గూగుల్ పిక్సల్ 9 ఫోల్డ్ స్మార్ట్‌ఫోన్ సేల్ ప్రారంభం.. ఈ బ్యాంకు కార్డుపై రూ.10,000 తగ్గింపు..!!
ప్రముఖ టెక్ దిగ్గజం గూగుల్ గత నెలలో పిక్సల్ 9 సిరీస్‌ను లాంచ్ చేసింది. ఈ సిరీస్‌లో భాగంగా పిక్సల్ 9, పిక్సల్ 9 ప్రో, పిక్సల్ 9 ప్రో XL, పిక్సల్ 9 ప్రో ఫోల్డ్ స్మార్ట్‌ఫోన్‌లు ఉన్నాయి. ఇప్పటికే మిగిలిన ఫోన్‌ల సేల్ ప్రారంభం కాగా.. ఇవాళ ఫోల్డ్ స్మార్ట్‌ఫోన్ సేల్ ప్రారంభం (Google Pixel 9 Fold Smartphone Sale) అయింది. తొలిసారిగా గూగుల్ ఫోల్డ్ హ్యాండ్‌సెట్ భారత్‌లో అందుబాటులోకి వచ్చింది. ఫ్లిప్‌కార్ట్ ద్వారా సేల్ జరుగుతోంది.
గూగుల్ పిక్సల్ 9 ప్రో ఫోల్డ్ స్మార్ట్‌ఫోన్ స్పెసిఫికేషన్‌లు :
గూగుల్ పిక్సల్ 9 ప్రో ఫోల్డ్ స్మార్ట్‌ఫోన్ 8 అంగుళాల 2K OLED ఇన్నర్ డిస్‌ప్లేను కలిగి ఉంది. 2700 నిట్స్ గరిష్ఠ బ్రైట్‌నెస్ మరియు 120Hz అడాప్టివ్ రీఫ్రెష్ రేట్‌తో అందుబాటులో ఉంది. ఈ ఫోల్డబుల్ హ్యాండ్‌సెట్ 60Hz -120Hz రీఫ్రెష్ రేట్‌తో 6.3 అంగుళాల FHD+ OLED కవర్ డిస్‌ప్లేను కలిగి ఉంటుంది. 2700 నిట్స్ బ్రైట్‌నెస్‌తో విడుదల అయింది.

పిక్సల్ 9 ప్రో ఫోల్డ్ స్మార్ట్‌ఫోన్ టెన్సార్ G4 చిప్‌సెట్ పైన పనిచేస్తుంది. 16GB ర్యామ్ మరియు 256GB అంతర్గత స్టోరేజీతో జతచేయబడుతుంది. టైటాన్ M2 సెక్యురిటీ చిప్‌సెట్‌ను కూడా కలిగి ఉంటుంది. ఆండ్రాయిడ్ 14 ఆధారిత (Out of the box) OS ను కలిగి ఉంది. 7 OS అప్‌డేట్‌లు, 7 సంవత్సరాలపాటు సెక్యూరిటీ అప్‌డేట్‌లను పొందనుంది.
కెమెరా విభాగం పరంగా OIS (ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్) 48MP ప్రైమరీ కెమెరా, 10.5MP అల్ట్రావైడ్ కెమెరా మరియు OIS, 5X ఆప్టికల్ జూమ్‌తో 10.8MP టెలిఫోటో పెరిస్కోప్ కెమెరాను కలిగి ఉంటుంది. ఈ హ్యాండ్‌సెట్ రెండు సెల్ఫీ కెమెరాలను కలిగి ఉంటుంది. ప్రధాన, కవర్ డిస్‌ప్లేపైన 10MP కెమెరాను కలిగి ఉంది.
దీంతోపాటు ఈ హ్యాండ్‌సెట్ అనేక కెమెరా, ఎడిటింగ్ ఫీచర్‌లతో అందుబాటులో ఉంది. యాడ్ మి, హ్యాండ్స్ ఫ్రీ ఆస్ట్రో ఫోటోగ్రఫీ, టాప్ షాట్, ఫ్రీక్వెంట్ ఫేసెస్, ఫేస్ అన్‌బ్లర్, వీడియో బూస్ట్, విండ్ నాయిస్ రిడక్షన్, మైక్రో ఫోకస్ వీడియో, ఆడియో మేజిక్ ఎరేజర్, మేడ్ యూ లుక్, మేజిక్ ఎరేజర్ వంటి ఫీచరున్నాయి.
ఈ పిక్సల్ ఫోల్డబుల్ ఫోన్ 45W వైర్ మరియు Qi వైర్‌లెస్ ఛార్జింగ్ సపోర్టుతో 4650mAh బ్యాటరీతో పనిచేస్తుంది. ఈ ఫోన్ జెమిని AI యాక్సెస్‌ను కలిగి ఉంటుంది. దీంతోపాటు సర్కిల్ టూ సెర్చ్, పిక్సల్ స్క్రీన్ షాట్స్ వంటి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఫీచర్లను కలిగి ఉంటుంది. ఈ హ్యాండ్‌సెట్ IP68 రేటింగ్‌తో వాటర్ రెసిస్టెంట్‌గా అందుబాటులోకి వచ్చింది.
గూగుల్ పిక్సల్ 9 ప్రో ఫోల్డ్ స్మార్ట్‌ఫోన్ 16GB ర్యామ్ + 256GB స్టోరేజీ తో అందుబాటులో ఉంది. ఈ హ్యాండ్‌సెట్ ధర రూ.1,72,999 గా ఉంది. ఐసీఐసీఐ బ్యాంకు క్రెడిట్ కార్డు ద్వారా రూ.10,000 తగ్గింపును పొందవచ్చు. ఎంపిక చేసిన హ్యాండ్‌సెట్‌లను ఎక్స్చేంజీ చేయడం ద్వారా రూ.13500 వరకు అదనపు తగ్గింపును పొందవచ్చు.


Click it and Unblock the Notifications








