గూగుల్ పిక్సల్ 8a స్మార్ట్‌ఫోన్ సేల్ ప్రారంభం అయింది.. ఈ కార్డులపై రూ.3000 తగ్గింపు..!!
గూగుల్ పిక్సల్ 8a స్మార్ట్ ఫోన్ (Google Pixel 8a Smartphone) మే 7వ తేదీన విడుదల అయింది. ఈ హ్యాండ్‌సెట్ మెరుగైన ఫీచర్లు, స్పెసిఫికేషన్లను కలిగి ఉంది. మరియు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) ఆధారిత ఫీచర్లను కలిగి ఉంటాయి. ఈ గూగుల్ కొత్త స్మార్ట్ ఫోన్ సేల్ ఇవాళ్టి నుంచి ప్రారంభం అయింది.
గూగుల్ పిక్సల్ 8a స్మార్ట్‌ఫోన్ స్పెసిఫికేషన్లు..
గూగుల్ పిక్సల్ 8a స్మార్ట్‌ఫోన్ 6.1 అంగుళాల OLED Actua డిస్‌ప్లేను కలిగి ఉంటుంది. మరియు 120Hz రీఫ్రెష్ రేట్, 2000 వరకు గరిష్ఠ బ్రైట్‌నెస్‌ను పొందుతుంది. డిస్‌ప్లే రక్షణకు ఈ హ్యాండ్‌సెట్ కార్నింగ్ గొరెల్లా గ్లాస్ రక్షణను పొందుతుంది.

ఈ డిస్‌ప్లే HDR సపోర్టును కలిగి ఉంటుంది. గూగుల్ ప్రకారం గూగుల్ పిక్సల్ 8a స్మార్ట్‌ఫోన్ గత మోడల్ కంటే 40 శాతం బ్రైట్ డిస్‌ప్లేను కలిగి ఉంటుందని తెలుస్తోంది. డిజైన్ పరంగా ఈ హ్యాండ్‌సెట్ ఆకట్టుకుంటుంది. దీంతోపాటు మెరుగైన స్పెసిఫికేషన్లను కలిగి ఉంది.
ఈ గూగుల్ కొత్త స్మార్ట్‌ఫోన్ Tensor G3 చిప్ సహా టైటాన్ M2 సెక్యూరిటీ కో ప్రాసెసర్ పైన పనిచేస్తుంది. ఈ ప్రాసెసర్‌లు గరిష్ఠంగా 8GB LPDDR5x ర్యామ్ తో జతచేయబడతాయి. మరియు ఆండ్రాయిడ్ 14 ఆధారిత OS ను కలిగి ఉంది. ఈ ఫోన్ 7 సంవత్సరాలపాటు పాటు ఆండ్రాయిడ్, సెక్యూరిటీ అప్‌డేట్‌లను పొందుతుందని గూగుల్ తెలిపింది.

64MP ప్రైమరీ కెమెరా :
గూగుల్ పిక్సల్ 8a స్మార్ట్‌ఫోన్ 64MP ప్రైమరీ కెమెరా, 13MP అల్ట్రా వైడ్ కెమెరాను కలిగి ఉంటుంది. సెల్ఫీ, వీడియో కాల్స్ కోసం 13MP కెమెరాను అమర్చారు. ఈ కెమెరాలు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారిత ఫీచర్లను కలిగి ఉంటాయి. గ్రూప్ ఫోటోల కోసం బెస్ట్ టేక్, మేజిక్ ఎడిటర్, ఆడియో మేజిక్ ఎరేజర్‌ను కలిగి ఉంటుంది.
ఈ గూగుల్ ఫోన్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టూల్ జెమిని.. ఇన్‌బిల్ట్‌గా వస్తుంది. మరియు సర్కిల్ టూ సెర్చ్ ఫీచర్ సహా ఆడియో ఎమోజీలను కూడా కలిగి ఉంటుంది. ఈ హ్యాండ్‌సెట్ 4492mAh బ్యాటరీని కలిగి ఉంటుంది. ఒక్కరోజుపాటు పూర్తిగా వినియోగించుకొనే అవకాశం ఉంటుందని సంస్థ చెబుతోంది. ఛార్జర్‌ను ప్రత్యేకంగా కొనుగోలు చేయాల్సిన అవసరం లేదని సంస్థ తెలిపింది.
నాలుగు రంగుల్లో లభిస్తుంది :
గూగుల్ పిక్సల్ 8a స్మార్ట్‌ఫోన్ 128GB అంతర్గత స్టోరేజీ వేరియంట్ ధర రూ.52,999 గా ఉంది. అదే 256GB స్టోరేజీ ధర రూ.59,999 గా ఉంది. ఈ హ్యాండ్‌సెట్ నాలుగు రంగుల్లో లభిస్తుంది. అలో, బే, అబ్సిడియన్, పార్సిలియన్ రంగుల్లో లభిస్తుంది. ఫ్లిప్‌కార్ట్ ద్వారా కొనుగోలు చేయవచ్చు.
రూ.3000 తగ్గింపు :
గూగుల్ పిక్సల్ 8a స్మార్ట్‌ఫోన్‌ను ఫ్లిప్‌కార్ట్‌లో (Google Pixel 8a Smartphone Sale) ICICI బ్యాంకు కార్డు ద్వారా కొనుగోలు చేస్తే రూ.3000 తగ్గింపును పొందవచ్చు. దీంతోపాటు పాత స్మార్ట్‌ఫోన్‌ను ఎక్స్చేంజీ చేయడం ద్వారా గరిష్ఠంగా రూ.9000 వరకు తగ్గింపు ప్రయోజనాలను పొందవచ్చు.


Click it and Unblock the Notifications








