Home
Mobile

మొబైల్ లవర్స్‌కి గోల్డెన్ ఛాన్స్.. గూగుల్ పిక్సెల్ 9పై భారీ డిస్కౌంట్.. కొనాల్సిందేనా?

By Ram Kumar

కొత్త స్మార్ట్‌ఫోన్ కొనాలనుకునేవారికి రిపబ్లిక్ డే సేల్ అదిరిపోయే డీల్స్‌ తీసుకొచ్చింది. ఫ్లిప్‌కార్ట్‌లో ప్రీమియం ఫోన్లపై భారీ డిస్కౌంట్లు ఉన్నాయి. అందులో గూగుల్ పిక్సెల్ 9 కూడా ఉంది. ఈ ఫోన్ ఇప్పుడు భారీ తగ్గింపుతో లభిస్తోంది.

అసలు ధర ఎంత? తగ్గింపు ఎంత? దీన్ని ఇప్పుడు కొనుగోలు చేయొచ్చా లేదో తెలుసుకుందాం పదండి.

Google Pixel 9 Gets Massive Rs 12 000 Price Cut  Weighing the Pros and Cons - Should You Buy

* గూగుల్ పిక్సెల్ 9 పై బంపరాఫర్

గూగుల్ పిక్సెల్ 9 ఫోన్ 12GB RAM, 256GB స్టోరేజ్ వేరియంట్ అసలు ధర రూ.79,999. కానీ ఇప్పుడు దీని ధర రూ.74,999కి తగ్గింది. అంతే కాదు, ఫ్లిప్‌కార్ట్ మరో రూ.3,000 ఎక్స్‌ట్రా డిస్కౌంట్ ఇస్తోంది. అంటే ఈ ఫోన్‌ను కేవలం రూ.71,999కే సొంతం చేసుకోవచ్చు.

మీ దగ్గర HDFC బ్యాంక్ క్రెడిట్ కార్డ్ ఉంటే, మరో రూ.4,000 తగ్గింపు లభిస్తుంది. దీంతో ఈ ఫోన్ ధర ఏకంగా రూ.67,999కి చేరుకుంటుంది. అంటే ఈ ఫ్లాగ్‌షిప్ ఫోన్‌పై మొత్తం రూ.12,000 డిస్కౌంట్ లభిస్తుంది.

* పాత ఫోన్‌తో మరింత తగ్గింపు

ఓల్డ్ ఫోన్‌ను ఎక్స్ఛేంజ్ చేయడం ద్వారా మీరు మరింత డబ్బు ఆదా చేసుకోవచ్చు. పాత ఫోన్ మోడల్, దాని పరిస్థితిని బట్టి ఫ్లిప్‌కార్ట్ గరిష్టంగా రూ.63,600 వరకు ఎక్స్ఛేంజ్ ఆఫర్ ఇస్తోంది. అయితే, 2-3 ఏళ్ల నాటి ప్రీమియం ఫోన్‌కు సుమారు రూ.15,000 నుంచి రూ.20,000 వరకు ఎక్స్ఛేంజ్ వాల్యూ లభించే అవకాశముంది.

* పిక్సెల్ 9 కొనడానికి 4 కారణాలు

- కెమెరా విషయంలో తిరుగులేదు

పిక్సెల్ 9 ఫోన్‌లో 50MP మెయిన్ కెమెరా, 48MP అల్ట్రా-వైడ్ లెన్స్ ఉన్నాయి. తక్కువ వెలుతురులో కూడా అద్భుతమైన, స్పష్టమైన ఫోటోలను ఇది తీస్తుంది. మెరుగైన HDR ఫీచర్ దీనికి మరింత సహాయపడుతుంది. అంతేకాదు, మ్యాజిక్ ఎడిటర్, పిక్సెల్ స్టూడియో వంటి AI టూల్స్ ఫోటోలను ఎడిట్ చేయడం చాలా సులువు చేస్తాయి. ఫోటోగ్రఫీ అంటే ఇష్టపడేవారికి ఇది బెస్ట్ ఛాయిస్ అనడంలో సందేహం లేదు.

- ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఫీచర్లు

ఈ ఫోన్ Tensor G4 చిప్‌సెట్‌తో పనిచేస్తుంది. దీనివల్ల జెమిని లైవ్, కాల్ నోట్స్, మ్యాజిక్ ఎడిటర్ వంటి అడ్వాన్స్‌డ్‌ AI ఫీచర్లు ఇందులో ఉన్నాయి. గూగుల్ ఏకంగా ఏడేళ్లు ఆండ్రాయిడ్ అప్‌డేట్స్‌ను ఇస్తామని హామీ ఇచ్చింది. అంటే రాబోయే సంవత్సరాల్లో ఈ ఫోన్ AI ఫీచర్లు మరింత మెరుగుపడతాయని అర్థం.

- చూడచక్కని డిజైన్, సూపర్ డిస్‌ప్లే

పిక్సెల్ 9 స్ట్రాంగ్ అల్యూమినియం ఫ్రేమ్‌తో, మ్యాట్ ఫినిష్‌తో వస్తుంది. దీనికి గొరిల్లా గ్లాస్ విక్టస్ 2 ప్రొటెక్షన్ కూడా ఉంది. 6.3-అంగుళాల యాక్చువా డిస్‌ప్లే మంచి రంగులను, సూర్యకాంతిలో కూడా స్పష్టంగా కనిపించేలా చేస్తుంది. ఫోన్ చూడటానికి చాలా ప్రీమియంగా ఉంటుంది.

- బ్యాటరీ

పిక్సెల్ 9 బ్యాటరీ ఒక్కసారి ఛార్జ్ చేస్తే 17 గంటల కంటే ఎక్కువసేపు వస్తుంది. సాధారణంగా వాడితే ఒకటిన్నర నుంచి రెండు రోజుల వరకు ఛార్జింగ్ నిలుస్తుంది. కాబట్టి ఛార్జింగ్ గురించి పెద్దగా ఆలోచించాల్సిన అవసరం లేదు.

* ఒక్క మైనస్..

టెన్సర్ G4 ప్రాసెసర్ డైలీ టాస్క్స్‌ బాగానే హ్యాండిల్ చేస్తుంది కానీ ఇది స్నాప్‌డ్రాగన్ 8 Gen 4 వంటి కొత్త ప్రాసెసర్లతో పోలిస్తే కొంచెం వెనుకబడి ఉంది. అంతేకాదు, దీని ఛార్జింగ్ వేగం 34W మాత్రమే. ఇది వన్‌ప్లస్ 13 వంటి పోటీదారుల ఫోన్లతో పోలిస్తే కాస్త స్లో అని చెప్పొచ్చు.

ముఖ్యంగా, ఈ ఫోన్‌తో ఛార్జర్ ఇవ్వడం లేదు. విడిగా కొనుక్కోవాల్సి ఉంటుంది.

* కొనాలా, వద్దా?

రూ.12,000 తగ్గింపుతో, పిక్సెల్ 9 నిజంగా ఒక మంచి డీల్. ఇది టాప్-టైర్ కెమెరాలు, అడ్వాన్స్‌డ్‌ AI ఫీచర్లు, లాంగ్ బ్యాటరీ లైఫ్‌ను అందిస్తుంది. అయితే, లేటెస్ట్ ప్రాసెసర్ లేదా ఫాస్ట్ ఛార్జింగ్ కావాలనుకుంటే, ఇతర ఆప్షన్లను కూడా పరిశీలించవచ్చు. కానీ, ఈ ధరలో మాత్రం పిక్సెల్ 9 ఒక అద్భుతమైన ఫోన్ అనడంలో సందేహం లేదు.

More from GizBot

Best Mobiles in India

English summary
Google Pixel 9 gets a ₹12,000 discount on Flipkart (₹67,999 with HDFC). Excellent camera, AI, design, and battery. Slightly older chip and slower charging. A strong deal for camera and AI enthusiasts.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X