Home
Mobile

గూగుల్‌ పిక్సల్‌ కొత్త ఫోన్‌ ధర వివరాలు లీక్‌.. కర్వడ్‌ ఎడ్జ్‌, G3 చిప్‌సెట్ సహా కీలక ఫీచర్లు..!!

గూగుల్‌ నుంచి త్వరలో కొత్త స్మార్ట్‌ఫోన్‌ గూగుల్‌ పిక్సల్‌ 8a (Google Pixel 8a Smartphone) త్వరలో లాంచ్‌ కానుందని తెలుస్తోంది. గూగుల్‌ IO 2024 కార్యక్రమంలో ఈ కొత్త ఫోన్‌ లాంచ్‌ అయ్యే అవకాశం ఉంది. ఈ కార్యక్రమం మే నెలలో నిర్వహించే అవకాశం ఉంది. అయితే తాజాగా వచ్చిన రిపోర్టులో గూగుల్‌ పిక్సల్‌ 8a ధరకు సంబంధించిన వివరాలు లీక్ అయ్యాయి.

గత మోడల్ కంటే ఎక్కువ ధర! : అయితే గూగుల్‌ పిక్సల్‌ a సిరీస్‌ స్మార్ట్‌ఫోన్లు అందుబాటు ధరకే విడుదల అయ్యాయి. అంటే మిడ్‌ రేంజ్‌ యూజర్లను దృష్టిలో పెట్టుకొని విడుదల చేశారు. అయితే గూగుల్‌ పిక్సల్ 8a ధర మాత్రం ఊహించినదాని కంటే ఎక్కువగా ఉండే అవకాశం ఉంది.

Google Pixel 8a Smartphone Price leaked

విన్‌ఫ్యూచర్‌ నివేదిక ఆధారంగా గూగుల్‌ పిక్సల్‌ 8a స్మార్ట్‌ఫోన్‌ రెండు స్టోరేజీ వేరియంట్లు మరియు నాలుగు వేరియంట్లలో అందుబాటులో ఉండే అవకాశం ఉంది. ధర విషయానికి వస్తే గూగుల్‌ పిక్సల్‌ 7a హ్యాండ్‌సెట్‌ రూ.45000 కంటే తక్కువకే అందుబాటులోకి రాగా.. 8a ధర మాత్రం రూ.50000 కంటే ఎక్కువ ఉంటుందని తెలుస్తోంది.

కొన్ని నివేదికల ఆధారంగా గూగుల్‌ పిక్సల్‌ 8a స్మార్ట్‌ఫోన్‌ 128GB లేదా 256GB స్టోరేజీ వేరియంట్లలో అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. విన్‌ఫ్యూచర్‌ నివేదిక ఆధారంగా ఈ ఫోన్‌ ఒబ్సిడియన్‌, బే, పార్సిలైన్‌, మింట్‌ రంగుల్లో అందుబాటులోకి వస్తుందని తెలుస్తోంది. అయితే అన్ని రంగుల్లో రెండు వేరియంట్లు అందుబాటులో ఉండవని తెలుస్తోంది. 256GB స్టోరేజీ వేరియంట్‌ ఒబ్సిడియన్‌ (బ్లాక్‌) రంగుల్లో అందుబాటులో ఉంటుంది.

గతంలో వచ్చిన కొన్ని లీక్‌ల ఆధారంగా గూగుల్ పిక్సల్‌ 8 స్మార్ట్‌ఫోన్‌ తరహా డిజైన్‌నే పిక్సల్‌ 8a హ్యాండ్‌సెట్‌ కూడా కలిగి ఉంటుంది. దీంతోపాటు ఈ కొత్త స్మార్ట్‌ఫోన్ కర్వడ్‌ ఎడ్జ్‌లను కలిగి ఉంటుందని తెలుస్తోంది. మరియు డ్యూయల్‌ కెమెరా, గూగుల్‌ కొత్త G3 చిప్‌సెట్‌పైన పనిచేస్తుందని సమాచారం. అయితే ఈ స్పెసిఫికేషన్లు, ఫీచర్లపై గూగుల్‌ ఎటువంటి ప్రకటన చేయలేదు.

** జనవరి 25న పిక్సల్‌ 8 మింట్‌ గ్రీన్‌ కలర్‌ విడుదల అయింది. 8GB ర్యామ్‌+ 128GB అంతర్గత స్టోరేజీ వేరియంట్‌ ప్రస్తుతం రూ.75,999 గా ఉంది. గూగుల్‌ పిక్సల్‌ 8 స్మా్ర్ట్‌ఫోన్‌ 6.2 అంగుళాల పుల్‌ HD+ OLED డిస్‌ప్లేను కలిగి ఉంటుంది.

డిస్‌ప్లే గొరెల్లా గ్లాస్‌ విస్టస్‌ రక్షణను పొందుతుంది. ఈ హ్యాండ్‌ సెట్‌ 2000 నిట్స్‌ గరిష్ఠ బ్రైట్‌నెస్‌తో వస్తుంది. ఈ హ్యాండ్‌సెట్ ఆండ్రాయిడ్ 14 ఆధారిత క్లీన్‌ OSపైన పనిచేస్తుంది. 7 సంవత్సరాలపాటు OS అప్‌డేట్లు ఇస్తామని గూగుల్‌ హామీ ఇచ్చింది.

గూగుల్‌ పిక్సల్‌ 8 కెమెరాలు : గూగుల్‌ పిక్సల్‌ 8 వెనుకవైపు డ్యూయల్‌ కెమెరాలను కలిగి ఉంటుంది. f/1.68 అపేచర్‌తో 50MP ప్రైమరీ కెమెరాను కలిగి ఉంటుంది. దీంతోపాటు పిక్సల్‌ 8 సోనీ IMX386 సెన్సార్‌, f/2.2 అపేచర్‌తో 12MP ఆల్ట్రావైడ్‌ యాంగిల్‌ కెమెరాను కలిగి ఉంటుంది. ముందువైపు 10.5MP కెమెరాను అమర్చారు.

ఈ స్మార్ట్‌ఫోన్‌ 27W వైరడ్‌ ఛార్జింగ్‌, 18W వైర్‌లెస్‌ ఛార్జింగ్‌ సపోర్టుతో 4,575mAh బ్యాటరీని కలిగి ఉంటుంది. మరియు ఈ హ్యాండ్‌సెట్‌ వైఫై 6, బ్లూటూత్‌ 5.3, NFC మరియు USB-C మరియు భద్రత కోసం ఇన్‌ డిస్‌ప్లే ఫింగర్‌ ప్రింట్‌ సెన్సార్‌ను కలిగి ఉంటాయి.

More from GizBot

Best Mobiles in India

English summary
Google Pixel 8a Smartphone Price leaked ahead of debut expected in may 2024
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X