Home
Mobile

గూగుల్‌ పిక్సల్‌ 9a స్మార్ట్‌ఫోన్‌ సేల్‌ తేదీ వచ్చేసింది.. ధర, ఫీచర్‌ల వివరాలు..!

గూగుల్‌ నుంచి ఇటీవల పిక్సల్‌ 9a స్మార్ట్‌ఫోన్‌ భారత్‌లో విడుదల అయింది. తాజాగా ఈ హ్యాండ్‌సెట్‌ సేల్‌ తేదీని గూగుల్ వెల్లడించింది. గూగుల్‌ పిక్సల్‌ 9a టెన్సార్‌ G4 చిప్‌సెట్, 48MP కెమెరా, 5100mAh బ్యాటరీని కలిగి ఉంది. ఈ స్మార్ట్‌ఫోన్ నాలుగు కలర్‌ వేరియంట్స్‌లో అందుబాటులోకి వచ్చింది. ఈ ఫోన్‌ పూర్తి స్పెసిఫికేషన్‌లు, ధర, సేల్‌ పూర్తి వివరాలు.

గూగుల్‌ పిక్సల్‌ 9a స్మార్ట్‌ఫోన్ (Google pixel 9a smartphone sale Date in india) 8GB ర్యామ్ + 256GB స్టోరేజీ వేరియంట్ ధర రూ.49999 గా ఉంది. ఏప్రిల్ 16వ తేదీ నుంచి భారత్ మార్కెట్‌లో ఈ ఫోన్ సేల్‌ ప్రారంభం కానుంది. ఈ హ్యాండ్‌సెట్ ఐరిస్‌, ఒబ్సిడియన్‌, పియానీ, పార్సిలియన్‌ కలర్‌ వేరియంట్స్‌లో లభిస్తుంది.

గూగుల్‌ పిక్సల్‌ 9a స్మార్ట్‌ఫోన్‌ పూర్తి వివరాలు :
పిక్సల్ 9a స్మార్ట్‌ఫోన్‌ 6.3 అంగుళాల Actua (pOLED) డిస్‌ప్లేతో అందుబాటులోకి వచ్చింది. ఈ డిస్‌ప్లే 60Hz -120Hz రీఫ్రెష్‌ రేట్‌, 2700 నిట్స్‌ గరిష్ఠ బ్రైట్‌నెస్‌ను కలిగి ఉంది. ఈ డిస్‌ప్లే కార్నింగ్‌ గ్లాస్‌ 3 రక్షణను పొందుతుంది.

చిప్‌సెట్‌ :
ఈ గూగుల్‌ స్మార్ట్‌ఫోన్ Tensor G4 చిప్‌సెట్‌ తో పనిచేస్తుంది. దీంతోపాటు టైటాన్‌ M2 సెక్యూరిటీ కో ప్రాసెసర్‌ను కలిగి ఉంది. ఈ చిప్‌సెట్ 8GB ర్యామ్‌ + 256GB స్టోరేజీ తో జతచేసి ఉంది. ఈ హ్యాండ్‌సెట్ కేవలం 8GB ర్యామ్ + 256GB స్టోరేజీ వేరియంట్ లో మాత్రమే ఉంది. 7 సంవత్సరాల ఆండ్రాయిడ్‌ OS, సెక్యూరిటీ అప్‌డేట్స్‌ను పొందనుంది.

గూగుల్ పిక్సల్‌ 9a స్మార్ట్‌ఫోన్‌ వెనుక వైపు డ్యూయల్‌ కెమెరాలను కలిగి ఉంది. f/1.7 అపేచర్‌, OIS (ఆప్టికల్‌ ఇమేజ్ స్టెబిలైజేషన్‌), ఆటోఫోకస్‌ 48MP ప్రైమరీ కెమెరాను అమర్చారు. f/2.2 అపేచర్‌, 8x సూపర్ రిజల్యూషన్‌ జూమ్‌, 120 డిగ్రీల ఫీల్డ్‌వ్యూ తో 13MP అల్ట్రావైడ్‌ కెమెరాను కలిగి ఉంది. f/2.2 అపేచర్‌తో 13MP సెల్ఫీ కెమెరాతో అందుబాటులోకి వచ్చింది.

ఈ ఫోన్‌ వెనుక కెమెరాల ద్వారా 60fps వద్ద 4K వీడియోలను రికార్డు చేయవచ్చు. ఈ గూగుల్‌ స్మార్ట్‌ఫోన్‌ అనేక ప్రత్యేక కెమెరా ఫీచర్‌లను కలిగి ఉంది. Magic Eraser, మ్యాక్రో ఫోకస్‌, Add me, నైట్‌ సైట్‌, Reimagine, బెస్ట్‌ టేక్‌, ఫోటో అన్‌బ్లర్‌, పొర్ట్రెయిట్‌ లైట్‌ వంటి ఫీచర్‌లను కలిగి ఉంది.

భారీ బ్యాటరీ :
ఈ హ్యాండ్‌సెట్ 23W ఫాస్ట్ ఛార్జింగ్‌, 7.5W వైర్‌లెస్‌ ఛార్జింగ్‌ తో 5100mAh బ్యాటరీని కలిగి ఉంది. ఒక్కసారి పూర్తిగా ఛార్జింగ్ చేసి 30 గంటల వరకు బ్యాటరీ లైఫ్‌ను పొందవచ్చని సంస్థ చెబుతోంది. IP68 రేటింగ్‌ డస్ట్‌ మరియు వాటర్‌ రెసిస్టెంట్‌గా ఉంది.

భద్రత కోసం ఇన్ డిస్‌ప్లే ఫింగర్‌ ప్రింట్‌ సెన్సార్‌ను కలిగి ఉంది. కనెక్టివిటీ పరంగా 5G, 4G, బ్లూటూత్‌ 5.3, వైఫై 6E, GPS, NavlC, USB-C ఛార్జింగ్ పోర్టును కలిగి ఉంది. దీంతోపాటు యాక్సెలిరోమీటర్‌, మ్యాగ్నటోమీటర్‌, గైరోస్కోప్‌, బారోమీటర్‌, యాంబియంట్‌ లైట్ సెన్సార్‌, ప్రాక్సిమిటీ సెన్సార్‌లను కలిగి ఉంది.

More from GizBot

Best Mobiles in India

English summary
Google pixel 9a smartphone with Tensor G4 Chipset and 5100mAh Battery sale date revealed in india
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X