గూగుల్ పిక్సల్ ఫోన్‌ల పై రూ.26,000 వరకు డిస్కౌంట్

పెద్దనోట్ల రద్దు నేపథ్యంలో ఆర్థిక ఇబ్బందులు రిత్యా ప్రీమియమ్ రేంజ్ స్మార్ట్‌ఫోన్‌లను కొనుగోలు చేసేందుకు స్మార్ట్‌ఫోన్ ప్రియులు సందేహిస్తోన్న నేపథ్యంలో ప్రముఖ ఈ-కామర్స్ వెబ్‌సైట్ ఫ్లిప్‌కార్ట్ 'Pixel Exchange Festival' పేరుతో సరికొత్త ఎక్స్‌ఛేంజ్ ఆఫర్‌ను మార్కెట్లో లాంచ్ చేసింది.

Read More : ఇంటర్నెట్‌కు అతుక్కుపోతున్నారా..?

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

రూ.26,000 వరకు ఎక్స్‌ఛేంజ్

ఈ ఆఫర్‌లో భాగంగా కండీషన్‌లో ఉన్న మీ పాత స్మార్ట్‌ఫోన్‌ను గూగుల్ సొంత స్మార్ట్‌ఫోన్ అయిన గూగుల్ పిక్సల్ ఫోన్‌లతో అప్‌గ్రేడ్ చేసుకోవచ్చు. మీ ఫోన్ కండీషన్‌ను బట్టి రూ.26,000 వరకు మీకు ఎక్స్‌ఛేంజ్ లభించే అవకాశం ఉంటుంది. నవంబర్ 18 నుంచి
నవంబర్ 25 వరకు ఈ ఆఫర్ అందుబాటులో ఉంటుంది.

అదనపు ఆఫర్లు కూడా...

యాక్సిస్ బ్యాంక్ బజ్ క్రెడిట్ కార్డ్ యూజర్లకు 5శాతం అదనపు తగ్గింపును ఫ్లిప్‌కార్ట్ ఆఫర్ చేస్తోంది. ఇదే సమయంలో హెచ్‌‌డీఎఫ్‌సీ క్రెడిట్ కార్డ్ కస్టమర్‌లకు రూ.7,000 వరకు తగ్గింపును ఫ్లిప్‌కార్ట్ అందించే ప్రయత్నం చేస్తోంది.

రెండు మోడల్స్‌లో..

మార్కెట్లో గూగుల్ పిక్సల్ స్మార్ట్‌ఫోన్‌లు రెండు మోడల్స్‌లో అందుబాటులో ఉంది. వాటి వివరాలు.. గూగుల్ పిక్సల్, గూగుల్ పిక్సల్ ఎక్స్ఎల్. వివిధ స్టోరేజ్ వేరియంట్‌లలో ఈ ఫోన్‌లు లభ్యమవుతున్నాయి. గూగుల్ పిక్సల్ 32జీబి వేరియంట్ ధర రూ.55,750, గూగుల్ పిక్సల్ ఎక్స్ఎల్ 32జీబి వేరియంట్ ధర రూ.66,990.

లేటెస్ట్ ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్స్ బెస్ట్ ఆన్‌లైన్ డీల్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

ఆల్యూమినియమ్ ఇంకా గ్లాస్ కాంభినేషన్..

ఈ ఫోన్‌లకు సంబంధించి బాడీ పార్ట్‌ను ఆల్యూమినియమ్ మెటల్ ఇంకా గ్లాస్ మెటీరియల్ కాంబినేషన్‌లో తీర్చిదిద్దటం జరిగింది. మరింత సుకుమారంగా కనిపిస్తోన్న ఈ ఫోన్‌లు కింద పడితే, డ్యామెజీని ఎంత వరకు తట్టుకోగలుగుతాయనేది తెలియాల్సి ఉంది.

విప్లవాత్మక గూగుల్ అసిస్టెంట్ ఫీచర్‌..

సింపుల్ ఇంకా స్మార్ట్‌గా డిజైన్ కాబడిన గూగుల్ పిక్సల్ ఫోన్‌లు విప్లవాత్మక గూగుల్ అసిస్టెంట్ ఫీచర్‌ను సపోర్ట్ చేస్తున్నాయి. ఇదే సమయంలో ఆండ్రాయిడ్ డేడ్రీమ్ వీఆర్ ప్లాట్‌ఫామ్‌ను కూడా ఈ ఫోన్‌లు సపోర్ట్ చేస్తాయి.

