Home
Mobile

Google Pixel గూగుల్‌ పిక్సల్‌ 8a స్మార్ట్‌ఫోన్‌ స్పెసిఫికేషన్‌లు, ఫీచర్లు లీక్‌.. పూర్తి వివరాలు..!

గూగుల్ డెవలపర్‌ కాన్ఫరెన్స్‌ మే నెలలో జరగనుందని తెలుస్తోంది. ఈ ఈవెంట్‌లో గూగుల్‌ పిక్సల్‌ 8a స్మార్ట్‌ఫోన్‌ (Google Pixel 8a Smartphone) విడుదల అయ్యే అవకాశం ఉంది. అయితే ఇప్పటికే ఈ హ్యాండ్‌సెట్ వివరాలు కొన్ని వెలుగులోకి వచ్చాయి. ఈ ఫోన్‌ Tensor G3 చిప్‌ సెట్‌ను కలిగి ఉంటుందని తెలుస్తోంది. దీంతోపాటు ఈ డిస్‌ప్లే మెరుగైన రీఫ్రెష్‌ రేట్‌ను కలిగి ఉంటుందని తెలుస్తోంది.

గత మోడల్‌ల కంటే మెరుగైన స్పెసిఫికేషన్లు : ఆండ్రాయిడ్ అథారిటీ నివేదిక ఆధారంగా గూగుల్‌ పిక్సల్‌ 8a స్మార్ట్‌ ఫోన్‌ గత మోడల్‌ల కంటే మెరుగైన స్పెసిఫికేషన్లు, ఫీచర్లను కలిగి ఉంటుంది. మరియు ఈ ఫోన్‌ 6.1 అంగుళాల పుల్‌ HD+ OLED డిస్‌ప్లేను కలిగి ఉంటుంది. మరియు 120Hz రీఫ్రెష్‌ రేట్‌తో రానుంది. దీంతోపాటు 1400 నిట్స్‌ గరిష్ఠ బ్రైట్‌నెస్‌తో వస్తుందని తెలుస్తోంది.

Google Pixel 8a Smartphone specifications leaked

Tensor G3 చిప్‌సెట్! : గూగుల్‌ పిక్సల్‌ 8 మరియు 8 ప్రో స్మార్ట్‌ ఫోన్ల మాదిరిగా పిక్సల్‌ 8a హ్యాండ్‌సెట్‌ Tensor G3 చిప్‌సెట్‌ను కలిగి ఉంటుంది. అయితే చిన్న మార్పులు ఉండే అవకాశం ఉంది. ఇంటిగ్రేటెడ్‌ ప్యాకేజీ టెక్నాలజీతో కూడిన చిప్‌సెట్‌ను కలిగి ఉండే అవకాశం ఉందని తెలుస్తోంది.

విన్‌ఫ్యూచర్‌ నివేదిక ఆధారంగా గూగుల్‌ పిక్సల్‌ 8a స్మార్ట్‌ ఫోన్‌ రెండు స్టోరేజీ వేరియంట్లలో అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. దీంతోపాటు నాలుగు రంగుల్లో లభించే అవకాశం ఉంది. అయితే గూగుల్‌ పిక్సల్ 7a ధర కంటే పిక్సల్‌ 8a ధర కాస్త ఎక్కువగా ఉండే అవకాశం ఉందని తెలుస్తోంది. 7a ధర సుమారుగా రూ.45,000 గా ఉంటే.. 8a ధర మాత్రం సుమారు రూ.50,000 ఉండే అవకాశం ఉంది.

నాలుగు రంగుల్లో లభిస్తుంది : విన్‌ఫ్యూచర్‌ నివేదిక ప్రకారం త్వరలో లాంచ్‌ కానున్న గూగుల్‌ పిక్సల్‌ 8a నాలుగు రంగుల్లో అందుబాటులో ఉంటుంది. ఒబ్సిడియన్‌ (బ్లాక్‌), పార్సిలియన్‌ (బీజ్‌), బే (లైట్‌ బ్లూ) మరియు మింట్‌ (లైట్‌ గ్రీన్‌) రంగుల్లో లభిస్తుంది. అయితే రెండు మెమొరి వేరియంట్లు అన్ని రంగుల్లో లభించే అవకాశం లేదని తెలుస్తోంది.

ఎప్పుడు విడుదల కానుందంటే : 256GB స్టోరేజీ వేరియంట్‌ ఒబ్సిడియన్‌ (బ్లాక్‌) రంగుల్లో అందుబాటులోకి వస్తుందని తెలుస్తోంది. అయితే గూగుల్ పిక్సల్‌ 8a స్మార్ట్‌ ఫోన్‌ ఎప్పుడు లాంచ్ కానుందనే వివరాలు వెల్లడికాలేదు. ఈ సంవత్సరం ఏప్రిల్ లేదా మే నెలల్లో ఈ హ్యాండ్‌సెట్‌ విడుదల కానున్నట్లు తెలుస్తోంది.

గిజ్‌బాట్‌ తెలుగు వెబ్‌సైట్ గ్యాడ్జెట్లు సహా ఇతర టెక్‌ న్యూస్‌కు సంబంధించిన ఆసక్తికరమైన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా వార్తల కోసం సోషల్‌ మీడియా ఖాతాలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు.

More from GizBot

Best Mobiles in India

English summary
Google Pixel 8a Smartphone specifications and features leaked ahead of launch
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X