గూగుల్ పిక్సల్ 8a స్మార్ట్‌ఫోన్ ధర వివరాలు లీక్.. మిడ్ రేంజ్ సెగ్మెంట్‌లో పోటీ ఇవ్వనుందా..?
గూగుల్ మే 14న i/o కాన్ఫరెన్స్ నిర్వహించనుంది. అయితే ఈ ఈవెంట్‌లో గూగుల్ పిక్సల్ 8a హ్యాండ్‌సెట్‌ను (Google Pixel 8a) విడుదల చేయనుందని తెలుస్తోంది. ఇప్పటికే ఈ హ్యాండ్‌సెట్ గురించి అనేక వివరాలు వెల్లడయ్యాయి. తాజాగా ఈ పిక్సల్ 8a ధర వివరాలు లీక్ అయ్యాయి.
కొన్ని నివేదికల ఆధారంగా పిక్సల్ 8a హ్యాండ్‌సెట్ 128GB అంతర్గత స్టోరేజీ వేరియంట్ ధర అమెరికాలో $499 గా ఉంది. భారత్‌లో కరెన్సీ ప్రకారం రూ.41,000 గా ఉండనుంది. అదే 256GB స్టోరేజీ ధర $599 గా ఉంది. భారత్ కరెన్సీ ప్రకారం రూ.50,000 గా ఉంది. మిడ్ రేంజ్ హ్యాండ్‌సెట్‌కు పోటీ ఇచ్చే అవకాశం ఉంది.

దీంతోపాటు ఈ పిక్సల్ 8a స్మార్ట్‌ఫోన్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారిత ఫీచర్లను కలిగి ఉంటుందని ప్రొమోషనల్ వీడియో ఆధారంగా తెలిసింది. బెస్ట్ టెక్ పేరుతో ఫీచర్‌ను కలిగి ఉంటుంది. దీని ద్వారా కళ్లు మూసుకొని లేదా ఇతర కారణాలతో సరిగా క్యాప్టర్ కాని ఫొటోలను మార్చుకొనేందుకు వీలుంటుంది.
దీంతోపాటు మరో రెండు కీలక ఫీచర్‌లను ఈ గూగుల్ పిక్సల్ 8a స్మార్ట్‌ఫోన్ కలిగి ఉంది. అవే సర్కిర్ టూ సెర్చ్ (Circle To Search), ఆడియో మ్యాజిక్ ఎరేజర్ ఫీచర్లు. రికార్డింగ్ చేసిన వీడియోలో ఎక్కడైన అవసరం లేని సౌండ్ ఉండే ఈ ఆడియో మ్యాజిక్ ఎరేజర్ ఫీచర్ ద్వారా తొలగించవచ్చు. ఈ ఫీచర్ ఆర్టిపిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారంగా పనిచేస్తుంది.
ఈ గూగుల్ పిక్సల్ 8a స్మా్ర్ట్‌ఫోన్ గురించి తాజాగా లీకైన ప్రొమోషనల్ వీడియో ఆధారంగా వాయిస్ కాల్ ను లైవ్ ట్రాన్సిలేషన్ సదుపాయం కూడా అందుబాటులో ఉంటుంది. అంటే ఇతర భాషల వ్యక్తులతో మాట్లాడుతున్న సమయంలో వారి మాటలను మన భాషలోకి, మన మాటలను వారి భాషలతో అనువదిస్తుంది.
ఇప్పటి వరకు వెల్లడైన వివరాలు ఆధారంగా పిక్సల్ 8a అప్‌గ్రేడ్ చేయబడిన టెన్సార్ G3 SoC చిప్‌సెట్ ను కలిగి ఉంటుందని తెలుస్తోంది. దీంతోపాటు 27W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్టుతో 4500mAh బ్యాటరీ సామర్థ్యాన్ని కలిగి ఉండే అవకాశం ఉంది. అయితే ఛార్జర్‌ను ప్రత్యేకంగా కొనుగోలు చేయాల్సి ఉంటుందని తెలుస్తోంది.
గూగుల్ పిక్సల్ 8a స్మార్ట్‌ఫోన్ 6.1 అంగుళాల పుల్ HD+ (1080*2400 పిక్సల్) OLED డిస్‌ప్లేను కలిగి ఉంటుందని సమాచారం. 1400 నిట్స్ HDR బ్రైట్‌నెస్, 120Hz రీఫ్రెష్ రేట్‌ను కలిగి ఉంటుందని తెలుస్తోంది. 7 సంవత్సరాలపాటు సెక్యూరిటీ అప్‌డేట్‌లను కలిగి ఉంటుందని తెలిసింది.
దీంతోపాటు ఈ ఫోన్ వెనుక వైపు రెండు కెమెరాలు ఉండే అవకాశం ఉంది. OIS (ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్) సపోర్టుతో 64MP ప్రైమరీ కెమెరా, 13MP అల్ట్రావైడ్ యాంగిల్ మరో కెమెరాను కలిగి ఉంటుందని తెలుస్తోంది. దీంతోపాటు 13MP సెల్ఫీ కెమెరాను కలిగి ఉంటుందని తెలుస్తోంది.
విన్ ఫ్యూచర్ నివేదిక ఆధారంగా ఈ ఫోన్ ఒబ్సిడియన్, బే, పార్సిలైన్, మింట్ రంగుల్లో అందుబాటులోకి వస్తుందని తెలుస్తోంది. రెండు వేరియంట్లు అన్ని రంగుల్లో అందుబాటులో ఉండవని తెలుస్తోంది. 256GB స్టోరేజీ వేరియంట్ ఒబ్సిడియన్ ( బ్లాక్ ) రంగుల్లో అందుబాటులో ఉంటుంది.


Click it and Unblock the Notifications








