గూగుల్ స్మార్ట్‌ఫోన్‌పై రూ.10000 డిస్కౌంట్.. 7 సంవత్సరాల అప్‌డేట్స్ సహా సూపర్ ఫీచర్లు!
Google Pixel 9a Pricedrop : గూగుల్ నుంచి పిక్సల్ 10a స్మార్ట్‌ఫోన్ ఫిబ్రవరి 18 వ తేదీన విడుదల కానుంది. ఫ్లిప్‌కార్ట్ ద్వారా ఈ ఫోన్ సేల్ ప్రారంభం కానుంది. విడుదల అయిన తేదీ నుంచి ఈ ఫోన్‌ను ముందస్తు బుకింగ్ చేసుకొనేందుకు అవకాశం ఉంటుందని తెలుస్తోంది. అయితే పిక్సల్ 10a విడుదల నేపథ్యంలో గత సంవత్సరం లాంచ్ అయిన పిక్సల్ 9a మోడల్ ప్రస్తుతం భారీ డిస్కౌంట్ ధరకు అందుబాటులో ఉంది.
గూగుల్ పిక్సల్ 9a స్మార్ట్‌ఫోన్ గత సంవత్సరం ఏప్రిల్ నెలలో అందుబాటులోకి వచ్చింది. భారత్ లో కేవలం 8GB ర్యామ్ + 256GB స్టోరేజీ వేరియంట్‌లోనే అందుబాటులోకి వచ్చింది. ఈ హ్యాండ్‌సెట్ లాంచ్ సమయంలో ధర రూ.49999 గా ఉండేది.

రూ.10000 డిస్కౌంట్ :
ప్రస్తుతం రూ.10000 డిస్కౌంట్‌తో అందుబాటులో ఉంది. అంటే రూ.39999 ధరకే కొనుగోలు చేయవచ్చు. దీంతోపాటు ఫ్లిప్‌కార్ట్ లో ఎంపిక చేసిన బ్యాంకు కార్డులపై గరిష్ఠంగా రూ.2000 డిస్కౌంట్ ను పొందవచ్చు. ఈ ఫోన్ ఐరిస్, ఒబ్సిడియన్, పార్సిలియన్ కలర్ వేరియంట్స్‌లో అందుబాటులో ఉంది.
డిస్‌ప్లే వివరాలు :
గూగుల్ పిక్సల్ 9a స్మార్ట్‌ఫోన్ 6.3 అంగుళాల Actua (pOLED) డిస్‌ప్లేను కలిగి ఉంది. అడాప్టివ్ 120Hz రీఫ్రెష్ రేట్, 2700 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్‌ను కలిగి ఉంది. ఈ డిస్‌ప్లే కార్నింగ్ గ్లా్స్ 3 ప్రొటెక్షన్‌ను పొందుతోంది. IP68 రేటింగ్‌తో డస్ట్, వాటర్ రెసిస్టెంట్‌గా ఉంది.
7 సంవత్సరాల వరకు అప్‌డేట్స్ :
ఈ హ్యాండ్‌సెట్ Tensor G4 చిప్‌సెట్ ను కలిగి ఉంది. దీంతోపాటు టైటాన్ M2 సెక్యూరిటీ కో ప్రాసెసర్ కూడా ఉంది. ఆండ్రాయిడ్ 15 ఆధారిత OS పైన పనిచేస్తోంది. ఈ ఫోన్ 7 ఆండ్రాయిడ్ OS, 7 సంవత్సరాల వరకు సెక్యూరిటీ అప్‌డేట్స్‌ను పొందుతుంది.

48MP OIS కెమెరా :
కెమెరా విభాగం పరంగా వెనుక వైపు రెండు కెమెరాలున్నాయి. ఆటోఫోకస్, OIS (ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలేజైషన్) సపోర్టుతో 48MP ప్రైమరీ కెమెరా ఉంది. దీంతోపాటు 12MP అల్ట్రావైడ్ లెన్స్ ఉన్నాయి. సెల్ఫీ, వీడియో కాల్స్ కోసం 12MP కెమెరాను కలిగి ఉంది.
ఫాస్ట్, వైర్‌లెస్ ఛార్జింగ్ సపోర్టు :
ఈ కెమెరాలు 60fps వద్ద 4K వీడియో రికార్డింగ్ సామర్థ్యాన్ని కలిగి ఉంది. magc Eraser, Best Take, Photo Unblur సహా సర్కిల్ టూ సెర్చ్, పిక్సల్ స్టూడియో వంటి అనేక ఫీచర్లు ఉన్నాయి. ఈ ఫోన్ 23W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్టుతో 5100mAh బ్యాటరీతో పనిచేస్తోంది. 7.5W వైర్‌లెస్ ఛార్జింగ్ సపోర్టును కూడా కలిగి ఉంది.
కనెక్టివిటీ పరంగా 5G, 4G, బ్లూటూత్ 5.3, వైఫై 6e, GPS, Navlc, USB-C ఛార్జింగ్ పోర్టును కలిగి ఉంది. గైరోస్కో్ప్, మాగ్నటోమీటర్, బారోమీటర్, యాంబియంట్ లైట్ సెన్సర్, ప్రాక్సిమిటీ సెన్సర్లు ఉన్నాయి. సెక్యూరిటీ కోసం ఇన్-డిస్‌ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సర్ ఉంది.


Click it and Unblock the Notifications