బెస్ట్ క్వాలిటీ కెమెరా

స్టోరేజ్ సమస్యలను అధిగమించేందుకు enhanced ఫోటోస్ క్లౌడ్ సపోర్ట్‌ను ఈ డివైసెస్‌లో కల్పిస్తున్నారు. బెస్ట్ క్వాలిటీ కెమెరాలను ఈ ఫోన్‌లలో నిక్షిప్తం చేసినట్లు గూగుల్ చెబుతోంది. ప్రముఖ బెంచ్ మార్కింగ్ సైట్ DxoMarks పిక్సల్ ఫోన్ కమెరాకు 89 స్కోర్ ఇవ్వటం విశేషం.

గూగుల్ Pixel స్పెసిఫికేషన్స్...

5 అంగుళాల ఫుల్ హైడెఫినిషన్ అమోల్డ్ డిస్‌ప్లే విత్ కార్నింగ్ గ్లాస్ 4 ప్రొటెక్షన్, ఆండ్రాయిడ్ 7.1 నౌగట్ ఆపరేటింగ్ సిస్టం విత్ పక్సల్ లాంచర్, గూగుల్ అసిస్టెంట్, క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 821 2.15గిగాహెర్ట్జ్ ప్రాసెసర్, 4జీబి ర్యామ్, ఇంటర్నల్ స్టోరేజ్ ఆప్షన్స్ (32జీబి, 128జీబి), 12.3 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా విత్ 1.55 మైక్రాన్ పిక్సల్స్ లెన్స్, ఎఫ్/2.0 అపెర్చుర్, (కెమెరా ప్రత్యేకతలు : స్మార్ట్‌ బరస్ట్ ఫీచర్, ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్, 4కే వీడియో రికార్డింగ్ సపోర్ట్), 8 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా, పిక్సల్ ఇంప్రింట్ ఫింగర్ ప్రింట్ సెన్సార్, ఎన్ఎఫ్‌సీ, యూఎస్బీ టైప్ సీ సపోర్ట్, బ్లుటూత్ 4.2, 3.5ఎమ్ఎమ్ ఆడియో జాక్, 2,700 ఎమ్ఏహెచ్ బ్యాటరీ.

గూగుల్ Pixel XL స్పెసిఫికేషన్స్...

5.5 అంగుళాల ఫుల్ హైడెఫినిషన్ అమోల్డ్ డిస్‌ప్లే విత్ కార్నింగ్ గ్లాస్ 4 ప్రొటెక్షన్, ఆండ్రాయిడ్ 7.1 నౌగట్ ఆపరేటింగ్ సిస్టం విత్ పక్సల్ లాంచర్, గూగుల్ అసిస్టెంట్, క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 821 2.15గిగాహెర్ట్జ్ ప్రాసెసర్, 4జీబి ర్యామ్, ఇంటర్నల్ స్టోరేజ్ ఆప్షన్స్ (32జీబి, 128జీబి), 12.3 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా విత్ 1.55 మైక్రాన్ పిక్సల్స్ లెన్స్, ఎఫ్/2.0 అపెర్చుర్, (కెమెరా ప్రత్యేకతలు : స్మార్ట్ బరస్ట్ ఫీచర్, ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్, 4కే వీడియో రికార్డింగ్ సపోర్ట్), 8 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా, పిక్సల్ ఇంప్రింట్ ఫింగర్ ప్రింట్ సెన్సార్, ఎన్ఎఫ్‌సీ, యూఎస్బీ టైప్ సీ సపోర్ట్, బ్లుటూత్ 4.2, 3.5ఎమ్ఎమ్ ఆడియో జాక్, 3,450 ఎమ్ఏహెచ్ బ్యాటరీ.

అప్‌డేట్స్ వాటంతటకవే..

పిక్సల్ ఫోన్‌లలో సాఫ్ట్‌వేర్ అప్‌డేట్స్ వాటంతటకవే ఇన్‌స్టాల్ అయిపోతుంటాయి. అంతేకాకుండా ఈ ఫోన్‌ల పై గూగుల్ సరికొత్త సర్వీసెస్‌ను ఆఫర్ చేస్తోంది.

24/7 లైవ్ కస్టమర్ కేర్ సపోర్ట్‌..

ఈ ఫోన్‌లకు 24/7 లైవ్ కస్టమర్ కేర్ సపోర్ట్‌ను గూగుల్ కల్పిస్తుంది. ఫోన్‌లో తలెత్తిన సమస్యలను అప్పటికప్పుడు గూగుల్ టెక్నీషియన్స్ మీ ఫోన్ స్ర్కీన్‌ను షేర్ చేసుకుని లైవ్‌లో సమస్యలను పరిష్కరిస్తారు.

లేటెస్ట్ ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్స్ బెస్ట్ ఆన్‌లైన్ డీల్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Google Pixel, Pixel XL Available With Up to Rs. 26,000 Discount in Flipkart Exchange Offer. Read More in Telugu Gizbot...
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot