన్‌, రోజ్‌ రంగుల్లో లభిస్తోంది. ప్రో మోడల్ బే, ఒబ్సిడియన్‌, పింగాణీ రంగుల్లో లభిస్తోంది.

గూగుల్‌ పిక్సల్‌ 8, 8 ప్రో స్మార్ట్‌ఫోన్లు గూగుల్‌ టెన్సార్‌ G3 ప్రాసెసర్‌ను కలిగి ఉన్నాయి. మరియు ఆండ్రాయిడ్ 14 OS పైన పనిచేస్తాయి. గూగుల్‌ పిక్సల్‌ 8 4575mAh బ్యాటరీ, ప్రో మోడల్‌ 5,050mAh బ్యాటరీ సామర్థ్యాన్ని కలిగి ఉన్నాయి.

 google-pixel-8-series-new-colour-variant

గూగుల్‌ సోషల్‌ మీడియా ఛానళ్లు కొత్త కలర్‌ వేరియంట్ మింటీ ఫ్రెష్‌ గ్రీన్‌ రంగులో (Google pixel 8 series new colour variant) స్మార్ట్‌ఫోన్ల చిత్రాలను ప్రచురించాయి. ఈ కొత్త కలర్‌ వేరియంట్‌ జనవరి 25న విడుదల కానుంది. ఈ కొత్త వేరియంట్‌ కూడా అవే ధరలను కలిగి ఉండే అవకాశం ఉంది. కొత్త ఫోన్లు గూగుల్ స్టోర్‌లోనే లభిస్తాయని తెలుస్తోంది.

గూగుల్‌ పిక్సల్‌ 8, పిక్సల్‌ 8 ప్రో స్మార్ట్‌ఫోన్లు డ్యూయల్‌ సిమ్‌ ఆప్షన్‌ను కలిగి ఉంటాయి. మరియు ఆండ్రాయిడ్‌ 14 అవుట్ ఆఫ్‌ ది బాక్స్‌ పైన పనిచేస్తాయి. పిక్సల్‌ 8 ఫోన్‌ 6.2 అంగుళాల పుల్‌ HD+ OLED డిస్‌ప్లేను కలిగి ఉంటుంది. మరియు 90Hz రీఫ్రెష్‌ రేట్‌తో రానుంది.

అదే పిక్సల్‌ 8 ప్రో 120Hz రీఫ్రెష్‌ రేట్‌తో 6.7 అంగుళాల క్వాడ్‌ HD స్క్రీన్‌ను కలిగి ఉంటుంది. ఈ రెండు స్మార్ట్‌ఫోన్లు గూగుల్‌ నానో కోర్‌ టెన్సర్‌ G3 చిప్‌సెట్‌ సహా టైటాన్ M2 సెక్యూరిటీ చిప్‌ను కలిగి ఉంటాయి.

గూగుల్‌ పిక్సల్‌ 8, పిక్సల్‌ 8 ప్రో స్మార్ట్‌ఫోన్లు శాంసంగ్‌ GN2 సెన్సార్‌, f/1.68 అపేచర్‌తో 50MP ప్రైమరీ కెమెరాను కలిగి ఉంటుంది. దీంతోపాటు పిక్సల్‌ 8 సోనీ IMX386 సెన్సార్‌, f/2.2 అపేచర్‌తో 12MP ఆల్ట్రావైడ్‌ యాంగిల్‌ కెమెరాను కలిగి ఉంటుంది.

అదే పిక్సల్‌ 8 ప్రో సోనీ IMX787 సెన్సార్‌, f/2.8 అపేచర్‌తో 64MP ఆల్ట్రావైడ్‌ యాంగిల్‌ కెమెరాలను కలిగి ఉంటుంది. దీంతోపాటు ప్రో మోడల్‌ శాంసంగ్‌ GMS సెన్సార్‌తో f/1.95 అపేచర్‌తో 48MP టెలీఫోటో కెమెరాను కలిగి ఉంటుంది. ఈ రెండు ఫోన్లు ముందువైపు f/2.2 అపేచర్‌తో 11MP కెమెరాను అమర్చారు.

గూగుల్ పిక్సల్‌ 8 స్మార్ట్‌ఫోన్ 128GB అంతర్గత స్టోరేజీ వేరియంట్‌లోనే లభించనుంది. అలాగే పిక్సల్‌ 8 ప్రో 128GB స్టోరేజీ మోడల్‌ ఈ ఫోన్‌ బే, అబ్సిడియన్‌, పింగాణి రంగుల్లో లభిస్తుంది. ఈ కొత్త కలర్‌ వేరియంట్ జనవరి 25న విడుదల కానున్నాయి. సేల్‌ వివరాలపై ప్రకటన రావాల్సి ఉంది.

గిజ్‌బాట్‌ తెలుగు వెబ్‌సైట్ గ్యాడ్జెట్లు సహా ఇతర టెక్‌ న్యూస్‌కు సంబంధించిన ఆసక్తికరమైన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా వార్తల కోసం సోషల్‌మీడియా ఖాతాలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు.

More from GizBot

Best Mobiles in India

English summary
Google pixel 8 series new colour variant phones to launch on january 25
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X