Home
Mobile

గూగుల్‌ పిక్సల్‌ 8 స్మార్ట్‌ఫోన్‌పై ఫ్లిప్‌కార్ట్‌ ఆఫర్‌.. ఈ కార్టులపై రూ.8000 తగ్గింపు..!!

ప్రముఖ టెక్‌ దిగ్గజం గూగుల్ గత సంవత్సరం సెప్టెంబర్‌లో గూగుల్‌ పిక్సల్‌ 8 స్మార్ట్‌ఫోన్‌ను (Google Pixel 8 Smartphone) విడుదల చేసింది. ఈ హ్యాండ్‌సెట్ అనేక మెరుగైన స్పెసిఫికేషన్‌లు, ఫీచర్‌లను కలిగి ఉంది. 50MP కెమెరా సహా 6.2 అంగుళాల పుల్‌ HD+ డిస్‌ప్లేతో వచ్చింది. ఆండ్రాయిడ్ 14 పైన పనిచేస్తోంది. ప్రస్తుతం ఈ హ్యాండ్‌సెట్‌ను తగ్గింపు ధరకే కొనుగోలు చేయవచ్చు. దీంతోపాటు బ్యాంకు ఆఫర్ల ద్వారా మరింత డిస్కౌంట్‌ను పొందవచ్చు. ఎక్స్చేంజీ ఆఫర్‌లు కూడా అందుబాటులో ఉన్నాయి.

గూగుల్ పిక్సల్‌ 8 స్మార్ట్‌ఫోన్‌ 8GB ర్యామ్‌ + 128GB అంతర్గత స్టోరేజీ వేరియంట్ ధర రూ.63,999 గా ఉంది. అదే 8GB ర్యామ్‌ + 256GB స్టోరేజీ వేరియంట్‌ ధర రూ.73,999 గా ఉంది. ICICI బ్యాంకు క్రెడిట్‌ కార్డుల ద్వారా కొనుగోలు చేస్తే రూ.8000 తగ్గింపును పొందవచ్చు.

Google Pixel 8 Smartphone price drop on flipkart in india

ఫ్లిప్‌కార్ట్‌ యాక్సెస్‌ క్రెడిట్‌ కార్డు ద్వారా 5 శాతం తగ్గింపును పొందవచ్చు. దీంతోపాటు గూగుల్‌ పిక్సల్‌ 8 స్మార్ట్‌ఫోన్‌ను కొనుగోలు చేసే సమయంలో ఎంపిక చేసిన మోడల్స్‌ను ఎక్స్చేంజీ చేయడం ద్వారా రూ.4000 తగ్గింపును పొందవచ్చు. ఈ పిక్సల్‌ 8 హ్యాండ్‌సెట్ మింట్‌, ఒబ్సిడియన్‌ మరియు రోజ్‌ రంగుల్లో లభిస్తుంది.

గూగుల్ పిక్సల్‌ 8 స్మార్ట్‌ఫోన్‌ స్పెసిఫికేషన్‌లు :
గూగుల్‌ పిక్సల్‌ 8 హ్యాండ్‌సెట్‌ 6.2 అంగుళాల పుల్‌ HD+ OLED డిస్‌ప్లేను కలిగి ఉంటుంది. 120Hz రీఫ్రెష్‌ రేట్‌, 2000 నిట్స్‌ గరిష్ఠ బ్రైట్‌నెస్‌ను కలిగి ఉంది. ఈ హ్యాండ్‌సెట్‌ డిస్‌ప్లే గొరెల్లా గ్లాస్‌ విక్టస్‌ రక్షణను కలిగి ఉంటుంది.

ఈ హ్యాండ్‌సెట్‌ ఆండ్రాయిడ్ 14 ఆధారిత OS ను కలిగి ఉంటుంది. మరియు టెన్సార్‌ G3 చిప్‌సెట్‌ మరియు టైటాన్‌ M2 సెక్యూరిటీ క్రో ప్రాసెసర్‌ పైన పనిచేస్తుంది. ఈ హ్యాండ్‌సెట్ 50MP + 12MP కెమెరాను కలిగి ఉంటుంది. మరియు సెల్ఫీ, వీడియో కాల్స్‌ కోసం 10.5MP సెల్ఫీ కెమెరాను కలిగి ఉంటుంది.

ఈ గూగుల్‌ పిక్సల్ 8 స్మార్ట్‌ఫోన్‌ 27W వైర్ మరియు 18W వైర్‌లెస్‌ ఛార్జింగ్‌ సపోర్టుతో 4575mAh ‌బ్యాటరీని కలిగి ఉంటుంది. IP68 రేటింగ్‌తో వాటర్‌, డస్ట్ రెసిస్టెంట్‌గా వచ్చింది. స్టీరియో స్పీకర్‌లను కలిగి ఉంది. భద్రత కోసం ఇన్‌డిస్‌ప్లే ఫింగర్‌ ప్రింట్ స్కానర్‌ను కలిగి ఉంది. కనెక్టివిటీ పరంగా ఈ హ్యాండ్‌సెట్‌ బ్లూటూత్ 5.3, వైఫై 6, USB-3.2 పోర్టును కలిగి ఉంది.

గిజ్‌బాట్‌ తెలుగు వెబ్‌ సైట్ గ్యాడ్జెట్లు సహా ఇతర టెక్‌ న్యూస్‌ కు సంబంధించిన ఆసక్తికరమైన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరి కొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్ల కు చేరవేస్తుంది. తాజా వార్తల కోసం సోషల్‌ మీడియా ఖాతాలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీ తోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు.

More from GizBot

Best Mobiles in India

English summary
Google Pixel 8 Smartphone price drop on flipkart
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X