గూగుల్ పిక్సల్ 9 ప్రో ఫోల్డ్ స్మార్ట్‌ఫోన్ విడుదల.. స్పెసిఫికేషన్‌లు, ఫీచర్‌లు, సేల్ వివరాలు..!
మేడ్ బై గూగుల్ ఈవెంట్‌లో (Made by Google) పిక్సల్ 9 సిరీస్ స్మార్ట్‌ఫోన్‌లను (Google pixel 9 Pro Fold Smartphone Launched) విడుదల చేసింది. ఈ సిరీస్‌లో భాగంగా తొలిసారిగా భారత్ మార్కెట్‌లో గూగుల్ తన ఫోల్డబుల్ స్మార్ట్‌ఫోన్ గూగుల్ పిక్సల్ 9 ప్రో ఫోల్డ్ ను లాంచ్ చేసింది. గూగుల్ తన తొలి పోల్డబుల్ ఫోన్ ఫోల్డ్‌ను విడుదల చేసినా భారత్ మార్కెట్‌లో అందుబాటులోకి తీసుకురాలేదు. ఈ ఫోల్డ్ ఫోన్‌తోపాటు పిక్సల్ 9, పిక్సల్ 9 ప్రో, పిక్సల్ 9 ప్రో XL ను లాంచ్ చేసింది.
గూగుల్ పిక్సల్ 9 ప్రో ఫోల్డ్ స్మార్ట్‌ఫోన్ స్పెసిఫికేషన్‌లు :
ఈ హ్యాండ్‌సెట్ 120Hz రీఫ్రెష్ రేట్‌తో 8 అంగుళాల LTPO OLED సూపర్ Actual Flex ఇన్నర్ డిస్‌ప్లేను కలిగి ఉంది. ఈ డిస్‌ప్లే 2076*2152 పిక్సల్ రిజల్యూషన్, 2700 నిట్స్ గరిష్ఠ బ్రైట్‌నెస్‌తో వస్తుంది.

మరియు 120Hz రీఫ్రెష్ రేట్ తో 6.3 అంగుళాల OLED డిస్‌ప్లే ను ఔటర్ డిస్‌ప్లేను కలిగి ఉంది. 1080*2424 పిక్సల్ రిజల్యూషన్, 2700 నిట్స్ గరిష్ఠ బ్రైట్‌నెస్‌ను కలిగి ఉంది. గొరెల్లా గ్లాస్ విక్టస్ 2 రక్షణతో అందుబాటులో ఉంది.
ఈ ఫోన్ ఔటర్ వైపు.. f/1.7 అపేచర్‌తో 48MP వైడ్ యాంగిల్ కెమెరా, ఆటోఫోకస్, f/2.2 అపేచర్‌తో 10.5MP అల్ట్రావైడ్ యాంగిల్ కెమెరా, 5x జూమింగ్, 20x సూపర్ Res జూమ్, f/3.1 అపేచర్‌తో 10.8MP కెమెరాలను కలిగి ఉంది. ఈ కెమెరాలు OIS (ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్), EIS (ఎలక్ట్రానిక్ ఇమేజ్ స్టెబిలైజేషన్) సపోర్టును కలిగి ఉంది.

