గూగుల్ పిక్సల్ 9a ఫోన్ సేల్ ప్రారంభం.. ఇలా చేస్తే రూ.5000 వరకు తగ్గింపు ధరకు పొందవచ్చు..!
గూగుల్ నుంచి గత నెలలో గూగుల్ పిక్సల్ 9a స్మార్ట్‌ఫోన్ (Google pixel 9a smartphone sale) విడుదల అయింది. ఈ ఫోన్ ఇవాళ్టి నుంచి సేల్ ప్రారంభం అయింది. ఈ ఫోన్ అద్భుతమైన డిజైన్‌తోపాటు టెన్సార్ G4 చిప్‌సెట్ 48MP కెమెరా ను కలిగి ఉన్నాయి. ఈ ఫోన్ కోసం గూగుల్ ఏకంగా 7 సంవత్సరాల వరకు సాఫ్ట్‌వేట్ అప్‌డేట్స్‌ను అందిస్తుంది. ఈ ఫోన్ నాలుగు కలర్ వేరియంట్స్‌లో ప్రస్తుతం కొనుగోలు చేయవచ్చు.
గూగుల్ పిక్సల్ 9a స్మార్ట్‌ఫోన్ 8GB ర్యామ్ + 256GB స్టోరేజీ ధర రూ.49999 గా ఉంది. ఈ ఫోన్‌ను ఫ్లిప్‌కార్ట్, క్రోమా, రిలయన్స్ డిజిటల్ సహా ఇతర ఫ్లాట్‌ఫామ్స్‌లో కొనుగోలు చేయవచ్చు. ఈ హ్యాండ్‌సెట్ ఒబ్సిడియన్, ఐరిస్, పియానీ, పార్సిలియన్ కలర్ వేరియంట్స్‌లో లభిస్తుంది.

రిలయన్స్ డిజిటల్‌లో కెనరా బ్యాంక్ క్రెడిట్ కార్డుతో కొనుగోలు చేస్తే 10 శాతం డిస్కౌంట్‌ను అందిస్తోంది. అంటే రూ.4999 వరకు తగ్గింపును పొందవచ్చు. ఫలితంగా ఫోన్‌ను రూ.45 వేల ధరకే సొంతం చేసుకోవచ్చు. అదే ఫ్లిప్‌కార్ట్‌లో HDFV బ్యాంకు క్రెడిట్ కార్డు EMI ట్రాన్సాక్షన్‌లతో రూ.3000 తగ్గింపును పొందవచ్చు.
అదే విధంగా ఫ్లిప్‌కార్ట్‌లో ఫ్లిప్‌కార్ట్ యాక్సెస్ బ్యాంకు క్రెడిట్ కార్డుతో 5 శాతం డిస్కౌంట్‌ను పొందవచ్చు. అంటే సుమారుగా రూ.2500 డిస్కౌంట్‌ను పొందవచ్చు. ఫలితంగా గూగుల్ పిక్సల్ 9a స్మార్ట్‌ఫోన్‌ను రూ.47999 కే సొంతం చేసుకోవచ్చు.
గూగుల్ పిక్సల్ 9a స్మార్ట్‌ఫోన్ Tensor G4 చిప్‌సెట్, టైటాన్ M2 సెక్యూరిటీ కో ప్రాసెసర్‌ను కలిగి ఉంది. మరియు ఆండ్రాయిడ్ 15 ఆధారిత OS తో పనిచేస్తుంది. ఈ ఫోన్ గరిష్ఠంగా 7 సంవత్సరాల వరకు ఆండ్రాయిడ్ OS అప్‌డేట్స్, 7 సంవత్సరాల వరకు సెక్యూరిటీ అప్‌డేట్స్‌ను పొందనుంది.
ఈ హ్యాండ్‌సెట్ 60Hz - 120Hz రీఫ్రెష్, 2700 నిట్స్ గరిష్ఠ బ్రైట్‌నెస్‌తో 6.3 అంగుళాల Actua (pOLED) డిస్‌ప్లేను కలిగి ఉంది. ఈ డిస్‌ప్లే కార్నింగ్ గ్లా్స్ 3 ప్రొటెక్షన్‌ను పొందుతుంది. ఈ గూగుల్ ఫోన్ 23W ఫాస్ట్ ఛార్జింగ్, 7.5W వైర్‌లెస్ ఛార్జింగ్ సపోర్టుతో 5100mAh బ్యాటరీతో పనిచేస్తుంది.
ఈ గూగుల్ స్మార్ట్‌ఫోన్ డ్యూయల్ రియర్ కెమెరాలతో అందుబాటులోకి వచ్చింది. ఇందులో 48MP OIS ప్రైమరీ కెమెరా, 8x సూపర్ రిజల్యూషన్ జూమ్, 120 డిగ్రీల ఫీల్డ్‌వ్యూ తో 13MP అల్ట్రావైడ్ లెన్స్‌ను కలిగి ఉంది. మరియు సెల్ఫీ, వీడియో కాల్స్ కోసం 13MP సెల్ఫీ కెమెరాను కలిగి ఉంటుంది.
ఈ పిక్సల్ 9a స్మార్ట్‌ఫోన్ Magic Eraser, Add me, మ్యాక్రో ఫోకస్, నైట్ సైట్, Reimagine, బెస్ట్ టేక్, ఫోటో అన్‌బ్లర్, పొర్ట్రెయిట్ లైట్ వంటి అనేక ఫీచర్లను కలిగి ఉంది. ఈ ఫోన్ IP68 రేటింగ్‌తో డస్ట్ మరియు వాటర్ రెసిస్టెంట్‌గా ఉంది. సెక్యూరిటీ కోసం ఇన్‌డిస్‌ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్‌ను కలిగి ఉంది.
కనెక్టివిటీ పరంగా 5G, 4G, బ్లూటూత్ 5.3, WiFi 6E, GPS, NavlC, USB-C ఛార్జింగ్ పోర్టును కలిగి ఉంది. బారోమీటర్, యాక్సెలిరోమీటర్, మ్యాగ్నటోమీటర్, గైరోస్కోప్, యాంబియంట్ లైట్ సెన్సార్, ప్రాక్సిమిటీ సెన్సార్‌లను కలిగి ఉంది.


Click it and Unblock the Notifications