గూగుల్ పిక్సల్ 8a కీలక వివరాలు లీక్.. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారిత సూపర్ ఫీచర్లు.. ఎలా పనిచేస్తాయంటే?
గూగుల్ పిక్సల్ 8a స్మార్ట్‌ఫోన్ (Google Pixel 8a) విడుదల తేదీపై అధికారిక ప్రకటన ఇంకా వెలువడలేదు. గూగుల్ i/O కార్యక్రమంలో మే 14 న విడుదల అయ్యే అవకాశం ఉంది. ఇప్పటికే ఈ హ్యాండ్‌సెట్ గురించి అనేక లీక్‌లు వచ్చాయి. తాజాగా ఈ హ్యాండ్‌సెట్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారిత ఫీచర్లను కలిగి ఉంటుందని ప్రొమోషనల్ వీడియో ఆధారంగా తెలిసింది.
దీంతోపాటు గూగుల్ పిక్సల్ 8a స్మార్ట్‌ఫోన్ ఫీచర్లు, సాఫ్ట్‌వేర్ సపోర్టు గురించి మరిన్ని వివరాలు వెల్లడయ్యాయి. టిప్‌స్టర్ స్టీవీ హెమ్మర్‌స్టోఫర్ పిక్సల్ 8a ప్రొమోషనల్ వీడియో లీక్ చేశారు. దీని ఆధారంగా ఈ స్మార్ట్‌ఫోన్ బెస్ట్ టెక్ పేరుతో ఫీచర్‌ను కలిగి ఉంది దీని ద్వారా కళ్లు మూసుకొని లేదా ఇతర కారణాలతో సరిగా క్యాప్టర్ కాని ఫొటోలను మార్చుకొనేందుకు వీలుంటుంది.

దీంతోపాటు మరో రెండు కీలక ఫీచర్‌లను ఈ గూగుల్ పిక్సల్ 8a స్మార్ట్‌ఫోన్ కలిగి ఉంది. అవే సర్కిర్ టూ సెర్చ్ (Circle To Search), ఆడియో మ్యాజిక్ ఎరేజర్ ఫీచర్లు. రికార్డింగ్ చేసిన వీడియోలో ఎక్కడైన అవసరం లేని సౌండ్ ఉండే ఈ ఆడియో మ్యాజిక్ ఎరేజర్ ఫీచర్ ద్వారా తొలగించవచ్చు. ఈ ఫీచర్ ఆర్టిపిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారంగా పనిచేస్తుంది.
ఈ గూగుల్ పిక్సల్ 8a స్మా్ర్ట్‌ఫోన్ గురించి తాజాగా లీకైన ప్రొమోషనల్ వీడియో ఆధారంగా వాయిస్ కాల్ ను లైవ్ ట్రాన్సిలేషన్ సదుపాయం కూడా అందుబాటులో ఉంటుంది. అంటే ఇతర భాషల వ్యక్తులతో మాట్లాడుతున్న సమయంలో వారి మాటలను మన భాషలోకి, మన మాటలను వారి భాషలతో అనువదిస్తుంది.
ఇప్పటి వరకు వెలుగులోకి వచ్చిన లీక్‌ల ఆధారంగా గూగుల్ పిక్సల్ 8a అప్‌గ్రేడ్ చేయబడిన టెన్సార్ G3 SoC చిప్‌సెట్ ను కలిగి ఉంటుందని తెలుస్తోంది. 6.1 అంగుళాల పుల్ HD+ (1080*2400 పిక్సల్) OLED డిస్‌ప్లేను కలిగి ఉంటుందని సమాచారం. 1400 నిట్స్ HDR బ్రైట్‌నెస్, 120Hz రీఫ్రెష్ రేట్‌ను కలిగి ఉంటుందని తెలుస్తోంది. 7 సంవత్సరాలపాటు సెక్యూరిటీ అప్‌డేట్‌లను కలిగి ఉంటుందని తెలిసింది.
దీంతోపాటు ఈ ఫోన్ వెనుక వైపు రెండు కెమెరాలు ఉండే అవకాశం ఉంది. OIS (ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్) సపోర్టుతో 64MP ప్రైమరీ కెమెరా, 13MP అల్ట్రావైడ్ యాంగిల్ మరో కెమెరాను కలిగి ఉంటుందని తెలుస్తోంది. దీంతోపాటు 13MP సెల్ఫీ కెమెరాను కలిగి ఉంటుందని తెలుస్తోంది.
విన్ ఫ్యూచర్ నివేదిక ఆధారంగా ఈ ఫోన్ ఒబ్సిడియన్, బే, పార్సి లైన్, మింట్ రంగుల్లో అందుబాటులోకి వస్తుందని తెలుస్తోంది. రెండు వేరియంట్లు అన్ని రంగుల్లో అందుబాటులో ఉండవని తెలుస్తోంది. 256GB స్టోరేజీ వేరియంట్ ఒబ్సిడియన్ (బ్లాక్) రంగుల్లో అందుబాటులో ఉంటుంది.
గిజ్‌బాట్ తెలుగు వెబ్‌సైట్ గ్యాడ్జెట్లు సహా ఇతర టెక్ న్యూస్‌కు సంబంధించిన ఆసక్తికరమైన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా వార్తల కోసం సోషల్ మీడియా ఖాతాలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు.


Click it and Unblock the Notifications