Home
Mobile

గూగుల్‌ పిక్సల్ 9 సిరీస్‌ స్మార్ట్‌ఫోన్‌ల కీలక వివరాలు లీక్‌.. Tensor చిప్‌సెట్‌, AI ఫీచర్‌లు సహా..!

ప్రముఖ టెక్‌ దిగ్గజం గూగుల్ వచ్చే నెలలో గూగుల్‌ పిక్సల్‌ 9 సిరీస్‌ స్మార్ట్‌ఫోన్లను ఆవిష్కరించే అవకాశం ఉంది. అయితే ఇప్పటికే ఈ హ్యాండ్‌సెట్ గురించి అనేక వివరాలు లీక్ అయ్యాయి. తాజాగా ఆండ్రాయిడ్ ఆధారిటీ నివేదిక ఆధారంగా కీలక వివరాలు లీక్‌ అయ్యాయి. పిక్సల్‌ 9 సిరీస్‌ (Google Pixel 9 Series) కోసం గూగుల్‌ అల్ట్రాసోనిక్‌ ఫింగర్‌ ప్రింట్‌ సెన్సార్‌ను వినియోగించే అవకాశం ఉందని తెలుస్తోంది. దీని కారణంగా గత పిక్సల్‌ మోడళ్లలో ఉన్న అనేక సమస్యలకు పరిష్కారం లభించే అవకాశం ఉంది.

పిక్సల్‌ 9 సిరీస్‌లో క్వాల్‌కాం 3D సోనిక్‌ జెన్ 2 ను వినియోగించే అవకాశం ఉందని నివేదిక ఆధారంగా తెలుస్తోంది. ఇప్పటి వరకు స్లో ఆప్టికల్‌ ఫింగర్‌ ప్రింట్‌ రీడర్‌ను వినియోగిస్తోంది. పిక్సల్ ఫోల్డ్‌ మినహా త్వరలో రానున్న అన్ని ఫోన్లలో అల్ట్రాసోనిక్‌ ఫింగర్‌ ప్రింట్‌ సెన్సార్‌ను వినియోగించే అవకాశం ఉందని తెలుస్తోంది. ఫోల్డ్‌ డివైజ్‌ సైడ్ మౌంటెడ్ ఫింగర్‌ ప్రింట్‌ స్కానర్‌ను కలిగి ఉంటుందని సమాచారం.

Google Pixel 9 series Smartphones

టెన్సార్‌ చిప్‌సెట్‌ తో..
గూగుల్‌ పిక్సల్‌ 9, పిక్సల్‌ 9 ప్రో, పిక్సల్‌ 9 ప్రో XL, పిక్సల్‌ 9 ఫోల్డ్ స్మార్ట్‌ ఫోన్‌ లు ఆగస్టు 13 న లాంచ్‌ కానున్నాయి. ఈ గూగుల్‌ ఈవెంట్‌ లో గూగుల్‌ AI, ఆండ్రాయిడ్‌ సాఫ్ట్‌ వేర్‌ అప్‌డేట్‌ లు కూడా ఆవిష్కరించే అవకాశం ఉంది. ఈ స్మార్ట్‌ఫోన్‌లు Tensor G4 చిప్‌సెట్‌ పైన పనిచేయనుందని తెలుస్తోంది.

అనేక ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ ఫీచర్‌లతో విడుదల! :
ఈ హ్యాండ్‌సెట్‌లు గూగుల్‌ AI ఫీచర్‌లతో ఆండ్రాయిడ్ 15 పైన పనిచేసే అవకాశం ఉంది. గూగుల్‌ ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్ చాట్‌బాట్‌ జెమిని, సర్కిల్‌ టూ సెర్చ్‌, Add me, స్టూడియో మరియు స్క్రీన్‌షాట్‌ వంటి AI ఫీచర్‌లతో అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. పిక్సల్‌ 9 ప్రో మోడల్‌ స్మార్ట్‌ఫోన్‌లు టెలిఫోటో సెన్సార్‌ సహా ట్రిపుల్ కెమెరాలను కలిగి ఉండే అవకాశం ఉంది.

మేడ్‌ బై గూగుల్‌ ఈవెంట్‌ ;
మేడ్‌ బై గూగుల్‌ ఈవెంట్‌ ఆగస్టు 13న నిర్వహించనుంది. గూగుల్‌ సంస్థ ప్రధాన కార్యాలయం అమెరికాలోని కాలిఫోర్నియా మౌంటెన్‌వ్యూలో జరగనుంది. భారత కాలమానం ప్రకారం ఆగస్టు 13వ తేదీ 10:30 PM కు ప్రారంభం కానుంది. పిక్సల్‌ 9 సిరీస్‌ సహా పిక్సల్‌ బడ్స్‌ ప్రో 2, పిక్సల్‌ వాచ్‌ 3 ను ఆవిష్కరించే అవకాశం ఉంది.

గిజ్‌ బాట్‌ తెలుగు వెబ్‌ సైట్ గ్యాడ్జెట్లు సహా ఇతర టెక్‌ న్యూస్‌ కు సంబంధించిన ఆసక్తికరమైన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరి కొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా వార్తల కోసం సోషల్‌ మీడియా ఖాతాలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు.

More from GizBot

Best Mobiles in India

English summary
Google Pixel 9 series Smartphones could launch with ultrasonic Fingerprint sensor
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X