Home
Mobile

గూగుల్‌ పిక్సల్‌ 8 ఫోన్‌పై ఫ్లిప్‌కార్ట్‌లో డిస్కౌంట్‌ ఆఫర్‌.. గతవారం కంటే మరింత తక్కువ ధరకు..!

ప్రముఖ టెక్‌ దిగ్గజం గూగుల్‌ నుంచి గత సంవత్సరం అక్టోబర్‌లో గూగుల్‌ పిక్సల్‌ 8 మరియు పిక్సల్‌ 8 ప్రో స్మార్ట్‌ఫోన్‌లను విడుదల చేసింది. విడుదల సమయంలో పిక్సల్‌ 8 మోడల్‌ ధర రూ.75999 గా ఉంది. అయితే ఈ స్మార్ట్‌ఫోన్‌ అనేక కీలక స్పెసిఫికేషన్‌లు, ఫీచర్‌లను కలిగి ఉంది. ఈ హ్యాండ్‌సెట్‌ (Google Pixel 8 Smartphone) ఆండ్రాయిడ్ 14 సహా టెన్సార్‌ G3 చిప్‌సెట్‌ పైన పనిచేస్తోంది. ప్రస్తుతం భారీ తగ్గింపు ధరతో ఈ హ్యాండ్‌సెట్‌ను కొనుగోలు చేయవచ్చు.

ప్రస్తుతం ప్రముఖ ఈ-కామర్స్‌ ప్లాట్‌ఫాం ఫ్లిప్‌కార్ట్‌ లో గూగుల్‌ పిక్సల్‌ 8 స్మార్ట్‌ ఫోన్‌ 8GB ర్యామ్ + 128GB స్టోరేజీ ధర రూ.61,999 గా ఉంది. అంటే విడుదల ధరతో పోలిస్తే 18 శాతం తగ్గింపును పొందింది. దీంతోపాటు ICICI బ్యాంకు డెబిట్‌, క్రెడిట్‌ కార్డుల ద్వారా రూ.8000 తగ్గింపును పొందవచ్చు.

Google Pixel 8 Smartphone available with huge discount on Flipkart 2024

దీంతోపాటు పాత స్మార్ట్‌ఫోన్‌ ను ఎక్స్చేంజీ చేయడం ద్వారా రూ.55,000 వరకు ప్రయోజనం పొందవచ్చు. మరియు రూ.5000 ఎక్స్చేంజీ బోనస్‌ను పొందవచ్చు. దీంతోపాటు ఫ్లిప్‌కార్ట్‌ యాక్సెస్‌ కార్డు ద్వారా 5 శాతం క్యాష్‌బ్యాక్‌ను పొందవచ్చు. అదే విధంగా 8GB ర్యామ్‌ + 256GB స్టోరేజీ వేరియంట్ ధర రూ.71999 గా ఉంది.

గూగుల్ పిక్సల్‌ 8 స్మార్ట్‌ఫోన్‌ స్పెసిఫికేషన్‌లు :
గూగుల్‌ పిక్సల్‌ 8 స్మార్ట్‌ ఫోన్‌ 120Hz రీఫ్రెష్‌ రేట్‌, 1080*2400 పిక్సల్‌ రిజల్యూషన్‌తో 6.2 అంగుళాల పుల్‌ HD+ OLED డిస్‌ప్లేను కలిగి ఉంది. ఈ హ్యాండ్‌సెట్‌ 2000 నిట్స్‌ గరిష్ఠ బ్రైట్‌నెస్‌ను కలిగి ఉంది. ఈ హ్యాండ్‌సెట్‌ డిస్‌ప్లే గొరెల్లా గ్లాస్‌ విక్టస్‌ రక్షణను కలిగి ఉంటుంది.

గూగుల్ పిక్సల్‌ 8 స్మార్ట్‌ఫోన్‌ టెన్సార్‌ G3 చిప్‌సెట్‌ మరియు టైటాన్‌ M2 సెక్యూరిటీ క్రో ప్రాసెసర్‌ పైన పనిచేస్తుంది. మరియు ఆండ్రాయిడ్‌ 14 ఆధారిత OS పైన పనిచేస్తోంది. 27W వైర్ మరియు 18W వైర్‌లెస్‌ ఛార్జింగ్‌ సపోర్టుతో 4575mAh ‌బ్యాటరీని కలిగి ఉంటుంది.

ఈ హ్యాండ్‌సెట్ 50MP ప్రధాన కెమెరా మరియు ఆటోఫోకస్‌ సామర్థ్యంతో 12MP మరో కెమెరాను కలిగి ఉంది. ముందువైపు ఈ గూగుల్‌ పిక్సల్‌ స్మార్ట్‌ఫోన్‌ 10.5MP సెల్ఫీ కెమెరాను అమర్చారు. ఈ ఫోన్‌ స్టీరియో స్పీకర్‌లు సహా IP68 రేటింగ్‌తో వాటర్‌ మరియు డస్ట్‌ రెసిస్టెంట్‌గా వస్తుంది. కనెక్టివిటీ పరంగా బ్లూటూత్ 5.3, వైఫై 802.11, USB-C ఛార్జింగ్‌ పోర్టును కలిగి ఉంది.

గిజ్‌బాట్‌ తెలుగు వెబ్‌ సైట్ గ్యాడ్జెట్లు సహా ఇతర టెక్‌ న్యూస్‌ కు సంబంధించిన ఆసక్తికరమైన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా వార్తల కోసం సోషల్‌ మీడియా ఖాతాలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు.

More from GizBot

Best Mobiles in India

English summary
Google Pixel 8 Smartphone available with huge discount on Flipkart 2024
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X