గూగుల్ పిక్సల్ 9 ప్రో ఫోల్డ్ స్మార్ట్‌ఫోన్ టెన్సార్ G4, టైటాన్ M2 సెక్యూరిటీ చిప్‌సెట్ పైన పనిచేస్తుంది. గరిష్ఠంగా 16GB ర్యామ్, 256GB స్టోరేజీతో జతచేయబడింది. ఆండ్రాయిడ్ 14 ఆధారిత OS పైన పనిచేస్తుంది. ఈ హ్యాండ్‌సెట్ గరిష్ఠంగా 7 సంవత్సరాలపాటు OS, సెక్యూరిటీ, పిక్సల్ డ్రాప్ అప్‌డేట్‌లు పొందనుందని గూగుల్ తెలిపింది.
కవర్ డిస్‌ప్లే పైన f/2.2 అపేచర్‌తో 10MP కెమెరా, ఇన్నర్ డిస్‌ప్లే పైన f/2.2 అపేచర్‌తో 10MP కెమెరాను కలిగి ఉంది. దీంతోపాటు ఈ హ్యాండ్‌సెట్ అనేక కెమెరా, ఎడిటింగ్ ఫీచర్‌లను కలిగి ఉంది. యాడ్ మి, హ్యాండ్స్ ఫ్రీ ఆస్ట్రోఫోటోగ్రఫీ, ఫేస్ అన్‌బ్లర్, టాప్ షాట్, ఫ్రీక్వెంట్ ఫేసెస్, వీడియో బూస్ట్, విండ్ నాయిస్ రిడక్షన్, మైక్రో ఫోకస్ వీడియో, ఆడియో మేజిక్ ఎరేజర్, మేడ్ యూ లుక్, మేజిక్ ఎరేజర్ వంటి ఫీచరున్నాయి.
ఈ గూగుల్ పిక్సల్ 9 ప్రో ఫోల్డ్ 4650mAh బ్యాటరీతో పనిచేస్తుంది. మరియు 45W PPS ఛార్జర్, Qi వైర్‌లెస్ ఛార్జింగ్‌ను సపోర్టు చేస్తుంది. భద్రత కోసం ఫేస్, ఫింగర్ ప్రింట్ సెన్సార్ మరియు IPX8 వాటర్ రిసిస్టెంట్ గా రానుంది.
కనెక్టివిటీ పరంగా ఈ హ్యాండ్‌సెట్ 5G, 4G LTE, వైఫై 7, బ్లూటూత్ 5.3, NFC, అల్ట్రా వైడ్‌బ్యాండ్, USB-3.2 ఛార్జింగ్ పోర్టు వంటి ఫీచర్లున్నాయి. యాక్సెలిరోమీటర్, యాంబియంట్ లైట్ సెన్సార్, గైరోస్కోప్, e-కంపాస్, బారోమీటర్ మరియు ప్రాక్సిమిటీ సెన్సార్‌లను కలిగి ఉంది.
గూగుల్ పిక్సల్ 9 ప్రో ఫోల్డ్ స్మార్ట్‌ఫోన్ ధర :
భారత్ మార్కెట్‌లో గూగుల్ కొత్త ఫోల్డబుల్ స్మార్ట్‌ఫోన్ 16GB ర్యామ్ + 256GB స్టోరేజీ వేరియంట్లో మాత్రమే అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ హ్యాండ్‌సెట్ ధర రూ.1,72,999 గా ఉంది. ఈ స్మార్ట్‌ఫోన్ ఒబ్సిడియాన్, పోర్సెలేన్ రంగుల్లో లభిస్తుంది.
గూగుల్ పిక్సల్ 9 ప్రో ఫోల్డ్ స్మార్ట్‌ఫోన్ సేల్ వివరాలు :
ఈ గూగుల్ పిక్సల్ 9 ప్రో ఫోల్డ్ స్మార్ట్‌ఫోన్ సేల్ భారత్‌లో ఆగస్టు 22 నుంచి ప్రారంభం కానుంది. ఈ ఫోల్డబుల్ హ్యాండ్‌సెట్‌ను ప్రముఖ ఈ-కామర్స్ సంస్థ ఫ్లిప్‌కార్ట్, క్రోమా, రిలయన్స్ డిజిటల్ రిటైల్ అవుట్‌లెట్‌లో కొనుగోలు చేయవచ్చు. డిల్లీ, బెంగళూరులోని గూగుల్ వాక్‌ఇన్ సెంటర్‌లోనూ కొనుగోలు చేయవచ్చు. మరో సెంటర్‌ను భవిష్యత్‌లో ముంబయిలోనూ ఏర్పాటుచేయనున్నారు.


Click it and Unblock the Notifications








