Home
Mobile

గూగుల్‌ పిక్సల్‌ 8a స్మార్ట్‌ఫోన్‌ పై రూ.3000 డిస్కౌంట్‌.. త్వరలో పిక్సల్‌ 9a విడుదల..?

గూగుల్‌ నుంచి భారత్‌ మార్కెట్‌లోకి పిక్సల్‌ 9a స్మార్ట్‌ఫోన్‌ (Google pixel 8a Smartphone) త్వరలో విడుదల కానుంది. విడుదల తేదీపై గూగుల్‌ ఎటువంటి అధికారిక ప్రకటన చేయకపోయినా.. ఇప్పటికే వచ్చిన లీక్స్‌ ఆధారంగా గ్లోబల్ మార్కెట్‌ లో ఈ హ్యాండ్‌సెట్‌ మార్చి 19వ తేదీన లాంచ్‌ కానుందని తెలిసింది. మరియు మార్చి 20 వ తేదీన భారత్‌లో మార్కెట్‌లో విడుదల అయ్యే అవకాశం ఉంది. ఇప్పటికే ఈ హ్యాండ్‌సెట్‌కు సంబంధించిన అనేక వివరాలు వెల్లడయ్యాయి. డిజైన్‌ పరంగా కొన్ని మార్పులు ఉంటాయని తెలుస్తోంది.

బ్యాంకు డిస్కౌంట్‌ ఆఫర్‌ :
పిక్సల్‌ 9a హ్యాండ్‌సెట్‌ విడుదల కానుండగా.. ప్రస్తుతం అందుబాటులో ఉన్న పిక్సల్‌ 8a స్మా్ర్ట్‌ఫోన్‌ ను డిస్కౌంట్ ధరకు కొనుగోలు చేయవచ్చు. విడుదల ధరతో పోలిస్తే రూ.15,000 తగ్గింపు ధరకు ప్రస్తుతం అందుబాటులో ఉండగా.. బ్యాంకు కార్డులతో మరింత తగ్గింపును పొందవచ్చు.

Google pixel 8a Smartphone gets Rs 3000 bank discount on flipkart ahead of pixel 9a launch

గత సంవత్సరం మే నెలలో గూగుల్‌ పిక్సల్‌ 8a హ్యాండ్‌సెట్‌ లాంచ్ అయింది. విడుదల సమయంలో ఈ ఫోన్ 8GB ర్యామ్ + 128GB స్టోరేజీ ధర రూ.52,999, 8GB ర్యామ్ + 256GB స్టోరేజీ ధర రూ.59,999 గా ఉంది. ప్రస్తుతం వరుసగా రూ.37,999, రూ.44,999 కే కొనుగోలు చేయవచ్చు.

5 శాతం క్యాష్‌బ్యా్క్‌ :
ప్రస్తుతం ఫ్లిప్‌కార్ట్‌ HDFC బ్యాంకు క్రెడిట్‌ కార్డు EMI ట్రాన్సాక్షన్‌పై రూ.3000 డిస్కౌంట్‌ను పొందవచ్చు. మరియు ఫ్లిప్‌కార్ట్ యాక్సెస్‌ బ్యాంకు క్రెడిట్ కార్డు ద్వారా 5 శాతం క్యాష్‌బ్యా్క్‌ను పొందవచ్చు. ఈ హ్యాండ్‌సెట్ పార్సిలియన్, అబ్సిడియన్‌, Aloe, బే రంగుల్లో భారత్‌ మార్కెట్‌లో అందుబాటులో ఉంది.

7 సంవత్సరాల వరకు సెక్యూరిటీ అప్‌డేట్స్ :
గూగుల్‌ పిక్సల్‌ 8a స్మార్ట్‌ఫోన్‌ Tensor G3 చిప్‌సెట్‌ ను కలిగి ఉంది. దీంతోపాటు టైటాన్‌ M2 సెక్యూరిటీ చిప్‌సెట్‌ కూడా అమర్చి ఉంటుంది. ఈ హ్యాండ్‌సెట్ ఆండ్రాయిడ్‌ 14 ఆధారిత OS తో పనిచేస్తుంది. ఈ హ్యాండ్‌సెట్ ఏకంగా 7 ఆండ్రాయిడ్‌ OS అప్‌డేట్స్‌ను పొందుతుంది. మరియు 7 సంవత్సరాల వరకు సెక్యూరిటీ అప్‌డేట్స్‌లను అందిస్తామని గూగుల్‌ తెలిపింది.

Take a Poll

ప్రీమియం లుక్‌ :
ఈ స్మార్ట్‌ఫోన్‌ ప్రీమియం డిజైన్‌ను కలిగి ఉంది. స్కాచ్‌ రెసిస్టెంట్‌గా అందుబాటులోకి వచ్చింది. మ్యాటీ బ్యాక్ కవర్‌ను కలిగి ఉంది. ఈ హ్యాండ్‌సెట్ 6.1 అంగుళాల FHD+ డిస్‌ప్లేను కలిగి ఉంది. ఈ డిస్‌ప్లే 120Hz రీఫ్రెష్‌ రేట్‌, 2000 గరిష్ఠ బ్రైట్‌నెస్‌, HDR సపోర్టుతో అందుబాటులో ఉంది. ఈ హ్యాండ్‌సెట్‌ కార్నింగ్ గొరెల్లా గ్లాస్‌ రక్షణను పొందుతోంది.

64MP కెమెరా. AI ఫీచర్‌లు :
ఈ హ్యాండ్‌సెట్‌ మెరుగైన కెమెరా ఫీచర్‌లను కలిగి ఉంది. ఈ ఫోన్‌ వెనుక వైపు డ్యూయల్‌ కెమెరాలను అమర్చి ఉన్నాయి. ఈ ఫోన్ 64MP ప్రైమరీ కెమెరా, 13MP అల్ట్రావైడ్‌ కెమెరా, 13MP సెల్ఫీ కెమెరాలను కలిగి ఉంది. ఈ కెమెరాలు అనేక AI ఫీచర్‌లను సపోర్టు చేస్తాయి. మోషన్‌ ఆటోఫోకస్‌, అల్ట్రా HDR, మేజిక్‌ ఎడిటర్‌, ఫొటో అన్‌ బ్లర్‌, బెస్ట్‌ టేక్‌, మేజిక్‌ ఎరేజర్‌, రియల్‌ టోన్‌, ఫేస్‌ అన్‌ బ్లర్‌, మాన్యువల్‌ వైట్‌, పనోరమా, లాక్డ్ ఫోల్డర్, లైవ్ HDR+ వంటి ఫీచర్‌లున్నాయి.

బ్యాటరీ వివరాలు :
ఈ ఫోన్ 4404mAh బ్యాటరీతో పనిచేస్తోంది. మరియు ఈ హ్యాండ్‌సెట్‌ IP67 రేటింగ్‌తో డస్ట్‌ మరియు వాటర్‌ రెసిస్టెంట్‌గా ఉంది. దీంతోపాటు కనెక్టివిటీ పరంగా 5G, 4G LTE, వైఫై, బ్లూటూత్‌ 5.3 వంటి అనేక ఫీచర్‌లను కలిగి ఉంది. వీటితోపాటు అనేక సెన్సార్‌లను కలిగి ఉంది.

More from GizBot

Best Mobiles in India

English summary
Google pixel 8a Smartphone gets Rs 3000 bank discount on flipkart ahead of pixel 9a launch
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X