Home
Mobile

గూగుల్‌ నుంచి కొత్త స్మార్ట్‌ఫోన్‌.. కీలక వివరాలు లీక్‌.. డెవలపర్‌ కాన్ఫరెన్స్‌లో విడుదల కానుందా..?

గూగుల్‌ నుంచి త్వరలో కొత్త స్మార్ట్‌ ఫోన్‌ విడుదల కానుంది. ఈ సంవత్సరం మే నెలలో నిర్వహించనున్న i/O డెవలపర్‌ కాన్ఫరెన్స్‌లో గూగుల్‌ పిక్సల్‌ 8a హ్యాండ్‌సెట్‌ (Google Pixel 8a Smartphone) లాంచ్‌ అయ్యే అవకాశం ఉంది. అయితే ఈ ఫోన్ విడుదలపై టెక్‌ దిగ్గజం గూగుల్‌ ఎటువంటి ప్రకటన చేయలేదు.

ఈ గూగుల్‌ పిక్సల్‌ 8a స్మార్ట్‌ఫోన్‌ గత సంవత్సరం విడుదలైన పిక్సల్‌ 7aకు తర్వాత తరం ఫోన్‌గా విడుదల కానుందని తెలుస్తోంది. అప్‌గ్రేడ్‌ చేయబడిన టెన్సార్‌ G3 SoC చిప్‌సెట్‌ ను కలిగి ఉంటుందని తెలుస్తోంది. ఈ ఫోన్‌ గత నెల US ఫెడరల్‌ కమ్యూనికేషన్‌ కమిషన్‌ (FCC) వెబ్‌సైట్‌లో కనిపించింది. తాజాగా ఈ హ్యాండ్‌సెట్‌ బ్లూటూత్‌ special interest Group (SIG) వెబ్‌సైట్‌లో కనిపించింది.

Google pixel 8a smartphone listed on bluetooth SIG website

ఈ వెబ్‌సైట్‌ ఆధారంగా గూగుల్‌ పిక్సల్‌ 8a స్మార్ట్‌ఫోన్ వేర్వేరు మోడల్ నంబర్‌లతో కనిపించింది. G8HNN, GKV4X, G6GPR and G576D మోడల్ నంబర్లలో కనిపించింది. అదే FCC ఆధారంగా ఈ నంబర్లు గూగుల్‌ కొత్త ఫోన్‌కు సంబంధించినవి అని తెలిసింది. దీని ఆధారంగా ఈ ఫోన్‌ త్వరలోనే విడుదల కానుందని తెలుస్తోంది.

ఈ వెబ్‌ సైట్‌లోని వివరాల ఆధారంగా ఈ గూగుల్‌ పిక్సల్‌ 8a స్మార్ట్‌ ఫోన్‌ 5.4 బ్లూటూత్‌ కనెక్టివిటిని కలిగి ఉంటుందని తెలుస్తోంది. మరియు 120Hz రీఫ్రెష్‌ రేట్‌తో లాంచ్‌ కానుందని సమాచారం. ఈ వివరాలపై గూగుల్ ఎటువంటి ప్రకటన చేయలేదు.

గతంలో వెల్లడైన వివరాల ప్రకారం గూగుల్‌ 8a స్మార్ట్‌ ఫోన్‌ 6.1 అంగుళాల పుల్‌ HD+ (1080*2400 పిక్సల్‌) OLED డిస్‌ప్లేను కలిగి ఉంటుందని తెలుస్తోంది. మరియు 1400 నిట్స్‌ HDR బ్రైట్‌నెస్‌, 120Hz రీఫ్రెష్‌ రేట్‌ను కలిగి ఉంటుందని తెలుస్తోంది.

దీంతోపాటు ఈ పిక్సల్‌ 8a హ్యాండ్‌సెట్‌ టెన్సార్‌ G3 చిప్‌సెట్‌ పైన పనిచేస్తుందని తెలుస్తోంది. దీంతోపాటు ఈ ఫోన్ వెనుక వైపు రెండు కెమెరాలు ఉండే అవకాశం ఉంది. OIS (ఆప్టికల్‌ ఇమేజ్‌ స్టెబిలైజేషన్‌) సపోర్టుతో 64MP ప్రైమరీ కెమెరా 13MP అల్ట్రావైడ్‌ యాంగిల్‌ మరో కెమెరాను కలిగి ఉంటుందని తెలుస్తోంది. దీంతోపాటు 13MP సెల్ఫీ కెమెరాను కలిగి ఉంటుందని తెలుస్తోంది.

దీంతోపాటు గతంలో వచ్చిన కొన్ని నివేదికల ఆధారంగా గూగుల్‌ పిక్సల్‌ 8a స్మార్ట్‌ఫోన్‌ రెండు స్టోరేజీ వేరియంట్లలో అందుబాటులో ఉండే అవకాశం ఉంది. ధర విషయానికి వస్తే గూగుల్‌ పిక్సల్‌ 7a హ్యాండ్‌సెట్‌ రూ.45,000 కంటే తక్కువకే అందుబాటులోకి రాగా.. 8a ధర మాత్రం అధిక ధరను కలిగి ఉండే అవకాశం ఉందని తెలుస్తోంది.

గూగుల్‌ పిక్సల్‌ 8a స్మార్ట్‌ఫోన్‌ 128GB లేదా 256GB స్టోరేజీ వేరియంట్లలో అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. విన్‌ఫ్యూచర్‌ నివేదిక ఆధారంగా ఈ ఫోన్‌ ఒబ్సిడియన్‌, బే, పార్సిలైన్‌, మింట్‌ రంగుల్లో అందుబాటులోకి వస్తుందని తెలుస్తోంది. రెండు వేరియంట్లు అన్ని రంగుల్లో అందుబాటులో ఉండవని తెలుస్తోంది. 256GB స్టోరేజీ వేరియంట్‌ ఒబ్సిడియన్‌ (బ్లాక్‌) రంగుల్లో అందుబాటులో ఉంటుంది.

More from GizBot

Best Mobiles in India

English summary
Google pixel 8a smartphone spotted on bluetooth SIG website
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X