ఈ వారంలోనే గూగుల్ పిక్సల్ 9a స్మార్ట్‌ఫోన్ విడుదల.. స్పెసిఫికేషన్‌లు, ఫీచర్‌ల పూర్తి వివరాలు..?
ప్రముఖ టెక్ దిగ్గజం గూగుల్ నుంచి త్వరలో పిక్సల్ 9a స్మార్ట్‌ఫోన్ (Google Pixel 9a Smartphone) విడుదల కానుంది. ఈ మోడల్ కు సంబంధించిన డిజైన్ సహా అనేక వివరాలు వెల్లడయ్యాయి. ఇటీవలే లాంచ్ వివరాలు కూడా లీక్ అయ్యాయి. ఈ ఫోన్ మార్చి 19 వ తేదీన గ్లోబల్ లాంచ్ కానుందని మరియు మార్చి 20 వ తేదీన భారత్ లో విడుదల కానుందనే వార్తలు వచ్చాయి. మరియు మార్చి 26 నుంచి సేల్ ప్రారంభం కానుందని లీక్స్ ద్వారా తెలిసింది. అయితే పిక్సల్ 9a స్మార్ట్‌ఫోన్ విడుదలపై గూగుల్ ఇప్పటి వరకు ఎటువంటి అధికారిక ప్రకటన చేయలేదు.
డిజైన్‌లో మార్పులు :
గూగుల్ పిక్సల్ 9a స్మార్ట్‌ఫోన్ డిజైన్ పరంగా అనేక మార్పులను గమనించవచ్చు. ముఖ్యంగా కెమెరా మాడ్యూల్ లో మార్పులు చేసినట్లు ఇటీవల లీక్ అయిన డిజైన్ ఆధారంగా తెలిసింది. ఇప్పటి వరకు కెమెరా బంప్ మోడల్ లో ఫోన్‌లు అందుబాటులోకి వచ్చాయి. అయితే పిక్సల్ 9a మోడల్ మాత్రం ఫ్లాట్ డిజైన్ ను కలిగి ఉంటుందని తెలుస్తోంది.

డిస్‌ప్లే వివరాలు :
ప్రస్తుతం అందుబాటులో ఉన్న వివరాల ఆధారంగా గూగుల్ పిక్సల్ 9a స్మార్ట్‌ఫోన్ 120Hz రీఫ్రెష్ రేట్ తో కూడిన 6.3 అంగుళాల FHD+ అమోలెడ్ డిస్‌ప్లేను కలిగి ఉంటుందని తెలుస్తోంది. మరియు 2700 నిట్స్ గరిష్ట బ్రైట్‌నెస్, HDR10+ సపోర్టును కలిగి ఉంటుందని తెలుస్తోంది. ఈ డిస్‌ప్లే గొరెల్లా గ్లాస్ 3 రక్షణను పొందే అవకాశం ఉంది.
పవర్‌ఫుల్ చిప్‌సెట్ :
ఈ గూగుల్ స్మార్ట్‌ఫోన్ గత మోడల్స్ కంటే శక్తివంతమైన చిప్‌సెట్‌ను కలిగి ఉంటుందని సమాచారం. ఈ హ్యాండ్‌సెట్ Tensor G4 చిప్‌సెట్ తో పనిచేస్తుందని తెలుస్తోంది. ఈ ప్రాసెసర్ గరిష్ఠంగా 8GB LPDDR5X ర్యామ్, 256GB UFS 3.1 స్టోరేజీతో జతచేసి ఉంటుందని తెలుస్తోంది. Titan M2 చిప్‌సెట్‌ను కూడా కలిగి ఉంటుందని సమాచారం.
48MP ప్రైమరీ కెమెరా :
కెమెరా డిజైన్ పరంగా కీలక మార్పులు ఉండనున్నాయి. మరియు ఈ హ్యాండ్‌సెట్ 48MP ప్రైమరీ కెమెరాతోపాటు 13MP అల్ట్రావైడ్ కెమెరాను కలిగి ఉంటుందని తెలుస్తోంది. సెల్ఫీ, వీడియో కాల్స్ కోసం 13MP కెమెరాతో లాంచ్ కానుందని తెలుస్తోంది.
ఈ సిరీస్‌లో ఇదే భారీ బ్యాటరీ :
బ్యాటరీ పరంగానూ మెరుగైన స్పెసిఫికేషన్‌లను కలిగి ఉంటుందని సమాచారం. ఈ పిక్సల్ 9a హ్యాండ్‌సెట్ 23W వైర్ ఛార్జింగ్, 7.5 వైర్‌లెస్ ఛార్జింగ్ తో 5100mAh బ్యాటరీతో అందుబాటులోకి వస్తుందని తెలుస్తోంది. ఇప్పటి వరకు పిక్సల్ సిరీస్ లో త్వరలో లాంచ్ కానున్న హ్యాండ్‌సెట్ మాత్రమే భారీ బ్యాటరీని కలిగి ఉందని తెలుస్తోంది.
కీలక ఫీచర్‌లు :
దీంతోపాటు ఈ గూగుల్ స్మార్ట్‌ఫోన్ అనేక కీలక ఫీచర్‌లను కలిగి ఉంటుందని తెలుస్తోంది. శాటిలైట్ కనెక్టివిటీ, ఎమర్జెన్సీ SOS ఫీచర్ వంటి ఫీచర్‌లను కలిగి ఉండే అవకాశం ఉంది. మరియు IP68 రేటింగ్‌తో డస్ట్ మరియు వాటర్ రెసిస్టెంట్‌గా ఉంటుందని సమాచారం.
గూగుల్ పిక్సల్ 9a స్మార్ట్‌ఫోన్ ధర వివరాలు గతంలో లీక్ అయ్యాయి. ఈ హ్యాండ్‌సెట్ ప్రారంభ ధర రూ.52,999 గా ఉంటుందని తెలుస్తోంది. అదే టాప్ ఎండ్ వేరియంట్ ధర రూ.62,999 గా ఉండే అవకాశం ఉంది. మరియు ఈ ఫోన్ నాలుగు కలర్ వేరియంట్స్‌లో లభించే అవకాశం ఉంది. ఐరిస్, ఒబ్సిడియన్, పార్సిలియన్, పియోనీ రంగుల్లో లాంచ్ కానుందని తెలుస్తోంది.


Click it and Unblock the Notifications








