Home
Mobile

Google Upcoming Smartphone గూగుల్‌ పిక్సల్‌ 9a కీలక వివరాలు లీక్‌.. ఈ నెలలోనే భారత్‌లో విడుదల..?

గూగుల్‌ నుంచి ఈ నెలలో పిక్సల్‌ 9a స్మార్ట్‌ఫోన్‌ (Google Pixel 9a Smartphone) లాంచ్ కానుందనే లీక్స్‌ వస్తున్నాయి. టిప్‌స్టర్ యోగేష్‌ బ్రార్‌ వివరాల ఆధారంగా ఈ ఫోన్‌ ‌గ్లోబల్‌ మార్కెట్‌ లో మార్చి 19 వ తేదీన లాంచ్‌ కానుంది. భారత్ మార్కెట్‌ లో 20 వ తేదీన విడుదల కానుంది. ఇప్పటికే ఈ ఫోన్‌ కు సంబంధించిన అనేక వివరాలు లీక్‌ అయ్యాయి. డిజైన్‌ సహా మరిన్ని అప్‌గ్రేడ్స్‌ తో విడుదల కానుంది. అయితే విడుదల తేదీపై గూగుల్ ఎటువంటి ప్రకటన చేయలేదు.

నాలుగు రంగుల్లో :
తాజాగా టిప్‌స్టర్‌ ఇవన్‌ బ్లాస్‌ (@evleaks) గూగుల్‌ పిక్సల్‌ 9a కు సంబంధించిన కీలక వివరాలు లీక్‌ చేశారు. నాలుగు రంగుల్లో ఈ ఫోన్‌ విడుదల కానుందని తెలుస్తోంది. ఈ ఫోన్ ఒబ్సిడియన్, పింగాణీ, ఐరిస్‌, పియోనీ వంటి నాలుగు రంగుల్లో లభిస్తుందని సమాచారం.

Google pixel 9a smartphone

AI ఫీచర్‌లు :
దీంతోపాటు ఇప్పటికే లీక్‌ అయిన వివరాలు ఆధారంగా కెమెరా మాడ్యూల్‌ డిజైన్‌ లో మార్పులు ఉండనున్నాయి. మరియు వెనుక వైపు ఫ్లాట్‌ ప్యానల్‌ను కలిగి ఉంది. మరియు అనేక ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ సహా సెక్యూరిటీ ఫీచర్‌ లను కలిగి ఉంటుందని తెలుస్తోంది. దీంతోపాటు IP68 రేటింగ్‌తో ఈ ఫోన్‌ లాంచ్ కానుందని సమాచారం.

డిస్‌ప్లే వివరాలు :
ఇప్పటి వరకు అందుబాటులోకి వచ్చిన వివరాల ఆధారంగా పిక్సల్‌ 9a ఫోన్‌ 6.28 అంగుళాల FHD+ అమోలెడ్‌ డిస్‌ప్లేను కలిగి ఉండే అవకాశం ఉంది. ఈ డిస్‌ప్లే 120Hz రీఫ్రెష్‌ రేట్‌, 2700 నిట్స్‌ గరిష్ట బ్రైట్‌నెస్‌ను కలిగి ఉంటుందని సమాచారం. అయితే ఈ డిస్‌ప్లే HDR10+ సపోర్టును కలిగి ఉంటుందని తెలుస్తోంది.

చిప్‌సెట్‌, అప్‌డేట్స్‌ వివరాలు :
పనితీరు పరంగా గత మోడల్ కంటే మెరుగ్గా ఉంటుందని తెలుస్తోంది. ఈ పిక్సల్‌ 9a మోడల్‌ అండర్‌ ది హుడ్‌ Tensor G4 చిప్‌సెట్‌ ను కలిగి ఉంటుందని సమాచారం. చిప్‌సెట్‌ 8GB LPDDR5X ర్యామ్, 256GB UFS 3.1 స్టోరేజీతో జతచేసి ఉండే అవకాశం ఉంది. 7 ఆండ్రాయిడ్ OS అప్‌డేట్స్‌, 7 సంవత్సరాల వరకు సెక్యూరిటీ అప్‌డేట్స్‌ అందుకోనుంది.

బ్యాటరీ, ఛార్జింగ్‌ సపోర్టు :
ఈ స్మార్ట్‌ ఫోన్‌ 23W వైర్, 7.5 వైర్‌లెస్‌ ఛార్జింగ్ సపోర్టుతో 5100mAh బ్యాటరీతో పనిచేసే అవకాశం ఉంది. కెమెరా విభాగం పరంగా వెనుక వైపు ఫ్లాట్‌ కెమెరా మాడ్యూల్‌ను కలిగి ఉంటుంది. 48MP ప్రైమరీ కెమెరా, 13MP అల్ట్రావైడ్ లెన్స్‌ సహా 13MP సెల్ఫీ కెమెరాను కలిగి ఉండే అవకాశం ఉంది.

గూగుల్‌ పిక్సల్‌ 9a ధర వివరాలు కూడా లీక్‌ అయ్యాయి. భారత్‌ మార్కెట్‌ లో ఈ హ్యాండ్‌సెట్‌ ప్రారంభ ధర రూ.52,999 గా ఉండే అవకాశం ఉంది. అదే టాప్‌ ఎండ్‌ వేరియంట్ ధర రూ.62,999 గా ఉంటుందని తెలుస్తోంది. అయితే లాంచ్ తేదీ, ధర, ఇతర స్పెసిఫికేషన్లపై గూగుల్‌ ఎటువంటి ప్రకటన చేయలేదు.

ఈ గూగుల్ పిక్సల్‌ 9a ధర వివరాలు కూడా లీక్‌ అయ్యాయి. ఈ ఫోన్ ప్రారంభ ధర రూ.52,999 గా ఉంటుందని తెలుస్తోంది. అదే టాప్ ఎండ్‌ వేరియంట్ ధర రూ.62,999 గా ఉంటుందని సమాచారం. విడుదల సమయంలో ధరలపై కచ్చితమైన వివరాలు అందుబాటులోకి రానున్నాయి.

More from GizBot

Best Mobiles in India

English summary
Google pixel 9a smartphone expected to launch in four colour variants and AI features
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X