Home
Mobile

ఏకంగా రూ.15,000 తగ్గింపు ధరకు గూగుల్‌ పిక్సల్‌ 8a స్మార్ట్‌ఫోన్‌.. AI ఫీచర్‌లు, 64MP కెమెరా సహా..!

గూగుల్‌ నుంచి గత సంవత్సరం మే నెలలో గూగుల్‌ పిక్సల్‌ 8a స్మార్ట్‌ఫోన్‌ (Google Pixel 8a Smartphone) భారత్‌ మార్కెట్‌లో లాంచ్‌ అయింది. ఈ హ్యాండ్‌సెట్‌ ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ సహా అనేక కీలక ఫీచర్‌లను కలిగి ఉంది. టెన్సార్‌ చిప్‌సెట్‌ సహా 64MP ప్రైమరీ కెమెరాను కలిగి ఉంది. ప్రస్తుతం భారీ డిస్కౌంట్‌తో కొనుగోలు చేసేందుకు అందుబాటులో ఉంది. విడుదల ధరతో పోలిస్తే ఫ్లిప్‌కార్ట్‌ లో (Flipkart) ప్రస్తుతం సుమారు రూ.15,000 తగ్గింపుతో సొంతం చేసుకోవచ్చు.

రూ.15000 డిస్కౌంట్‌ ధరకు :
గూగుల్‌ పిక్సల్‌ 8a స్మార్ట్‌ఫోన్‌ విడుదల సమయంలో 8GB ర్యామ్ + 128GB స్టోరేజీ ధర రూ.52,999 గా ఉంది. అదే 8GB ర్యామ్ + 256GB స్టోరేజీ వేరియంట్ ధర రూ.59,999 గా ఉంది. ప్రస్తుతం ఫ్లిప్‌కార్ట్‌లో 128GB స్టోరేజీ వేరియంట్‌ను రూ.37,999 ధరకు సొంతం చేసుకోవచ్చు. అంటే సుమారు రూ.15000 డిస్కౌంట్‌ను పొందవచ్చు.

Google pixel 8a Smartphone

నాలుగు కలర్‌ వేరియంట్‌లు :
అదే విధంగా 256GB స్టోరేజీ వేరియంట్‌ను రూ.44,999 గా ఉంది. ఈ వేరియంట్‌పై రూ.8000 డిస్కౌంట్‌ను పొందవచ్చు. ఈ ఫోన్‌ అనేక ఫ్లాగ్‌షిప్‌ ఫీచర్‌లను కలిగి ఉంది. ఈ హ్యాండ్‌సెట్ Aloe, బే, పార్సిలియన్, అబ్సిడియన్‌ రంగుల్లో లభిస్తుంది.

గూగుల్‌ పిక్సల్‌ 8a స్పెసిఫికేషన్‌లు, ఫీచర్‌ల వివరాలు :
ఈ గూగుల్‌ స్మార్ట్‌ఫోన్‌ 120Hz రీఫ్రెష్‌ రేట్‌తో 6.1 అంగుళాల FHD+ డిస్‌ప్లేను కలిగి ఉంది. 2000 గరిష్ట బ్రైట్‌నెస్‌, HDR సపోర్టును కలిగి ఉంది. ఈ డిస్‌ప్లే కార్నింగ్ గొరెల్లా గ్లాస్‌ రక్షణను పొందుతోంది.

టెన్సార్ G3 చిప్‌సెట్‌ :
గూగుల్‌ పిక్సల్‌ 8a హ్యాండ్‌సెట్‌ ఆండ్రాయిడ్‌ 14 ఆధారిత OS తో పనిచేస్తోంది. మరియు గూగుల్‌ Tensor G3 చిప్‌సెట్‌తోపాటు టైటాన్ M2 సెక్యూరిటీ చిప్‌సెట్‌ను కూడా కలిగి ఉంది. ఈ ఫోన్‌ 7 సంవత్సరాల ఆండ్రాయిడ్ OS అప్‌డేట్‌లతోపాటు సెక్యూరిటీ అప్‌డేట్‌లను పొందుతుందని తెలిపింది.

కెమెరా వివరాలు :
ఈ స్మార్ట్‌ఫోన్‌ వెనుక వైపు డ్యూయల్‌ కెమెరాలను కలిగి ఉంది. 64MP ప్రైమరీ కెమెరాతోపాటు 13MP అల్ట్రావైడ్‌ లెన్స్‌ను అమర్చారు. సెల్ఫీ, వీడియో కాల్స్‌ కోసం ముందువైపు 13MP కెమెరాను కలిగి ఉంది. ఈ కెమెరాలు అనేక ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్ (AI) కెమెరాలను కలిగి ఉన్నాయి.

AI ఫీచర్‌లు :
మేజిక్‌ ఎడిటర్‌, బెస్ట్‌ టేక్‌, మేజిక్‌ ఎరేజర్‌, ఫొటో అన్‌బ్లర్‌, రియల్‌టోన్‌, ఫేస్‌ అన్‌బ్లర్‌, మాన్యువల్‌ వైట్‌, పనోరమా, లాక్డ్ ఫోల్డర్, నైట్‌ సైట్‌, ట్యాప్‌ షాట్‌, పొర్ట్రెయిట్‌ మోడ్‌, మోషన్‌ ఆటోఫోకస్‌, లైవ్ HDR+, అల్ట్రా HDR వంటి అనేక AI ఫీచర్‌లను ఈ కెమెరాలను కలిగి ఉన్నాయి.

కనెక్టివిటీ పరంగా గూగుల్‌ ఫోన్‌ 5G, 4G LTE, బ్లూటూత్‌ 5.3, వైఫై 6 వంటి ఫీచర్‌లను కలిగి ఉంది. వీటితోపాటు ప్రాక్సిమిటీ సెన్సార్‌, యాంబియంట్‌ లైట్, యాక్సెలిరోమీటర్‌, గైరోమీటర్‌, మాగ్నటోమీటర్‌, బారోమీటర్‌ వంటి సెన్సార్‌ను అమర్చారు. ఈ హ్యాండ్‌సెట్‌ బరువు 188 గ్రాములుగా ఉంది.

More from GizBot

Best Mobiles in India

English summary
Google pixel 8a Smartphone gets massive price drop on flipkart 2025
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X