భారీ డిస్కౌంట్ ధరకు గూగుల్ పిక్సల్ 8 స్మార్ట్‌ఫోన్‌ను కొనుగోలు చేసే ఛాన్స్ మిస్ చేసుకోవద్దు..!
భారత్ మార్కెట్ లో ఎంట్రీ లెవల్, మిడ్ రేంజ్ స్మార్ట్‌ఫోన్‌లతోపాటు ప్రీమియం హ్యాండ్‌సెట్‌లకు కూడా భారీ డిమాండ్ ఉంది. ప్రస్తుతం ప్రముఖ ఇ-కామర్స్ ప్లాట్‌ఫాం ఫ్లిప్‌కార్ట్ లో గూగుల్ పిక్సల్ 8 హ్యాండ్‌సెట్ ను (Google Pixel 8 Smartphone) భారీ డిస్కౌంట్ ధరకు కొనుగోలు చేయవచ్చు. ఈ హ్యాండ్‌సెట్ ప్రీమియం డిజైన్‌తోపాటు మెరుగైన స్పెసిఫికేషన్ లు, ఫీచర్ లను కలిగి ఉంది. గూగుల్ పిక్సల్ 8 ఫోన్ 2023 అక్టోబర్ లో విడుదల అయింది.
ఏకంగా రూ.28000 తగ్గింపు! :
గూగుల్ పిక్సల్ 8 స్మార్ట్‌ఫోన్ 8GB ర్యామ్ + 128GB స్టోరేజీ, 8GB ర్యామ్ + 256GB స్టోరేజీ వేరియంట్‌లో అందుబాటులో ఉంది. విడుదల సమయంలో 128GB స్టోరేజీ వేరియంట్ ధర రూ.75,999 గా ఉండేది. ప్రస్తుతం ఫ్లిప్‌కార్ట్ లో సుమారు రూ.28000 డిస్కౌంట్ ను పొందవచ్చు. ఫలితంగా ఫోన్ ధర రూ.రూ.47,999 గా ఉంది.

అదనపు డిస్కౌంట్ :
ఫ్లిప్‌కార్ట్‌లో (Filpkart) HDFC బ్యాంకు క్రెడిట్ కార్డు EMI ట్రాన్సాక్షన్ ద్వారా రూ.3000 డిస్కౌంట్ ను పొందవచ్చు. మరియు ఫ్లిప్‌కార్ట్ యాక్సెస్ బ్యాంకు క్రెడిట్ కార్డు ద్వారా 5 శాతం డిస్కౌంట్ ను పొందవచ్చు. ఫ్లిప్‌కార్ట్ మాన్యుమెంట్ సేల్ లో భాగంగా మరింత డిస్కౌంట్‌ను అందించే అవకాశం ఉంది. ఈ ఫోన్ హజెల్, మింట్, ఒబ్సిడియన్, రోజ్ రంగుల్లో లభిస్తుంది.
గూగుల్ పిక్సల్ 8 స్మార్ట్‌ఫోన్ స్పెసిఫికేషన్‌లు, ఫీచర్‌లు :
గూగుల్ పిక్సల్ 8 స్మార్ట్‌ఫోన్ 6.2 అంగుళాల (1080*2400 పిక్సల్స్) FHD+ OLED డిస్‌ప్లేతో అందుబాటులో ఉంది. ఈ డిస్‌ప్లే 120Hz రీఫ్రెష్ రేట్, 2000 నిట్స్ గరిష్ఠ బ్రైట్‌నెస్ ను కలిగి ఉంది. మరియు డిస్‌ప్లే గొరెల్లా గ్లాస్ విక్టస్ రక్షణను పొందుతుంది.
ఏకంగా 7 సంవత్సరాలపాటు సాఫ్ట్‌వేర్ అప్‌డేట్‌లు :
ఈ గూగుల్ ఫోన్ ఆండ్రాయిడ్ 14 ఆధారిత OS ను కలిగి ఉంది. మరియు ఈ హ్యాండ్‌సెట్ టెన్సార్ G3 చిప్‌సెట్ తోపాటు టైటాన్ M2 సెక్యూరిటీ క్రో ప్రాసెసర్ ను కలిగి ఉంది. ఈ స్మార్ట్‌ఫోన్ రెండు స్టోరేజీ వేరియంట్‌లో అందుబాటులో ఉంది. ఏకంగా 7 సంవత్సరాలపాటు ఆండ్రాయిడ్, సెక్యూరిటీ అప్‌డేట్ లను పొందనుంది.
50MP ప్రైమరీ కెమెరా :
కెమెరా విభాగం పరంగా వెనుక వైపు డ్యూయల్ కెమెరా యూనిట్ ను కలిగి ఉంది. 50MP ఆక్టా PD ప్రైమరీ కెమెరా, 8x సూపర్ రిజల్యూషన్ డిజిటల్ జూమ్ మరియు 12MP ఆటోఫోకస్ కెమెరాలను అమర్చారు. సెల్ఫీ, వీడియో కాల్స్ కోసం 10.5MP కెమెరాతో అందుబాటులో ఉంది.
IP68 రేటింగ్ :
గూగుల్ పిక్సల్ 8 స్మార్ట్‌ఫోన్ 18W వైర్‌లెస్, 27W వైర్ ఛార్జింగ్ సపోర్టుతో 4,575mAh బ్యాటరీతో పనిచేస్తుంది. కనెక్టివిటీ పరంగా వైఫై 802.11, బ్లూటూత్ 5.3, USB-C ఛార్జింగ్ పోర్టును కలిగి ఉంది. IP68 రేటింగ్ తో డస్ట్ మరియు వాటర్ రెసిస్టెన్స్‌ను కలిగి ఉంది. మెరుగైన ఆడియో కోసం స్టీరియో స్పీకర్‌లను అమర్చారు.


Click it and Unblock the Notifications








