Home
Mobile

గూగుల్‌ పిక్సల్‌ 8 స్మార్ట్‌ఫోన్‌పై భారీ డిస్కౌంట్‌ ఆఫర్‌.. రూ.13,000 వరకు తగ్గింపు ప్రయోజనాలు..!

గూగుల్‌ పిక్సల్‌ 8 స్మార్ట్‌ ఫోన్‌ ( Google Pixel 8 Smartphone Discount Price ) గత సంవత్సరం అక్టోబర్‌లో లాంచ్‌ అయింది. ప్రస్తుతం ప్రముఖ ఈ-కామర్స్‌ ప్లాట్‌ ఫాం ఫ్లిప్‌ కార్ట్‌లో ఈ హ్యాండ్‌సెట్‌ ను భారీ తగ్గింపు ధరకు కొనుగోలు చేయవచ్చు. అయితే ప్రస్తుత ఆఫర్‌ ఒక కలర్‌ మరియు ఒక స్టోరేజీ వేరియంట్‌పైనే వర్తిస్తుంది.

గూగుల్‌ పిక్సల్‌ 8 స్మార్ట్‌ఫోన్‌ ధర..
గూగుల్‌ పిక్సల్‌ 8 స్మార్ట్‌ఫోన్‌ 8GB ర్యామ్‌ మరియు 128GB అంతర్గత స్టోరేజీ వేరియంట్ ధర రూ.62,999 గా ఉంది. అదే హాజల్‌, మింట్‌ మరియు ఒబ్సిడియన్‌ కలర్ వేరియంట్ల ధర రూ.69999 గా ఉంది. అదే 256GB అంతర్గత స్టోరేజీ వేరియంట్ ధర రూ.76,999 గా ఉంది.

Google Pixel 8 Smartphone gets huge discount

రూ.8000 తగ్గింపు సహా :
రోజ్‌ కలర్‌ వేరియంట్‌ 8GB ర్యామ్ + 128GB వేరియంట్ ను ICICI క్రెడిట్‌, డెబిట్‌ కార్డు ద్వారా కొనుగోలు చేస్తే రూ.8000 తగ్గింపును పొందవచ్చు. దీంతోపాటు ఎక్స్చేంజీ ద్వారా మరో రూ.5000 తగ్గింపును పొందవచ్చు. ఫలితంగా ఈ హ్యాండ్‌ సెట్‌ ను రూ.50,000 కంటే తక్కువ ధరకే కొనుగోలు చేయవచ్చు.

గూగుల్‌ పిక్సల్‌ 8 స్మా్ర్ట్‌ ఫోన్‌ 120Hz రీఫ్రెష్‌ రేట్‌తో 6.2 అంగుళాల పుల్‌ HD+ OLED డిస్‌ప్లేను కలిగి ఉంటుంది. మరియు డిస్‌ప్లే గొరెల్లా గ్లాస్‌ విస్టస్‌ రక్షణను పొందుతుంది. ఈ హ్యాండ్‌ సెట్‌ 2000 నిట్స్‌ గరిష్ఠ బ్రైట్‌ నెస్‌తో వస్తుంది. ఈ హ్యాండ్‌ సెట్ ఆండ్రాయిడ్ 14 ఆధారిత క్లీన్‌ OSపైన పనిచేస్తుంది. 7 సంవత్సరాల పాటు OS అప్‌డేట్లు ఇస్తామని గూగుల్‌ హామీ ఇచ్చింది.

డ్యూయల్‌ కెమెరాలు :
గూగుల్‌ పిక్సల్‌ 8 వెనుక వైపు డ్యూయల్‌ కెమెరాలను కలిగి ఉంటుంది. f/1.68 అపేచర్‌తో 50MP ప్రైమరీ కెమెరాను కలిగి ఉంటుంది. దీంతోపాటు పిక్సల్‌ 8 సోనీ IMX386 సెన్సార్‌, f/2.2 అపేచర్‌తో 12MP ఆల్ట్రా వైడ్‌ యాంగిల్‌ కెమెరాను కలిగి ఉంటుంది. ముందు వైపు 10.5MP కెమెరాను అమర్చారు.

18W వైర్‌ లెస్‌ ఛార్జింగ్‌ సపోర్టుతో.. :
ఈ స్మార్ట్‌ ఫోన్‌ 27W వైరడ్‌ ఛార్జింగ్‌, 18W వైర్‌ లెస్‌ ఛార్జింగ్‌ సపోర్టు తో 4,575mAh బ్యాటరీని కలిగి ఉంటుంది. మరియు ఈ హ్యాండ్‌ సెట్‌ వైఫై 6, బ్లూటూత్‌ 5.3, NFC మరియు USB- C మరియు భద్రత కోసం ఇన్‌ డిస్‌ప్లే ఫింగర్‌ ప్రింట్‌ సెన్సార్‌ ను కలిగి ఉంటాయి.

గిజ్‌బాట్‌ తెలుగు వెబ్‌సైట్ గ్యాడ్జెట్లు సహా ఇతర టెక్‌ న్యూస్‌కు సంబంధించిన ఆసక్తికరమైన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా వార్తల కోసం సోషల్‌ మీడియా ఖాతాలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు.

Best Mobiles in India

English summary
Google Pixel 8 Smartphone gets huge discount on Flipkart 2024
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X