గూగుల్ పిక్సల్ 9a స్మార్ట్‌ఫోన్ లాంచ్, స్పెసిఫికేషన్‌లు, ధర వివరాలు లీక్.. తొలిసారిగా భారీ బ్యాటరీతో..!
టెక్ దిగ్గజం గూగుల్ నుంచి త్వరలో గూగుల్ పిక్సల్ 9a (Google Pixel 9a Smartphone) లాంచ్ కానుందని తెలుస్తోంది. ఇటీవల ఈ స్మార్ట్‌ఫోన్ స్పెసిఫికేషన్‌లు, ఫీచర్‌లు, ధర వివరాలు లీక్ అయ్యాయి. అయితే పిక్సల్ 7a, పిక్సల్ 8a లాంచ్ టైమ్ లైన్ కంటే ముందుగానే పిక్సల్ 9a విడుదల కానుందని సమాచారం. దీంతోపాటు కొన్ని డిజైన్, స్పెసిఫికేషన్‌లలోనూ మార్పులు ఉండే అవకాశం ఉంది. గత మోడళ్లతో పోలిస్తే భారీ బ్యాటరీని కలిగి ఉంటుందని తెలుస్తోంది.
గూగుల్ పిక్సల్ 9a స్మార్ట్‌ఫోన్ విడుదల తేదీ! :
గూగుల్ పిక్సల్ 7a, పిక్సల్ 8a మోడళ్లు ఆయా సంవత్సరాల్లో మే నెలలో విడుదల అయ్యాయి. అయితే పిక్సల్ 9a మోడల్ మాత్రమే మార్చి నెలలో లాంచ్ కానుందని తెలుస్తోంది. ప్రస్తుతం ఉన్న వివరాల ఆధారంగా ఫోన్ ప్రీ ఆర్డర్స్ మార్చి 19 నుంచి ప్రారంభం కానున్నాయని తెలుస్తోంది. దీంతోపాటు మార్చి 26 నుంచి సేల్ ప్రారంభం అయ్యే అవకాశం ఉంది.

డిజైన్, స్పెసిఫికేషన్‌ల వివరాలు :
ముఖ్యంగా పిక్సల్ 9a స్మార్ట్‌ఫోన్.. గత మోడల్స్‌తో పోలిస్తే డిజైన్‌లో కొన్ని మార్పులు రానున్నాయని తెలుస్తోంది. దీంతోపాటు కెమెరా మాడ్యూల్ డిజైన్ మరింత కొత్తగా ఉంటుందని సమాచారం. ప్రస్తుతం అందుబాటులో ఉన్న పిక్సల్ ఫోన్‌ల కంటే పెద్ద బ్యాటరీని కలిగి ఉంటుందని తెలుస్తోంది. అంటే పిక్సల్ 9a మోడల్ 5100mAh బ్యాటరీతో లాంచ్ కానుందని తెలుస్తోంది.
నాలుగు కలర్ వేరియంట్స్ :
ఈ స్మార్ట్‌ఫోన్ 6.28 అంగుళాల డిస్‌ప్లేను కలిగి ఉంటుందని తెలుస్తోంది. ఈ డిస్‌ప్లే 120Hz రీఫ్రెష్ రేట్, 240Hz టచ్ శాంప్లింగ్ రేట్, 2700 నిట్స్ గరిష్ఠ బ్రైట్‌నెస్ ను కలిగి ఉండే అవకాశం ఉంది. ఈ హ్యాండ్‌సెట్ అబ్సిడియన్, పోర్సిలెయిన్, ఐరిస్, పియోనీ రంగుల్లో అందుబాటులోకి వస్తుందని తెలుస్తోంది.
7 సంవత్సరాల వరకు సెక్యూరిటీ అప్‌డేట్‌లు :
గూగుల్ పిక్సెల్ 9a స్మార్ట్‌ఫోన్ ఆండ్రాయిడ్ 15 ఆధారిత OS ను కలిగి ఉంటుందని తెలుస్తోంది. దీంతోపాటు టెన్సార్ G4 చిప్‌సెట్‌తో పనిచేస్తుందని సమాచారం. ఈ చిప్‌సెట్ 8GB LPDDR5x ర్యామ్, UFS 3.1.. 128GB మరియు 256GB స్టోరేజీ తో జతచేసి ఉండే అవకాశం ఉంది. 7 సంవత్సరాల వరకు ఆండ్రాయిడ్ OS, సెక్యూరిటీ అప్‌డేట్‌లను అందించనుందని తెలుస్తోంది.
48MP ప్రైమరీ కెమెరా :
కెమెరా విభాగం పరంగా వెనుక వైపు డ్యూయల్ కెమెరాలను కలిగి ఉంటుందని తెలుస్తోంది. 48MP ప్రైమరీ కెమెరాతోపాటు 13MP అల్ట్రావైడ్ లెన్స్‌ను కలిగి ఉండే అవకాశం ఉంది. దీంతోపాటు సెల్ఫీ, వీడియో కాల్స్ కోసం ముందువైపు 13MP కెమెరాతో లాంచ్ అయ్యే అవకాశం ఉంది.
తొలిసారిగా భారీ బ్యాటరీ :
ఈ కెమెరాలు Super Res Zoom, నైట్ సైట్, ఆస్ట్రో ఫొటోగ్రఫీ వంటి అనేక ఫీచర్‌లను కలిగి ఉండే అవకాశం ఉంది. దీంతోపాటు ఈ హ్యాండ్‌సెట్ 5100mAh బ్యాటరీతో లాంచ్ అయ్యే అవకాశం ఉంది. 7.5W వైర్‌లెస్ ఛార్జింగ్ ను సపోర్టు చేస్తుందని తెలుస్తోంది.
దీంతోపాటు పిక్సల్ 9a ధర వివరాలు కూడా లీక్ అయ్యాయి. ఆండ్రాయిడ్ హెడ్‌లైన్స్ ఆధారంగా 128GB స్టోరేజీ వేరియంట్ ధర $499 (భారత కరెన్సీ ప్రకారం సుమారు రూ.43,200), 256GB స్టోరేజీ వేరియంట్ ధర $599 (భారత కరెన్సీ ప్రకారం సుమారు రూ.51,900) గా ఉంటుందని తెలుస్తోంది. అయితే భారత్ మార్కెట్‌లో ఈ ధరలు మరింత ఎక్కువగా ఉండే అవకాశం ఉంది.


Click it and Unblock the Notifications








