గూగుల్ పిక్సల్ 8a స్మార్ట్‌ఫోన్ పై భారీ డిస్కౌంట్.. ఈ బ్యాంకు కార్డులపై రూ.4000 తగ్గింపు..!
ప్రముఖ టెక్ దిగ్గజం గూగుల్ నుంచి ఇటీవల గూగుల్ పిక్సల్ 9 సిరీస్ స్మార్ట్ ఫోన్ లు లాంచ్ అయ్యాయి. ఈ సిరీస్‌లో భాగంగా గూగుల్ పిక్సల్ 9, 9 ప్రో, ప్రో XL, ఫోల్డ్ మోడళ్లు లాంచ్ అయ్యాయి. ప్రముఖ ఈ-కామర్స్ సంస్థ ఫ్లిప్ కార్ట్ (Flipkart) గూగుల్ పిక్సల్ 8a హ్యాండ్‌సెట్ ను (Google Pixel 8a Smartphone) భారీ డిస్కౌంట్ ధరకు కొనుగోలు చేయవచ్చు. ఈ సంవత్సరం మే నెలలో ఈ హ్యాండ్ సెట్ విడుదల అయింది. ప్రస్తుతం ఫ్లిప్‌కార్ట్‌లో రూ.50,000 కంటే తక్కువ ధరకే కొనుగోలు చేయవచ్చు. గూగుల్ నుంచి పిక్సల్ 9a విడుదలయ్యే అవకాశం ఉంది.
2024 మే నెలలో విడుదల సమయంలో ఈ హ్యాండ్ సెట్ 128GB రూ.52,999, అదే 256GB స్టోరేజీ వేరియంట్ ధర రూ.59,999 గా ఉండేది. ప్రస్తుతం ఫ్లిప్ కార్ట్ లో ప్రారంభ ధర రూ.49,999 గా ఉంది. ICICI బ్యాంకు క్రెడిట్, డెబిట్ కార్డు ద్వారా రూ.4,000 డిస్కౌంట్ ను కలిగి ఉంది. ఫలితంగా రూ.45,999 ధరకు అందుబాటులో ఉంది.

గూగుల్ పిక్సల్ 8a స్మార్ట్ ఫోన్ స్పెసిఫికేషన్లు :
గూగుల్ పిక్సల్ 8a స్మార్ట్‌ఫోన్ 120Hz రీఫ్రెష్ రేట్‌తో 6.1 అంగుళాల OLED డిస్‌ప్లేను కలిగి ఉంది. 2000 వరకు గరిష్ఠ బ్రైట్‌నెస్‌తో అందుబాటులో ఉంది. డిస్‌ప్లే రక్షణకు ఈ హ్యాండ్‌సెట్ కార్నింగ్ గొరెల్లా గ్లాస్ రక్షణను కలిగి ఉంది. HDR సపోర్టుతో వచ్చింది.
7 సంవత్సరాల పాటు అప్‌డేట్‌లు : గూగుల్ పిక్సల్ 8a స్మార్ట్ ఫోన్ Tensor G3 చిప్‌సెట్ మరియు టైటాన్ M2 సెక్యూరిటీ కో ప్రాసెసర్ ను కలిగి ఉంది. ఈ రెండు చిప్‌సెట్ లు గరిష్ఠంగా 8GB LPDDR5x ర్యామ్‌తో జతచేయబడతాయి. ఆండ్రాయిడ్ 14 ఆధారిత OS ను కలిగి ఉంది. ఈ హ్యాండ్‌సెట్ 7 సంవత్సరాలపాటు ఆండ్రాయిడ్, సెక్యూరిటీ అప్‌డేట్ లను పొందనుందని తెలిపింది.
64MP కెమెరా, 4492mAh బ్యాటరీ : ఈ హ్యాండ్ సెట్ 64MP ప్రైమరీ కెమెరా, 13MP అల్ట్రా వైడ్ కెమెరాలను కలిగి ఉంటుంది. ఈ ఫోన్ 13MP సెల్ఫీ కెమెరాను కలిగి ఉంది. ఈ హ్యాండ్ సెట్ 4492mAh బ్యాటరీని కలిగి ఉంటుంది. ఈ కెమెరాలు AI ఫీచర్ లను కలిగి ఉన్నాయి. గ్రూప్ ఫోటోల కోసం బెస్ట్ టేక్, మేజిక్ ఎడిటర్, ఆడియో మేజిక్ ఎరేజర్ సహా జెమినీ పైన పనిచేస్తుంది.
గిజ్ బాట్ తెలుగు వెబ్‌సైట్ గ్యాడ్జెట్లు సహా ఇతర టెక్ న్యూస్ కు సంబంధించిన ఆసక్తికరమైన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరి కొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా వార్తల కోసం సోషల్ మీడియా ఖాతాలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు.


Click it and Unblock the Notifications