Home
Mobile

మార్కెట్లోకి గూగుల్ పిక్సల్ స్మార్ట్‌ఫోన్‌లు, 13 నుంచి ప్లిప్‌కార్ట్‌లో

By Sivanjaneyulu Bommu

ఆండ్రాయిడ్ అభిమానులు ఎదురుచూపుల మధ్య తన సరికొత్త పిక్సల్ ఫోన్స్‌ను గూగుల్ మంళవారం రాత్రి ఆవిష్కరించింది. Pixel, Pixel XL మోడల్స్‌లో రాబోతున్న ఈ రెండు హై-ఎండ్ స్మార్ట్‌ఫోన్‌లను HTC కంపెనీ రూపొందించింది. అయితే ఈ ఫోన్‌ల పై ఎక్కడా హెచ్‌టీసీ లోగో కనిపించదు.

మార్కెట్లోకి గూగుల్ పిక్సల్ స్మార్ట్‌ఫోన్‌లు, 13 నుంచి ప్లిప్‌కార్ట్‌లో

Read More : 3జీబి ర్యామ్‌తో నోకియా ఫోన్..? రూ.10,000 రేంజ్‌లో..?

ఈ ఫోన్‌లకు సంబంధించి బాడీ పార్ట్‌ను ఆల్యూమినియమ్ మెటల్ ఇంకా గ్లాస్ మెటీరియల్ కాంబినేషన్‌లో తీర్చిదిద్దటం జరిగింది. మరింత సుకుమారంగా కనిపిస్తోన్న ఈ ఫోన్‌లు కింద పడితే, డ్యామెజీని ఎంత వరకు తట్టుకోగలుగుతాయనేది తెలియాల్సి ఉంది.

విప్లవాత్మక గూగుల్ అసిస్టెంట్ ఫీచర్‌తో..

విప్లవాత్మక గూగుల్ అసిస్టెంట్ ఫీచర్‌తో..

సింపుల్ ఇంకా స్మార్ట్‌గా డిజైన్ కాబడిన గూగుల్ పిక్సల్ ఫోన్‌లు విప్లవాత్మక గూగుల్ అసిస్టెంట్ ఫీచర్‌ను సపోర్ట్ చేస్తున్నాయి. ఇదే సమయంలో ఆండ్రాయిడ్ డేడ్రీమ్ వీఆర్ ప్లాట్‌ఫామ్‌ను కూడా ఈ ఫోన్‌లు సపోర్ట్ చేస్తాయి.

బెస్ట్ క్వాలిటీ కెమెరా..

బెస్ట్ క్వాలిటీ కెమెరా..

స్టోరేజ్ సమస్యలను అధిగమించేందుకు enhanced ఫోటోస్ క్లౌడ్ సపోర్ట్‌ను ఈ డివైసెస్‌లో కల్పిస్తున్నారు. బెస్ట్ క్వాలిటీ కెమెరాలను ఈ ఫోన్‌లలో నిక్షిప్తం చేసినట్లు గూగుల్ చెబుతోంది. ప్రముఖ బెంచ్ మార్కింగ్ సైట్ DxoMarks పిక్సల్ ఫోన్ కమెరాకు 89 స్కోర్ ఇవ్వటం విశేషం.

గూగుల్ Pixel స్పెసిఫికేషన్స్...

గూగుల్ Pixel స్పెసిఫికేషన్స్...

5 అంగుళాల ఫుల్ హైడెఫినిషన్ అమోల్డ్ డిస్‌ప్లే విత్ కార్నింగ్ గ్లాస్ 4 ప్రొటెక్షన్, ఆండ్రాయిడ్ 7.1 నౌగట్ ఆపరేటింగ్ సిస్టం విత్ పక్సల్ లాంచర్, గూగుల్ అసిస్టెంట్, క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 821 2.15గిగాహెర్ట్జ్ ప్రాసెసర్,
4జీబి ర్యామ్,
ఇంటర్నల్ స్టోరేజ్ ఆప్షన్స్ (32జీబి, 128జీబి),
12.3 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా విత్ 1.55 మైక్రాన్ పిక్సల్స్ లెన్స్, ఎఫ్/2.0 అపెర్చుర్, (కెమెరా ప్రత్యేకతలు : స్మార్ట్‌ బరస్ట్ ఫీచర్, ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్, 4కే వీడియో రికార్డింగ్ సపోర్ట్),
8 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా, పిక్సల్ ఇంప్రింట్ ఫింగర్ ప్రింట్ సెన్సార్,
ఎన్ఎఫ్‌సీ, యూఎస్బీ టైప్ సీ సపోర్ట్, బ్లుటూత్ 4.2, 3.5ఎమ్ఎమ్ ఆడియో జాక్,
2,700 ఎమ్ఏహెచ్ బ్యాటరీ.

 గూగుల్ Pixel XL స్పెసిఫికేషన్స్...

గూగుల్ Pixel XL స్పెసిఫికేషన్స్...

5.5 అంగుళాల ఫుల్ హైడెఫినిషన్ అమోల్డ్ డిస్‌ప్లే విత్ కార్నింగ్ గ్లాస్ 4 ప్రొటెక్షన్,
ఆండ్రాయిడ్ 7.1 నౌగట్ ఆపరేటింగ్ సిస్టం విత్ పక్సల్ లాంచర్, గూగుల్ అసిస్టెంట్,
క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 821 2.15గిగాహెర్ట్జ్ ప్రాసెసర్,
4జీబి ర్యామ్,
ఇంటర్నల్ స్టోరేజ్ ఆప్షన్స్ (32జీబి, 128జీబి),
12.3 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా విత్ 1.55 మైక్రాన్ పిక్సల్స్ లెన్స్, ఎఫ్/2.0 అపెర్చుర్, (కెమెరా ప్రత్యేకతలు : స్మార్ట్ బరస్ట్ ఫీచర్, ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్, 4కే వీడియో రికార్డింగ్ సపోర్ట్),
8 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా, పిక్సల్ ఇంప్రింట్ ఫింగర్ ప్రింట్ సెన్సార్,
ఎన్ఎఫ్‌సీ, యూఎస్బీ టైప్ సీ సపోర్ట్, బ్లుటూత్ 4.2, 3.5ఎమ్ఎమ్ ఆడియో జాక్,
3,450 ఎమ్ఏహెచ్ బ్యాటరీ.

అప్‌డేట్స్ వాటంతటకవే..

అప్‌డేట్స్ వాటంతటకవే..

పిక్సల్ ఫోన్‌లలో సాఫ్ట్‌వేర్ అప్‌డేట్స్ వాటంతటకవే ఇన్‌స్టాల్ అయిపోతుంటాయి. అంతేకాకుండా ఈ ఫోన్‌ల పై గూగుల్ సరికొత్త సర్వీసెస్‌ను ఆఫర్ చేస్తోంది.

24/7 లైవ్ కస్టమర్ కేర్ సపోర్ట్‌..

24/7 లైవ్ కస్టమర్ కేర్ సపోర్ట్‌..

ఈ ఫోన్‌లకు 24/7 లైవ్ కస్టమర్ కేర్ సపోర్ట్‌ను గూగుల్ కల్పిస్తుంది. ఫోన్‌లో తలెత్తిన సమస్యలను అప్పటికప్పుడు గూగుల్ టెక్నీషియన్స్ మీ ఫోన్ స్ర్కీన్‌ను షేర్ చేసుకుని లైవ్‌లో సమస్యలను పరిష్కరిస్తారు.

అక్టోబర్ 13 నుంచి ఫ్లిప్‌కార్ట్‌లో..

అక్టోబర్ 13 నుంచి ఫ్లిప్‌కార్ట్‌లో..

ఇండియన్ మార్కెట్లో గూగుల్ పిక్సల్ ఫోన్‌లు ధరలు రూ.57,000 దగ్గర నుంచి ప్రారంభమవుతాయి. అక్టోబర్ 13 నుంచి ఫ్లిప్‌కార్ట్‌లో ప్రీ-బుకింగ్స్ ప్రారంభమవుతాయి.

Best Mobiles in India

English summary
Google Pixel phones launched: Release date, specs and pricing. Read More in Telugu Gizbot..
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X