రూ.49,999కే పిక్సెల్ 9a ఫోన్.. 48MP కెమెరా, 5100mAh బ్యాటరీ, టెన్సర్ G4 చిప్‌తో దుమ్మురేపుతోంది!
Google Pixel 9a: తాజాగా గూగుల్ సంస్థ పిక్సెల్ 9a స్మార్ట్‌ఫోన్‌ను భారతీయ మార్కెట్‌లో విడుదల చేసింది. మిడ్‌రేంజ్ సెగ్మెంట్‌లో "a" సిరీస్‌లో భాగంగా వచ్చిన ఈ ఫోన్.. మంచి ఫీచర్లతో అదరగొడుతోంది. పిక్సెల్ 9 సిరీస్‌లో గతంలో చూసిన వేగవంతమైన టెన్సర్ G4 చిప్‌తో ఈ ఫోన్ వస్తోంది. ఇందులో పెద్ద బ్యాటరీతో పాటు మెరుగైన కెమెరాలు కూడా అందించారు. ఈ ఫోన్ గురించి మరిన్ని వివరాలు తెలుసుకుందాం.
* ధర, లభ్యత వివరాలు
భారతదేశంలో పిక్సెల్ 9a ధర రూ.49,999 నుంచి ప్రారంభమవుతుంది. ప్రస్తుతం ఒకే వేరియంట్‌లో (8GB RAM + 256GB స్టోరేజ్) అందుబాటులో ఉంది. ఈ ఫోన్ ఐరిస్, అబ్సిడియన్, పియోనీ, పోర్సిలెయిన్ రంగుల్లో లభిస్తుంది. ఏప్రిల్‌లో గూగుల్ రిటైల్ భాగస్వాముల ద్వారా అమ్మకాలు మొదలవుతాయని కంపెనీ ప్రకటించింది. అయితే, కచ్చితమైన తేదీని మాత్రం ఇంకా వెల్లడించలేదు.

* డిస్‌ప్లే, డిజైన్ ఎలా ఉందంటే..
పిక్సెల్ 9a స్మార్ట్‌ఫోన్‌లో 6.3- అంగుళాల ఆక్టువా (Actua) pOLED డిస్‌ప్లే ఇచ్చారు. దీని రిజల్యూషన్ 1,080 x 2,424 పిక్సెల్స్. 60Hz నుంచి 120Hz వరకు రిఫ్రెష్ రేట్ ఉంటుంది. సూర్యరశ్మిలో కూడా స్క్రీన్ క్లియర్‌గా కనిపించేలా 2,700 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్‌తో వస్తోంది. డిస్‌ప్లేకి గొరిల్లా గ్లాస్ 3 ప్రొటెక్షన్ కూడా ఉంది.
* పనితీరు, స్టోరేజ్
ఈ ఫోన్ గూగుల్ టెన్సర్ G4 చిప్‌సెట్‌తో పాటు టైటాన్ M2 సెక్యూరిటీ కో-ప్రాసెసర్‌తో పనిచేస్తుంది. 8GB ర్యామ్, 256GB ఇంటర్నల్ స్టోరేజ్ ఉన్నాయి. స్టోరేజ్ పెంచుకోవడానికి ఎక్స్‌టర్నల్ కార్డ్ స్లాట్ మాత్రం లేదు. డ్యూయల్ సిమ్ (నానో + ఈసిమ్) ఆప్షన్ కూడా ఉంది.
* కెమెరాలు, ఫీచర్లు
పిక్సెల్ 9a వెనుకవైపు 48MP మెయిన్ కెమెరా (1/2-inch సెన్సార్, f/1.7 అపెర్చర్, OIS, క్లోజ్డ్-లూప్ ఆటోఫోకస్), 13MP అల్ట్రావైడ్ కెమెరా (120-degree ఫీల్డ్ ఆఫ్ వ్యూ, f/2.2 అపెర్చర్) ఉన్నాయి. 8x వరకు సూపర్ రెజ్ జూమ్ చేసుకోవచ్చు. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం ముందువైపు 13MP కెమెరా (f/2.2 అపెర్చర్) ఇచ్చారు.
ఇంకా మ్యాక్రో ఫోకస్, నైట్ సైట్, మ్యాజిక్ ఎరేజర్, బెస్ట్ టేక్, ఫోటో అన్‌బ్లర్, పోర్ట్రెయిట్ లైట్ లాంటి అడ్వాన్స్‌డ్ కెమెరా ఫీచర్లు కూడా ఉన్నాయి. వెనుక కెమెరాతో 4K/60fps వరకు, ముందు కెమెరాతో 4K/30fps వరకు వీడియోలు రికార్డ్ చేయొచ్చు.
ఆడియో మ్యాజిక్ ఎరేజర్, మ్యాక్రో ఫోకస్ వీడియో, సినిమాటిక్ పాన్, స్లో-మో (240fps), టైమ్‌లాప్స్ స్టెబిలైజేషన్, నైట్ సైట్ టైమ్‌లాప్స్ వంటి అదనపు వీడియో ఫీచర్లు కూడా ఉన్నాయి. పిక్సెల్ 9a సైజు 154.7 x 73.3 x 8.9mm, బరువు 185.9g. కాంపాక్ట్‌గా, పట్టుకోవడానికి ఈజీగా ఉంటుంది.
* బ్యాటరీ, ఛార్జింగ్
పిక్సెల్ 9aలో 5,100mAh బ్యాటరీ ఉంది. ఇది 23W ఫాస్ట్ ఛార్జింగ్‌కు మద్దతు ఇస్తుంది. గూగుల్ 45W పవర్ అడాప్టర్‌తో వేగంగా ఛార్జింగ్ చేసుకోవచ్చు. 7.5W వైర్‌లెస్ (Qi) ఛార్జింగ్ కూడా సపోర్ట్ చేస్తుంది. ఎక్స్‌ట్రీమ్ బ్యాటరీ సేవర్ మోడ్‌లో 100 గంటల వరకు బ్యాటరీ ఆదా వస్తుందని కంపెనీ చెబుతోంది.
* కనెక్టివిటీ, సెక్యూరిటీ
5G, 4G LTE, Wi-Fi 6E, బ్లూటూత్ 5.3, NFC, GPS, NavIC, USB 3.2 టైప్-C పోర్ట్ కనెక్టివిటీ ఆప్షన్లు ఉన్నాయి. స్టీరియో స్పీకర్లు, రెండు మైక్రోఫోన్లు ఉన్నాయి. యాక్సిలెరోమీటర్, గైరోస్కోప్, మాగ్నెటోమీటర్, బేరోమీటర్, యాంబియంట్ లైట్ సెన్సార్, ప్రాక్సిమిటీ సెన్సార్ వంటి సెన్సార్లు ఉన్నాయి. సెక్యూరిటీ కోసం ఇన్-డిస్‌ప్లే ఫింగర్‌ప్రింట్ స్కానర్, ఫేస్ అన్‌లాక్ ఫీచర్లు కూడా ఉన్నాయి.


Click it and Unblock the Notifications








