Home
Mobile

గూగుల్‌ పిక్సల్‌ 9 సిరీస్‌ స్మార్ట్‌ఫోన్‌ల విడుదల తేదీ ఖరారు.. స్పెసిఫికేషన్‌లు, ఫీచర్‌ల వివరాలు..!

గూగుల్‌ పిక్సల్‌ 9 సిరీస్‌ (Google pixel 9 Series Launch Date) విడుదల తేదీ వెల్లడైంది. ఈ సిరీస్‌లో భాగంగా పిక్సల్‌ 9, పిక్సల్‌ 9 ప్రో, పిక్సల్‌ 9 ప్రో ఫోల్డ్‌, పిక్సల్‌ 9 ప్రో XL హ్యాండ్‌సెట్‌లు లాంచ్‌ కానున్నాయి. భారత్‌ మార్కెట్‌లో ఆగస్టు 14 న విడుదల కానున్నాయి. ఆగస్టు 13న మేడ్‌ బై గూగుల్ ఈవెంట్ జరగనుంది. భారత్‌లో తొలిసారిగా గూగుల్‌ తన ఫోల్డబుల్‌ మోడల్‌ను లాంచ్‌ చేస్తోంది. విడుదల అనంతరం ఈ పిక్సల్‌ 9 సిరీస్‌ స్మార్ట్‌ఫోన్‌లు ప్రముఖ ఈ-కామర్స్‌ ప్లాట్‌ఫాం ఫ్లిప్‌కార్ట్‌ ద్వారా కొనుగోలు చేసేందుకు అందుబాటులో ఉండనుంది.

మేడ్‌ బై గూగుల్‌ ఈవెంట్‌ను గూగుల్ ఆగస్టు 13న నిర్వహిస్తోంది. అయితే భారత్‌ మార్కెట్‌లో ఈ హ్యాండ్‌సెట్‌ల ధరలు సహా పూర్తి వివరాలు మాత్రం ఆగస్టు 14న వెల్లడి కానున్నాయి. గూగుల్‌ ఇండియా వెబ్‌సైట్‌లో గూగుల్‌ పిక్సల్‌ 9 ప్రో మరియు పిక్సల్‌ 9 ప్రో ఫోల్డ్‌ స్మార్ట్‌ఫోన్‌ల వివరాలు అందుబాటులో ఉన్నాయి.

Google pixel 9 Series Smartphone

తొలిసారిగా భారత్‌లో గూగుల్ తన ఫోల్డబుల్‌ హ్యాండ్‌సెట్‌ పిక్సల్‌ 9 ప్రో ఫోల్డ్‌ ను విడుదల చేయనుంది. ఇప్పటికే కొన్ని దేశాల్లో గూగుల్‌ తొలి ఫోల్డబుల్‌ ఫోన్‌ పిక్సల్‌ ఫోల్డ్‌ అందుబాటులో ఉంది. అయితే త్వరలో అందుబాటులోకి రానున్న పిక్సల్‌ 9 ప్రో ఫోల్డ్‌ ఫోన్‌.. గెలాక్సీ Z ఫోల్డ్‌ 6, వన్‌ప్లస్‌ ఓపెన్‌ మరియు టెక్నో ఫాంటమ్‌ V ఫోల్డ్‌లకు పోటీనివ్వనుందని భావిస్తున్నారు.

గూగుల్‌ పిక్సల్‌ 9 సిరీస్‌ స్మార్ట్‌ఫోన్‌లు ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ చాట్‌బాట్‌ జెమిని AI ఫీచర్‌లను కలిగి ఉంటుందని తెలుస్తోంది. దీంతోపాటు 7 సంవత్సరాలపాటు సెక్యూరిటీ అప్‌డేట్‌లు పొందవచ్చని తెలుస్తోంది. దీంతోపాటు పిక్సల్ డ్రాప్స్‌ ద్వారా ఎక్లూజివ్‌ ఫీచర్‌లను వినియోగించుకోవచ్చు. మైక్రోసాఫ్ట్‌ రీకాల్‌ ఫీచర్‌ తరహాలో పిక్సల్‌ స్క్రీన్‌షాట్‌ పేరుతో ఫీచర్‌ అందుబాటులో ఉండనుందని సమాచారం.

Google pixel 9 Series Smartphone

ఎమర్జెన్సీ సమయాల్లో వినియోగదారులకు సాయం చేసేలా ఈ పిక్సల్‌ 9 సిరీస్‌ SOS ఫీచర్‌ను కలిగి ఉంటుంది. అగ్నిప్రమాదాలు, వరదలు సహా ఇతర విపత్కర పరిస్థితుల్లో అప్రమత్తత సందేశాలను పంపుతుందని తెలుస్తోంది. దీంతోపాటు మాల్‌వేర్‌ సహా ఇతర స్కామ్‌లపై అప్రమత్తం చేస్తుందని సమాచారం.

లీక్ అయిన సమాచారం ఆధారంగా పిక్సల్‌ 9 ప్రో స్మార్ట్‌ఫోన్ 6.3 అంగుళాల డిస్‌ప్లేను కలిగి ఉంటుంది. అదే ఫోల్డబుల్‌ ఫోన్‌ 6.3 అంగుళాల కవర్ డిస్‌ప్లే, 8 అంగుళాల ప్రధాన డిస్‌ప్లేను కలిగి ఉంటుంది. ఈ రెండు స్మార్ట్‌ఫోన్‌లు Tensor G4 చిప్‌సెట్‌ పైన పనిచేస్తుంది. పిక్సల్‌ 9 ప్రో 50MP+ 48MP+ 48MP కెమెరాలు మరియు 48MP సెల్ఫీ కెమెరాను కలిగి ఉంటుందని తెలుస్తోంది.

అదే పిక్సల్‌ 9 ప్రో ఫోల్డ్‌ స్మార్ట్‌ఫోన్‌ ట్రిపుల్‌ కెమెరాలను కలిగి ఉంటుందని తెలుస్తోంది. 48MP ప్రధాన కెమెరా సహా 10.5MP + 10.5MP మరో రెండు కెమెరాలను కలిగి ఉంటుందని తెలుస్తోంది. దీంతోపాటు సెల్ఫీ, వీడియో కాల్స్‌ కోసం ఈ స్మార్ట్‌ఫోన్‌ 10MP సెల్ఫీ కెమెరాను కలిగి ఉంటుందని తెలుస్తోంది. దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.

More from GizBot

Best Mobiles in India

English summary
Google pixel 9 Series Smartphone launch date confirmed in india specifications and features details
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X